తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Daily Serials On Aha Ott: ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న సీరియ‌ల్స్ ఇవే - ఫ్రీగా చూడొచ్చు

Telugu Daily Serials on Aha OTT: ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న సీరియ‌ల్స్ ఇవే - ఫ్రీగా చూడొచ్చు

15 March 2023, 13:21 IST

  • Telugu Daily Serials in Aha OTT: ఆహా ఓటీటీలో సినిమాలు, సిరీస్‌ల‌తో పాటు రెండు డైలీ సీరియ‌ల్స్ స్ట్రీమింగ్ అవుతోన్నాయి. ఆ సీరియ‌ల్స్‌ను ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా చూడొచ్చు. ఆ సీరియ‌ల్స్ ఏవంటే...

మందాకిని
మందాకిని

మందాకిని

Telugu Daily Serials in Aha OTT: టీవీల్లోనే కాదు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో డైలీ సీరియ‌ల్స్ చూడొచ్చు. ప్ర‌స్తుతం ఆహా ఓటీటీలో రెండు తెలుగు సీరియ‌ల్స్ స్ట్రీమింగ్‌ అవుతోన్నాయి. ఈ రెండు సిరీయ‌ల్స్‌ను ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా చూడొచ్చు. మార్చి 6వ తేదీ నుంచి మందాకిని అనే డైలీ సీరియ‌ల్‌ను ప్రారంభించింది ఆహా ఓటీటీ.

ట్రెండింగ్ వార్తలు

Kalvan Review: కాల్వన్ రివ్యూ - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజైన‌ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Jr NTR Donation: ఏపీలోని ఆలయానికి భారీ విరాళం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్: వివరాలివే

Krishna mukunda murari serial: కృష్ణకి పట్టపగలే చుక్కలు చూపిస్తానన్న ముకుంద.. మీరా మీద డౌట్ పడిన తింగరి

Guppedantha Manasu Serial: యాక్టింగ్‌లో వ‌సుధార‌ను మించిన‌ శైలేంద్ర - మోస‌పోయిన రాజీవ్ - మ‌ను కోసం రిషి భార్య రిస్క్‌

సోషియా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సీరియ‌ల్ సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు ప్ర‌తిరోజు మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ప్రీమియ‌ర్ ఉంటుంది. ఒక‌వేళ ఏదైనా ఎపిసోడ్ మిస్స‌యినా దానిని మ‌ళ్లీ చూసుకునే వెసులుబాటును క‌ల్పించింది ఆహా ఓటీటీ. ఈ సీరియ‌ల్‌లో ఆర్‌కే చంద్ర‌న్‌, హిమ‌బిందు, ప్రియా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. మందాకినితో పాటు మిస్ట‌ర్ పెళ్లాం అనే మ‌రో డైలీ సీరియ‌ల్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు ప్ర‌తిరోజు మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు ఈ సీరియ‌ల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ఈ సీరియ‌ల్‌లో అమ‌ర్‌దీప్ చౌద‌రి, పూజామూర్తి, సోనియా కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. . భిన్న క‌ల‌లు క‌లిగిన ముగ్గురి జీవితాలు విధి కార‌ణంగా ఎలాంటి మ‌లుపులు తిరిగాయ‌నే పాయింట్‌తో ఈ సీరియ‌ల్‌ను తెర‌కెక్కించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం