Kushi Day 5 collections: దారుణంగా పడిపోయిన ఖుషీ కలెక్షన్లు.. నష్టాలు తప్పవా?
06 September 2023, 11:07 IST
- Kushi Day 5 collections: దారుణంగా పడిపోయాయి ఖుషీ మూవీ కలెక్షన్లు. ఫస్ట్ వీకెండ్ మంచి వసూళ్లు సాధించినా.. వీక్ డేస్ లో మాత్రం కలెక్షన్లు పడిపోతున్నాయి. భారీ వర్షాలు కూడా దీనికి ఓ కారణంగా కనిపిస్తున్నాయి.
ఖుషీ మూవీలో విజయ్, సమంత
Kushi Day 5 collections: విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ఖుషీ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని, మ్యూజిక్ బాగుందన్న రివ్యూల మధ్య ఈ సినిమా తొలి మూడు రోజులూ వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసి సులువుగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరుతుందని అనిపించింది.
కానీ సోమవారం పరీక్షను ఖుషీ పాస్ కాలేకపోయింది. తొలి రోజు రూ.30 కోట్లుగా ఉన్న కలెక్షన్లు.. నాలుగో రోజైన సోమవారం కేవలం రూ.2.01 కోట్లకు పడిపోయింది. అంటే ఒకేసారి 80 శాతం మేర కలెక్షన్లు పతనమయ్యాయి. ఆదివారం ఈ కలెక్షన్లు రూ.10 కోట్లుగా ఉన్నాయి. ఇక ఐదో రోజైన మంగళవారం (సెప్టెంబర్ 5) ఈ కలెక్షన్లు మరింత పడిపోయాయి. ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.2 కోట్లే వచ్చాయి. ఆక్యుపెన్సీ కేవలం 19.47 శాతంగానే ఉంది.
సినిమాకు మిశ్రమ స్పందన రావడంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కూడా కలెక్షన్లు పడిపోవడానికి కారణంగా కనిపిస్తోంది. నైజాం, యూఎస్ఏలలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఖుషీ మూవీ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగిల్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో ఖుషీ కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి.
ఆ ప్రాంతాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టమే. ఇక జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీస్ కూడా రానున్న నేపథ్యంలో ఖుషీ కలెక్షన్లు పడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు గురువారం (సెప్టెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మొత్తంగా ఖుషీ తొలి ఐదు రోజుల నెట్ కలెక్షన్లు చూస్తే రూ.39.4 కోట్లు మాత్రమే.
ఖుషీ ఎలా ఉందంటే?
ప్రేమ, పెళ్లి బంధం గొప్పతనాన్ని తన ప్రతి సినిమాలో రియలిస్టిక్‌గా, బలంగా చూపిస్తుంటారు శివ నిర్వాణ. ఆ డెప్త్ ఈ సినిమాలో మిస్సయింది. కశ్మీర్ లవ్ ట్రాక్ నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో విజయ్, సమంత గొడవలు పడటం, విడిపోయే సీన్స్‌లో సిల్లీగా అనిపిస్తాయి.
తమ కుటుంబం సిద్ధాంతాలే గొప్పవని నమ్మే చదరంగం శ్రీనివాసరావు, లెనిన్ సత్యం ఒక్కసారిగా మారిపోవడం కన్వీన్సింగ్‌గా అనిపించదు. కథలోనూ కొత్తదనం లేదు. ఈ పాయింట్‌తో తెలుగులో జోడీ నుంచి ఇటీవల వచ్చిన నాని అంటే సుందరానికి వరకు చాలా సినిమాలొచ్చాయి. అదే కథను మరోసారి చూసిన ఫీలింగ్ కలుగుతుంది. లెంగ్త్ కూడా ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది.