Unstoppable With Nbk: అన్‌స్టాప‌బుల్ కొత్త సీజ‌న్ ఫ‌స్ట్ గెస్ట్‌లు క‌న్ఫామ్‌ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-unstoppable with nbk aha ott reveals first guests of unstoppable with nbk third season ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Unstoppable With Nbk Aha Ott Reveals First Guests Of Unstoppable With Nbk Third Season

Unstoppable With Nbk: అన్‌స్టాప‌బుల్ కొత్త సీజ‌న్ ఫ‌స్ట్ గెస్ట్‌లు క‌న్ఫామ్‌ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Oct 12, 2023 06:35 AM IST

Unstoppable With Nbk: అన్‌స్టాప‌బుల్ కొత్త సీజ‌న్‌కు ఫ‌స్ట్ గెస్ట్‌లు ఎవ‌ర‌న్న‌ది రివీలైంది. భ‌గ‌వంత్ కేస‌రి హీరోయిన్లు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రీలీల‌తో అన్‌స్టాప‌బుల్ నెక్స్ట్ సీజ‌న్‌ను బాల‌కృష్ణ మొద‌లుపెట్ట‌బోతున్నారు. అక్టోబ‌ర్ 17న కొత్త సీజ‌న్ ఫ‌స్ట్ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

బాల‌కృష్ణ‌, అనిల్ రావిపూడి, కాజ‌ల్‌, శ్రీలీల‌, అర్జున్ రాంపాల్‌
బాల‌కృష్ణ‌, అనిల్ రావిపూడి, కాజ‌ల్‌, శ్రీలీల‌, అర్జున్ రాంపాల్‌

Unstoppable With Nbk: బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న అన్‌స్టాప‌బుల్ కొత్త సీజ‌న్ త్వ‌ర‌లో మొద‌లుకాబోతోంది. అన్‌స్టాప‌బుల్ లిమిటెడ్ ఎడిష‌న్‌గా ప్రారంభం కానున్న ఈ మూడో సీజ‌న్‌కు ఫ‌స్ట్ గెస్ట్‌లు ఎవ‌ర‌న్న‌ది క‌న్ఫామ్ అయ్యింది. తాను హీరోగా న‌టించిన‌ భ‌గ‌వంత్ కేస‌రి మూవీ టీమ్‌తోనే అన్‌స్టాప‌బుల్ న్యూ సీజ‌న్‌ను బాల‌కృష్ణ మొద‌లుపెట్ట‌బోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

శ్రీలీల‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో పాటు అనిల్ రావిపూడి, అర్జున్ రాంపాల్‌ అన్‌స్టాప‌బుల్ షో ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్‌లుగా రానున్నారు. అక్టోబ‌ర్ 17న భ‌గ‌వంత్ కేస‌రి టీమ్ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ అవుతుంద‌ని ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అనౌన్స్‌చేసింది. మ‌రో సంచ‌ల‌నానికి అంతా సిద్ధం...అన్‌స్టాప‌బుల్ లిమిటెడ్ ఎడిష‌న్ అవుతోంది ఆరంభం. భ‌గ‌వంత్ కేస‌రి టీమ్‌తో అంటూ ఆహా ఓటీటీ సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది.

చిరంజీవి, కేటీఆర్‌…

అన్‌స్టాప‌బుల్ లిమిటెడ్ ఎడిష‌న్‌కు చిరంజీవి, కేటీఆర్‌తో పాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు గెస్ట్‌లుగా రాబోతున్న‌ట్లు స‌మాచారం. వీరితో పాటు మ‌రికొంద‌రు యంగ్ హీరోలు కూడా షోకు హాజ‌ర‌య్యే గెస్ట్‌ల లిస్ట్‌లో ఉన్న‌ట్లు తెలిసింది. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 1, సీజ‌న్ 2 పెద్ద స‌క్సెస్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో అన్‌స్టాప‌బుల్ లిమిటెడ్ ఎడిష‌న్ సీజ‌న్‌పై భారీగా ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి.

తెలుగులో స‌క్సెస్‌ఫుల్ టాక్‌షోల‌లో ఒక‌టిగా అన్‌స్టాప‌బుల్ నిలిచింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, ప్ర‌భాస్ వంటి స్టార్లు బాల‌కృష్ణ షోకు గెస్ట్‌లుగా రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ షోలో హోస్ట్‌గా బాల‌కృష్ణ త‌న‌దైన శైలిలో పంచ్‌లు వేస్తూ గెస్ట్‌ల‌ను ప్ర‌శ్న‌లు అడిగిన తీరు హైలైట్ అయ్యింది.

బాల‌కృష్ణ హీరోగా న‌టించిన భ‌గ‌వంత్ కేస‌రి మూవీ అక్టోబ‌ర్ 19న రిలీజ్ కానుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. భ‌గ‌వంత్ కేస‌రి త‌ర్వాత బాబీ డైరెక్ష‌న్‌లో త‌న నెక్స్ట్ సినిమాను చేయ‌బోతున్నాడు బాల‌కృష్ణ‌.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.