తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kurchi Madathapetti Full Song: ‘కుర్చీని మడతపెట్టి’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. ఊరమాస్ స్టెప్‍లతో దుమ్మురేపిన మహేశ్, శ్రీలీల

Kurchi Madathapetti Full Song: ‘కుర్చీని మడతపెట్టి’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. ఊరమాస్ స్టెప్‍లతో దుమ్మురేపిన మహేశ్, శ్రీలీల

30 December 2023, 16:06 IST

  • Kurchi Madathapetti Full Song: గుంటూరు కారం సినిమా నుంచి ‘కుర్చీని మడతపెట్టి’ అనే మూడో పాట రిలీజ్ అయింది. ఊర మాస్ బీట్‍తో ఈ పాట వచ్చింది. మహేశ్ బాబు, శ్రీలీల డ్యాన్స్ అదిరిపోయింది. 

Kurchi Madathapetti Full Song: ‘కుర్చీని మడతపెట్టి’ ఫుల్ సాంగ్ వచ్చేసింది
Kurchi Madathapetti Full Song: ‘కుర్చీని మడతపెట్టి’ ఫుల్ సాంగ్ వచ్చేసింది

Kurchi Madathapetti Full Song: ‘కుర్చీని మడతపెట్టి’ ఫుల్ సాంగ్ వచ్చేసింది

Kurchi Madathapetti Full Song: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాపై హైప్ పెరుగుతూనే ఉంది. చాలా కాలం తర్వాత మహేశ్ పక్కా మాస్ యాక్షన్ మూవీ చేస్తుండటంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ గుంటూరు కారం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో గుంటూరు కారం సినిమా నుంచి ‘కుర్చీని మడతపెట్టి’ అంటూ మాస్ బీట్‍తో మంచి ఊపున్న పాట నేడు (డిసెంబర్ 30) వచ్చేసింది.

ట్రెండింగ్ వార్తలు

OG Movie: ఓజీ సినిమాలో టబు చేయాల్సిన క్యారెక్టర్ ఎవరికి వెళ్లిందో తెలుసా?

OTT Heroine: ఓటీటీలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్.. ఆమె ముందు స్టార్ హీరోలు సైతం దిగదుడుపే!

NTR Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై కీలక అప్‍డేట్ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పటి నుంచో చెప్పిన టీమ్

OTT Movies This Week: ఓటీటీలో ఈ వారం సినీ పండుగ.. ఏకంగా 21 సినిమాలు.. కానీ 2 మాత్రమే చూడదగినవి.. ఏంటంటే?

గుంటూరు కారం సినిమా నుంచి ‘కుర్చీని మడతపెట్టి’ అంటూ ఈ మూడో పాట వచ్చేసింది. ఈ సాంగ్‍కు మంచి ఊపున్న మాస్ బీట్‍ను సంగీత దర్శకుడు ఎస్.థమన్ అందించారు. సాహితి చాగంటి, శ్రీకృష్ణ ఈ సాంగ్‍ను పాడారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్‍కు హీరో మహేశ్ బాబు, హీరోయిన్ శ్రీలీల ఊరమాస్ స్టెప్‍లు అదిరిపోయాయి. ఆ ఇద్దరు డ్యాన్స్‌తో రెచ్చిపోయారు. గుంటూరు కారం సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణలా కనిపిస్తోంది. “రాజమండ్రి రాగమంజరి.. మాయమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రీ.. కళాకారుల ఫ్యామిలీ మరీ.. మేగజ్జ కడితే నిదరపోదు నిండు రాతిరి” అంటూ ఈ సాంగ్ మొదలైంది. “ఆ కుర్చీని మడతపెట్టి” అంటూ డీజే సాంగ్‍లా ఈ పాట ఉంది. 

అయితే, ఈ ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్ ప్రోమో వచ్చినప్పటి నుంచి పెద్ద చర్చే సాగుతోంది. బూతు పదం వల్ల వైరల్ అయిన డైలాగ్‍తో పాటను సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో పెట్టడం ఏంటనే వాదనలు వినిపిస్తున్నారు. మహేశ్ స్థాయికి ఈ సాంగ్ కరెక్ట్ కాదని అంటున్నారు. మరికొందరేమో.. సినిమా మాస్ యాక్షన్ కావడంతో ఇలాంటి పాట ఉండడంతో కరెక్ట్ అని అంటున్నారు. మహేశ్ మాస్ స్టెప్‍లకు ఫుల్ ఖుషి అవుతున్నారు. 

అతడు, ఖలేజా తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‍లో వస్తున్న మూవీ కావడంతో ‘గుంటూరు కారం’పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్‍గా చేస్తున్నారు. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం, ఈశ్వరి రావు, ప్రకాశ్ రాజు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. హాసినీ, హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ మూవీని నిర్మిస్తున్నారు. జనవరి 12న థియేటర్లలో గుంటూరు కారం రిలీజ్ కానుంది. 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం