Rashmika Mandanna: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్‌షోకు గెస్టులుగా ర‌ణ్‌బీర్‌, ర‌ష్మిక మంద‌న్న‌?-ranbir kapoor rashmika mandanna to arrive as guests for balakrishna unstoppable show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ranbir Kapoor Rashmika Mandanna To Arrive As Guests For Balakrishna Unstoppable Show

Rashmika Mandanna: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్‌షోకు గెస్టులుగా ర‌ణ్‌బీర్‌, ర‌ష్మిక మంద‌న్న‌?

Nelki Naresh Kumar HT Telugu
Nov 09, 2023 05:54 AM IST

Rashmika Mandanna: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు యానిమ‌ల్ హీరోహీరోయిన్లు ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న గెస్ట్ లుగా రాబోతున్న‌ట్లు తెలిసింది. న‌వంబ‌ర్ లాస్ట్ వీక్‌లో ఈ స్పెష‌ల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఉండ‌బోతున్న‌ట్లు తెలిసింది.

ర‌ష్మిక మంద‌న్న,ర‌ణ్‌బీర్‌క‌పూర్‌,
ర‌ష్మిక మంద‌న్న,ర‌ణ్‌బీర్‌క‌పూర్‌,

Rashmika Mandanna: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షో కొత్త సీజ‌న్ ఇటీవ‌లే మొద‌లైంది. లిమిటెడ్ ఎడిష‌న్ పేరుతో స్పెష‌ల్‌గా మొద‌లైన ఈ సీజ‌న్‌కు గెస్ట్‌గా బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్‌క‌పూర్ రాబోతున్న‌ట్లు స‌మాచారం. అత‌డితో పాటు నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక‌ మంద‌న్న‌, డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు

యానిమ‌ల్ మూవీ తెలుగు ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా వారు అన్‌స్టాప‌బుల్‌ షోకు గెస్టులుగా రాబోతున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ర‌ణ్‌బీర్‌, ర‌ష్మిక, సందీప్ వంగా స్పెష‌ల్ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ మొద‌లుకానున్న‌ట్లు చెబుతోన్నారు. న‌వంబ‌ర్ లాస్ట్ వీక్‌లో ఈ ఎపిసోడ్ రిలీజ్ కానున్న‌ట్లు తెలిసింది.

అన్‌స్టాపబుల్ షోకు గెస్ట్‌గా హాజ‌రుకానున్న‌ ఫ‌స్ట్ బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్‌ క‌పూర్ కావ‌డం గ‌మ‌నార్హం. కాగా యానిమ‌ల్ మూవీ డిసెంబ‌ర్ 1న రిలీజ్ కాబోతోంది. తండ్రీకొడుకుల అనుబంధం నేప‌థ్యంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఈ సినిమాలో ర‌ణ్‌బీర్‌ తండ్రిగా అనిల్ క‌పూర్ న‌టిస్తోండ‌గా...బాలీవుడ్ సీనియ‌ర్ హీరో బాబీ డియోల్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్‌తో టీ సిరీస్ సంస్థ‌తో క‌లిసి సందీప్ వంగా యానిమ‌ల్ మూవీని నిర్మించాడు. తొలుత ఈ సినిమాను ఆగ‌స్ట్‌లో రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో డిసెంబ‌ర్‌కు వాయిదాప‌డింది.

ఈ సినిమాలో ర‌ణ్‌బీర్‌క‌పూర్‌కు జోడీగా ప‌రిణీతి చోప్రాను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. కానీ డేట్ ఇష్యూతో ప‌రిణీతి త‌ప్పుకోవ‌డం ఆ స్థానాన్ని ర‌ష్మిక మంద‌న్న‌తో భ‌ర్తీ చేశారు. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.