తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mammootty |త‌న‌యుడి బాట‌లోనే తండ్రి...మ‌మ్ముట్టి డిజిట‌ల్ ఎంట్రీ

mammootty |త‌న‌యుడి బాట‌లోనే తండ్రి...మ‌మ్ముట్టి డిజిట‌ల్ ఎంట్రీ

HT Telugu Desk HT Telugu

02 May 2022, 10:39 IST

  • మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్ర ఫుజూ డైరెక్ట్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానుంది.

దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి
దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి (twitter)

దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి

ఐదు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో ఐదు వంద‌ల‌కుపైగా సినిమాల్లో న‌టించారు మ‌ల‌యాళ క‌థానాయ‌కుడు మ‌మ్ముట్టి. లాంగ్ కెరీర్ లో క‌థాంశాలు, పాత్ర‌ల ప‌రంగా ఎన్నో ప్ర‌యోగాలు చేసి విజ‌యాల్ని అందుకున్నారు. తాజాగా మ‌రో ఎక్స్‌పీరిమెంట్‌కు మ‌మ్ముట్టి రెడీ అవుతున్నారు. త్వ‌ర‌లో డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న ఫుజూ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం మే 13న సోని లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా రిలీజ్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

ఆదివారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలచేశారు. తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. దూరమైన భార్య తాలూకు జ్ఞాప‌కాల్ని తల్చుకుంటూ మదనపడే వ్యక్తిగా ఇందులో మమ్ముట్టి కనిపిస్తున్నారు. నెగెటివ్ షేడ్స్ లో అత‌డి క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని స‌మాచారం. ఈ సినిమాలో పార్వతి కథానాయికగా నటిస్తోంది. ర‌తీనా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ముమ్మట్టి ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో థియేటర్లను స్కిప్ చేస్తున్న తొలి సినిమా ఇదే. ఇటీవలే సెల్యూట్ సినిమాతో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కూడా సోనిలివ్ లోనే విడుదలైంది. తాజాగా త‌న‌యుడి బాట‌లోనే తండ్రి అడుగులు వేయ‌డం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం