తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial January 8th: నిజం ఒప్పుకున్న దేవ్.. షాకైన భవానీ, కుప్పకూలిన ముకుంద

Krishna mukunda murari serial january 8th: నిజం ఒప్పుకున్న దేవ్.. షాకైన భవానీ, కుప్పకూలిన ముకుంద

Gunti Soundarya HT Telugu

08 January 2024, 7:15 IST

google News
    • Krishna mukunda murari serial today january 8th: శ్రీధర్ ని హత్య చేసింది తనేనని దేవ్ అందరి ముందు ఒప్పుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. 
కృష్ణ ముకుంద మురారి జనవరి 8 ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి జనవరి 8 ఎపిసోడ్ (disney plus hotstar)

కృష్ణ ముకుంద మురారి జనవరి 8 ఎపిసోడ్

Krishna mukunda murari serial today january 8th: కృష్ణ ఏడుస్తూ వెళ్లిపోతుంటే మురారి పిలుస్తాడు. అసలు ఏం జరుగుతుంది ఏసీపీ సర్. మా చిన్నాన్న ఇదంతా ఎందుకు చేస్తాడని అంటుంది. నువ్వు ఇదంతా నమ్ముతున్నావా అంటే లేదని చెప్తుంది. దీని వెనుక ఇంకెవరో ఉన్నారు వాళ్ళని మనం కనిపెట్టాలని అంటాడు. అంత అవసరం ఎవరికి ఉంది ముకుందకి తప్ప అని కృష్ణ అంటే మురారి మాత్రం తనకి నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందే కానీ ఒకరిని చంపించాలని ఉండదని చెప్తాడు. జైలుకి వెళ్ళి చిన్నాన్నకి జరిగిన విషయం మొత్తం చెప్తానని అంటుంది.

రింగ్ విషయం ఏమైందోనని పోలీసులకి ఫోన్ చేసి అడుగుతాడు. కృష్ణ జైలుకి వెళ్తుంది. పెద్దపల్లి ప్రభాకర్ తన చిన్నాన్న అని చెప్పగానే పోలీసు అధికారి అతను నిన్న ఎవరినో కొట్టాడు క్రమశిక్షణ కింద వేరే సెల్ లో వేశాము ఎవరూ కలవడానికి వీల్లేదని చెప్తాడు. ముకుందకి మెహందీ పెడుతూ ఉంటారు. అటు కృష్ణ ఇంటి దగ్గర కూర్చుని ఏడుస్తుంది. ఇంతమంది ఉండి కూడా ఏం చేయలేకపోతున్నామని శకుంతల కూడా బాధపడుతుంది. మురారి అప్పుడే వస్తాడు. లగ్గం వద్దని చెప్పి వచ్చావా అని శకుంతల అడుగుతుంది. ఏంటి ఏసీపీ సర్ ఇలా వచ్చారు చివరి సారి చూసి వెళ్దామని వచ్చారాఅని అంటుంది. రేవతి కూడా కృష్ణ దగ్గరకి వచ్చి వెళ్దాం రమ్మని పిలుస్తుంది. నువ్వు ణా కళ్ళెదురే ఉండాలి ఒంటరిగా ఉంటే ఏ అఘాయిత్యం చేసుకుంటావోనని భయంగా ఉందని అంటుంది.

రేపటి నుంచి మాజీ భార్యని అవుతానా

పెళ్లి అయిపోయినట్టు బాధపడుతున్నావ్ ఏంటని మురారి అంటాడు. అటు ఇటు అయితే నేను నీతోనే వచ్చేస్తాను నువ్వు లేకుండా నేను ఉండలేనని రేవతి అనేసరికి కృష్ణ తనని హగ్ చేసుకుని ఏడుస్తుంది. దేవుడు మనకి అన్యాయం చేయడు బాధపడొద్దని ధైర్యం చెప్పేందుకు చూస్తుంది. తెల్లారితే పెళ్లి ఏం చేయలేమా అని శకుంతల ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కృష్ణ మురారిని పట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. 

భవానీ కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మురారిని వదిలి కృష్ణ ఉంటుంది కానీ ముకుంద ఉండలేదు. నేను చేస్తుంది కరెక్ట్ అని మనసులో అనుకుంటుంది. ముకుందని చూసి కృష్ణ రేపటి నుంచి మీకు నేను మాజీ భార్యనా అంటుంది. ఏమైంది నీకు నీ ధైర్యం ఎటు పోయిందని అడుగుతాడు. అలా మాట్లాడొద్దని చెప్తాడు.

దేవ్ కి భవానీ వార్నింగ్ 

నా స్థానం వాళ్ళు తీసుకుంటుంటే చూస్తూ ఉన్నాను. నాది ధైర్యం అని అనడం అనరు. ఇలా చూస్తూ ఉండటం అంటే రాజీపడటం అంటారు. దేన్ని అయినా రాజీ పడొచ్చు కానీ కృష్ణ వెక్కి వెక్కి ఏడుస్తుంది. రేవతి ముకుందని చూస్తూ తనని తాను నిందించుకుంటుంది. 

నా బిడ్డ జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఉంటున్నానని తిట్టుకుంటుంది. నిలదీయాలి కదా అని దేవ్ నందిని వాళ్ళతో అనేసి డైరెక్ట్ గా భవానీ దగ్గరకి వెళతాడు. మీరు చేస్తుంది తప్పని అంటాడు. భవానీ సీరియస్ అవుతుంది. పోనీలే అని వదిలేస్తే నన్నే తప్పు పడుతున్నావా? నేను అన్ని ఆలోచించే చేస్తున్నాను. నాలో లోపం ఉందని చెప్పినందుకు నిన్ను ఇక్కడే షూట్ చేసి పారేసే దాన్ని ముకుంద అన్నవని వదిలేస్తున్నా బీ కేర్ ఫుల్ అని వార్నింగ్ ఇచ్చి భవానీ వెళ్ళిపోతుంది.

దేవ్ ఉంగరం గుర్తు పట్టిన కృష్ణ 

కృష్ణ దేవ్ కి సోరి చెప్పి తన వల్ల అవమానాలు పడుతున్నావని అంటుంది. నేను ఉండి కూడా ఏం చేయలేకపోతున్నానని డ్రామా ఆడతాడు. పెద్దపల్లి ప్రభాకర ని రిలీజ్ చేయిస్తానని ప్రామిస్ చేస్తున్నానని కృష్ణ చేతిలో దేవ్ చేయి వేసి ప్రామిస్ చేస్తాడు. అప్పుడే కృష్ణ దేవ్ చేతికి ఉన్న ఉంగరం చూస్తుంది. వెంటనే తన చొక్కా పట్టుకుని యూ ఛీటర్ అని అరుస్తుంది. 

ఏమైందని అందరూ అడుగుతారు. శ్రీధర్ ని చంపింది వీడేనని చెప్తుంది. అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు. చూడండి అదే రింగ్ అనేసి దేవ్ చేతికి ఉన్న ఉంగరం చూపిస్తుంది. భవానీ వచ్చి ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ శ్రీధర్ ని దేవ్ చంపడం ఏంటని అంటుంది. పెద్దమ్మ కాసేపు ఎవరు మాట్లాడొద్దని చెప్పి మురారి దేవ్ కాలర్ పట్టుకుంటాడు.

చెల్లి ఆనందం కోసమే చంపానన్న దేవ్ 

శ్రీధర్ ని చంపింది నువ్వే కదా ఈ ఉంగరం ముద్ర తన చెంప మీద పడిందని మురారి అడుగుతాడు. సిల్లీ ఏం మాట్లాడుతున్నవ్ బావ ఉంగరం నాదే షాపులో కొన్నాను ఇలాంటిది ఇంకెవరికీ ఉండదా అంటాడు. అప్పుడే పరిమళ పోలీసులని తీసుకుని ఎంట్రీ ఇస్తుంది. నా చెల్లి ఆనందం కోసం నేను ఈ పని చేశానని దేవ్ నేరం ఒప్పుకుంటాడు. అందరూ షాక్ అవుతారు. 

గతంలో భవానీ మురారి, కృష్ణని తప్పుబట్టిన సంఘటనలు గుర్తు చేసుకుంటుంది. కానీ ఈ విషయాలు ముకుందకి తెలియవని దేవ్ చెప్తాడు. ముకుంద కోపంగా దేవ్ ని కొట్టి నాకు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటని ఏడుస్తుంది. పోలీసులు దేవ్ న్ అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం