తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lavanya Tripathi: వ‌రుణ్ ఫ్యామిలీ ఎలాంటి కండీష‌న్స్ పెట్ట‌లేదు - కెరీర్‌పై లావ‌ణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Lavanya Tripathi: వ‌రుణ్ ఫ్యామిలీ ఎలాంటి కండీష‌న్స్ పెట్ట‌లేదు - కెరీర్‌పై లావ‌ణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

23 January 2024, 10:29 IST

  • Lavanya Tripathi: పెళ్లి త‌ర్వాత సినిమాలు, క్యారెక్ట‌ర్స్ ఎంపిక‌లో వ‌రుణ్‌తేజ్‌తో పాటు అత‌డి ఫ్యామిలీ త‌న‌కు ఎలాంటి కండీష‌న్స్ పెట్ట‌లేద‌ని లావ‌ణ్య త్రిపాఠి అన్న‌ది.  మిస్ ప‌ర్‌ఫెక్ట్ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో మెగా కోడ‌లి ట్యాగ్‌పై లావ‌ణ్య త్రిపాఠి స్పందించింది.

లావ‌ణ్య త్రిపాఠి
లావ‌ణ్య త్రిపాఠి

లావ‌ణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మిస్ ప‌ర్‌ఫెక్ట్ అనే వెబ్‌సిరీస్‌తో త్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది మెగా కోడ‌లు లావ‌ణ్య త్రిపాఠి. వ‌రుణ్‌తేజ్‌తో పెళ్లి త‌ర్వాత లావ‌ణ్య త్రిపాఠి చేస్తోన్న ఫ‌స్ట్ వెబ్‌సిరీస్ ఇది. ఫిబ్ర‌వ‌రి 2 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో మిస్ ప‌ర్‌ఫెక్ట్ వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో మెగా కోడ‌లి అనే ట్యాగ్‌తో పాటు వ‌రుణ్‌తేజ్‌తో సినిమాపై లావ‌ణ్య త్రిపాఠి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఆ భేదాలు నాకు లేవు...

మిస్ ప‌ర్‌ఫెక్ట్‌కు ముందు కెరీర్‌లో గ్యాప్ రావ‌డంపై లావ‌ణ్య త్రిపాఠి స్పందిస్తూ ఓటీటీ, సినిమాలు అనే భేదాలు నాకు లేవ‌ని, న‌చ్చిన క‌థ‌లను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నాన‌ని లావ‌ణ్య త్రిపాఠి చెప్పింది. మిస్ ప‌ర్‌ఫెక్ట్ వెబ్‌సిరీస్‌తో పాటు ప్ర‌స్తుతం రెండు సినిమాలు కూడా చేస్తున్నాన‌ని తెలిపింది. అందులో ఒక‌టి త‌మిళ సినిమా అని లావ‌ణ్య త్రిపాఠి అన్న‌ది.

ప‌ర్‌ఫెక్ష‌న్ కూడా స‌మ‌స్య‌నే...

రియ‌ల్ లైఫ్‌లో మీరు ఎంత వ‌ర‌కు ప‌ర్‌ఫెక్ట్ అని అడిగిన ప్ర‌శ్న‌కు...ప‌ర్‌ఫెక్ష‌న్ కూడా ఓ స‌మ‌స్య అని చెప్పింది లావ‌ణ్య త్రిపాఠి. ప‌ర్‌ఫెక్ష‌న్ వ‌ల్ల జీవితంలో కొన్ని కోల్పోవాల్సివ‌స్తుంద‌ని అన్న‌ది. రియ‌ల్‌లైఫ్‌లో తాను ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ కాద‌ని అన్న‌ది. త‌న‌ కంటే భ‌ర్త వ‌రుణ్ తేజ్ చాలా ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ అని లావ‌ణ్య త్రిపాఠి చెప్పింది. వ‌రుణ్ తేజ్‌కు కొంచె ఓసీడీ కూడా ఉంద‌ని ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో లావ‌ణ్య త్రిపాఠి ఫ‌న్నీ కామెంట్స్ చేసింది.

మెగా కోడ‌లి ట్యాగ్‌...

అలాగే మెగా కోడ‌లు అనే ట్యాగ్ న‌టిగా త‌న బాధ్య‌త‌ను పెంచింద‌ని లావ‌ణ్య త్రిపాఠి అన్న‌ది. లావ‌ణ్య త్రిపాఠి అన్న పేరును క‌ష్ట‌ప‌డి తాను నిల‌బెట్టుకున్నాన‌ని, మెగా కోడ‌లు అనే పిలుపు వ‌రుణ్‌తేజ్‌తో పెళ్లి ద్వారా త‌న‌కు వ‌చ్చింద‌ని చెప్పింది. మెగా కోడ‌లు అనే ట్యాగ్ ను తాను ఓ బాధ్య‌త‌గా భావిస్తున్న‌ట్లు తెలిసింది. ఈ పిలుపు చాలా స్పెష‌ల్ అని అన్న‌ది.

ఎలాంటి కండీష‌న్స్ లేవు...

పెళ్లి త‌ర్వాత సినిమాలు, పాత్ర‌ల ఎంపిక‌లో వ‌రుణ్ ఫ్యామిలీ త‌న‌కు ఎలాంటి ఆంక్ష‌లు, కండీష‌న్స్ పెట్ట‌లేద‌ని అన్న‌ది. ఇలాంటి పాత్ర‌లు చేయ‌ద్దు అనే మాట‌లు ఎప్పుడు చెప్ప‌లేదు. కెరీర్ ప‌రంగా ఫుల్ స‌పోర్ట్‌గా నిలుస్తున్నారు. ఎలాంటి సినిమాలు, క్యారెక్ట‌ర్స్ చేయ‌కూడ‌దు, చేయాలి అనే విష‌యంలో నా కంటూ కొన్ని హ‌ద్దులు ఉన్నాయి.పెళ్లి త‌ర్వాత కూడా వాటిని దాట‌కుండా సినిమాలు చేస్తాన‌ని లావ‌ణ్య త్రిపాఠి అన్న‌ది.

వ‌రుణ్‌తేజ్‌తో గ‌తంలో అంత‌రిక్షం, మిస్ట‌ర్ సినిమాలు చేసింది లావ‌ణ్య త్రిపాఠి. మ‌ళ్లీ మంచి క‌థ దొరికితే త‌ప్ప‌కుండా వ‌రుణ్‌తేజ్‌తో సినిమా చేస్తాన‌ని లావ‌ణ్య త్రిపాఠి అన్న‌ది.త‌న మిస్ ప‌ర్‌ఫెక్ట్‌తో పాటు వ‌రుణ్ తేజ్ ఆప‌రేష‌న్ వాలెంటైన్ ఒకే నెల‌లో రిలీజ్ కావ‌డం ఆనందంగా ఉంద‌ని లావ‌ణ్య త్రిపాఠి చెప్పింది.

మిస్ ప‌ర్‌ఫెక్ట్ వెబ్‌సిరీస్‌లో బిగ్‌బాస్ విన్న‌ర్ అభిజీత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. పులి మేక త‌ర్వాత తెలుగులో లావ‌ణ్య త్రిపాఠి చేస్తోన్న వెబ్ సిరీస్ ఇది. మిస్ ప‌ర్‌ఫెక్ట్ వెబ్‌సిరీస్‌కు స్కైలాబ్ మూవీ డైరెక్ట‌ర్ విశ్వ‌క్ ఖండేరావ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం