తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable With Nbk: మ‌రోసారి బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌కు గెస్ట్‌గా మ‌హేష్ - ఈ సారి త్రివిక్ర‌మ్‌తో క‌లిసి…

Unstoppable With Nbk: మ‌రోసారి బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌కు గెస్ట్‌గా మ‌హేష్ - ఈ సారి త్రివిక్ర‌మ్‌తో క‌లిసి…

13 December 2023, 10:06 IST

  • Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ టాక్ షోకు మ‌హేష్‌బాబు సెకండ్ టైమ్ గెస్ట్‌గా రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గుంటూరు కారం ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా అన్‌స్టాప‌బుల్ షోకు డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌తో క‌లిసి మ‌హేష్ బాబు అటెండ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం.

బాల‌కృష్ణ, మ‌హేష్‌బాబు
బాల‌కృష్ణ, మ‌హేష్‌బాబు

బాల‌కృష్ణ, మ‌హేష్‌బాబు

Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ టాక్ షోకు మ‌రోసారి మ‌హేష్‌బాబు గెస్ట్‌గా రాబోతున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న గుంటూరు కారం ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మ‌హేష్‌బాబు బాల‌య్య షోకు గెస్ట్‌గా హాజ‌రుకానున్న‌ట్లు చెబుతోన్నారు. ఈ సారి అత‌డితో క‌లిసి త్రివిక్ర‌మ్ కూడా బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోకు అటెండ్ కానున్న‌ట్లు స‌మాచారం. మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ అన్‌స్టాప‌బుల్‌కు గెస్ట్‌లు రానున్నవిష‌యాన్ని త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

మ‌హేష్ సెకండ్ టైమ్‌...

అన్‌స్టాప‌బుల్ షోకు మ‌హేష్ బాబు గెస్ట్‌గా రావ‌డం ఇది రెండోసారి. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ వ‌న్ ఫైన‌ల్ ఎపిసోడ్‌కు మ‌హేష్‌బాబు గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు. ఆ స‌మ‌యంలో త్రివిక్ర‌మ్‌ను షోకు తీసుకువ‌స్తాన‌ని బాల‌కృష్ణ‌కు మ‌హేష్‌బాబు మాట ఇచ్చారు. బాల‌కృష్ణ‌కు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవ‌డం కోసం ఈ సారి త్రివిక్ర‌మ్‌తో క‌లిసి అన్‌స్టాప‌బుల్ షోకు మ‌హేష్ బాబు హాజ‌ర‌వుతోన్న‌ట్లు చెబుతోన్నారు.

మ‌రోవైపు గుంటూరు కారం ప్ర‌మోష‌న్స్ కూడా అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్ బాగా క‌లిసివ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది. అందుకే అన్‌స్టాప‌బుల్‌కు రెండోసారి గెస్ట్‌గా రావ‌డానికి మ‌హేష్ అంగీక‌రించాడ‌ని అంటున్నారు. జ‌న‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లోనే మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

సంక్రాంతికి గుంటూరు కారం...

గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానుంది. గుంటూరు బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ కాంబోలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను హారిక హాసిని సంస్థ నిర్మిస్తోంది.

యానిమ‌ల్ త‌ర్వాత‌...

అన్‌స్టాప‌బుల్ మూడో సీజ‌న్‌ను ఇటీవ‌లే మొద‌లైంది. ఇప్ప‌టివ‌ర‌కు భ‌గ‌వంత్ కేస‌రితో పాటు యానిమ‌ల్ టీమ్‌తో బాల‌కృష్ణ ఈ షోలో సంద‌డి చేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం