Krishna mukunda murari serial january 30th: ఇప్పటికీ మురారీనే ప్రేమిస్తున్న ముకుంద.. భవానీకి నిజం చెప్పేసిన ఆదర్శ్
30 January 2024, 7:21 IST
- Krishna mukunda murari serial january 30th episode: ఆదర్శ్ మీద ప్రేమ ఉన్నట్టు ఇంట్లో అందరి ముందు ముకుంద నటిస్తూ మోసం చేస్తుంది. అటు ముకుంద ప్రేమ నిజమని ఆదర్శ్ పొంగిపోతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కృష్ణ ముకుంద మురారి సీరియల్ జనవరి 30వ తేదీ ఎపిసోడ్
Krishna mukunda murari serial january 30th episode: ఆదర్శ్, మురారి అందరూ కలిసి మందు కొట్టేందుకు కూర్చుంటారు. తన భార్యని పిలిచి విశ్వరూపం చూపిస్తానని ప్రసాద్ సుమలతని పిలుస్తాడు. వచ్చి రెండు తిట్లు తగిలిస్తుంది. అందరి ముందు పరువు తీసి పారేసిందని ప్రసాద్ ఫీల్ అవుతాడు. ముకుంద ఆదర్శ్ కోసం వెతుకుతుంది. ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడతాడో జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలని ముకుంద అనుకుంటుంది. ఎలాగైనా తొండ టాపిక్ బయట పెట్టించాలని మధు అనుకుంటాడు. మార్నింగ్ మనం డిస్కస్ చేస్తుంటే అమ్మ వచ్చి డిస్ట్రబ్ చేసింది కదా మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందామా అని మధు ఆదర్శ్ ని అడుగుతాడు. అప్పుడే ముకుంద బయటకి వచ్చి వాళ్ళని చూస్తుంది.
తన భర్త తాగడం ఇష్టం లేదన్న ముకుంద
అంత సీరియస్ గా ఏం డిస్కస్ చేశారని మురారి అడిగితే తొండ టాపిక్ అని మధు చెప్తాడు. ఏదైతే జరగకూడదని భయపడుతున్నానో అదే జరుగుతుంది, మధుకి అనుమానం వచ్చింది. తాగిన మత్తులో ఆదర్శ్ నిజం చెప్పేస్తాడేమోనని ముకుంద టెన్షన్ పడుతుంది. తొండ పడితే ఉలిక్కిపడి పక్కకి జరుగుతారు కానీ భూమి బద్ధలైనట్టు ఎందుకు అరుస్తారని మధు లాజిక్ గా అడిగితే అవును కరెక్టేనని మురారి కూడా అంటాడు. నాకొక విషయం అర్థం అయ్యింది అక్కడ తొండ పడకుండా ఏదో జరిగిందని మీ అనుమానం కదా ఆదర్శ్ అంటాడు. ఆదర్శ్ నిజం చెప్పేసేలా ఉన్నాడు కృష్ణని తీసుకొచ్చి ఇది ఆపించాలని ముకుంద పరుగున ఇంట్లోకి వస్తుంది.
మురారి, ఆదర్శ్ అంతా కలిసి మందు కొడుతున్నారని కృష్ణకి చెప్తుంది. అంతేనా వాళ్ళు తాగుతున్న విషయం ముందే తనకి చెప్పారని కృష్ణ లైట్ తీసుకుంటుంది. అంటే ఏంటి కృష్ణ మా ఆయన్ని చెడగొట్టమని మీ ఆయన్ని పంపించావా అని సీరియస్ గా అడుగుతుంది. ఆదర్శ్ కి మందు అలవాటు ఉంది కదా మిలటరీలో రోజు తాగుతారని కృష్ణ అంటే అది అక్కడ ఇంట్లో నా భర్త తాగకూడదని నేను కోరుకుంటున్నానని కవర్ చేస్తుంది. అత్తయ్య చూస్తే మేం సరిగా లేము అందుకే తాగుతున్నాడని అనుకుంటుందని అనగానే కృష్ణ నమ్మేస్తుంది. అయితే వెంటనే ఆపేద్దామని కృష్ణ, ముకుంద అక్కడికి వస్తారు.
ముకుందని పూర్తిగా నమ్మేసిన ఆదర్శ్
తాగింది చాలు అందరూ లేవండని ముకుంద సీరియస్ గా చెప్పే సరికి ఆదర్శ్ లేచి వెళ్ళిపోతాడు. నా మీద తొండ పడలేదని మధుకి గట్టిగా అనుమానం వచ్చింది. టైమ్ కి వెళ్ళాను కాబట్టి సరిపోయింది లేదంటే మేము ఎలా ఉంటున్నామో తెలిసిపోయేది. అయినా తెలిస్తే ఏమౌతుంది. వామ్మో ఇలా ఆలోచిస్తున్నాను ఏంటి. కృష్ణ మురారి నామీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకం ఒమ్ము చేసినట్టు అవుతుంది కదా. నా మనసులో ఏముందో తెలిస్తే ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తారు. అప్పుడు మురారికి శాశ్వతంగా దూరంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి బయట పడకూడదని ముకుంద మనసులో అనుకుంటుంది.
ఆదర్శ్ తాగిన మైకంలో పడబోతుంటే ముకుంద పట్టుకుంటుంది. కాసేపు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. కాసేపు సరదాగా సిట్టింగ్ వేశామని ఆదర్శ్ చెప్తాడు. కానీ అత్తయ్య అలా అనుకోరు మురారి తాగడు. ఎప్పుడో ఒకసారి తగినా బయటకి వెళ్ళి తాగుతాడు. మధుని ఇంట్లో ఎవరూ లెక్కచేయరు. కానీ మీకంటూ విలువ ఉంది కదా ప్లీజ్ ఇంట్లో తాగొద్దని అడుగుతుంది. నువ్వు చెప్పావ్ కదా ఇంకెప్పుడు ఇంట్లో తాగనని మాట ఇస్తాడు. మళ్ళీ పడబోతుంటే ముకుంద పట్టుకుంటుంది. ఫీల్ అయ్యారా మీకు తాగాలని అనిపిస్తే మన గదిలో తాగండి నేను కంపెనీ ఇస్తానని అంటుంది. వెంటనే ఆదర్శ్ ముకుందకి సోరి చెప్తాడు. ఇందాక నువ్వు అందరి ముందు అలా తీసుకొచ్చినందుకు ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు నువ్వు కారణం చెప్పి నాకు కంపెనీ ఇస్తానన్నావ్ కదా చాలా హ్యాపీగా ఉందని ఆదర్శ్ చెప్తాడు.
కృష్ణ వాళ్ళు మేడ్ ఫర్ అదర్స్
మధు తాగిన మైకంలో ఆదర్శ్ గదికి వచ్చి భోజనానికి రమ్మని పిలుస్తాడు. మురారి తూలుతూ వస్తూ ఉంటాడు. అటు ఆదర్శ్ కూడా తూలుతూ వాస్తు ఉంటాడు. తూలి మురారి పడబోతుంటే కృష్ణ కవర్ చేసేందుకు ట్రై చేస్తుంది. టాపిక్ డైవర్ట్ చేసేందుకు కృష్ణ చూస్తుంది. అత్తయ్య చూపుల్లో అదే అనుమానం అదే కోపం. ఎందుకు ఇంకా నా మీద అనుమానం.
ఎందుకు నన్ను నమ్మడం లేదు. దేవ్ మీద కోపం నామీద చూపిస్తుందా ఎటు తేల్చుకోలేకపోతున్నానని ముకుంద అనుకుంటుంది. ముకుంద డల్ గా ఉండటం చూసి కృష్ణ ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది. ఇంకేం ఉంటుంది పెళ్లై ఇన్నాళ్ళూ అయ్యింది ఇప్పుడు ఒకటి అయ్యారు కదా ఎటు వెళ్దామా అని ఆలోచిస్తుందని నందిని అనేసరికి అవును అంతే అంటుంది.
ఐయామ్ మేడ్ ఫర్ మురారి అనుకున్న ముకుంద
అత్తయ్యకి అనుమానం రాకుండా నటించాలి. కానీ ఇలా నటించడం మోసం చేస్తున్నట్టు అవుతుంది నా వల్ల కావడం లేదని ముకుంద బాధపడుతుంది. మీ ఇద్దరిని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు అనిపిస్తుందని నందిని అంటుంది. భవానీ మాత్రం ముకుంద వైపు అనుమానంగా చూస్తుంది.
మురారి కూడా వీళ్ళు ఎప్పటికీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాడు. ఎవరు అలా అన్నా పరవాలేదు కానీ నువ్వు అలా అనకు నేను పుట్టింది నీకోసమే అనే ఫీలింగ్ మనసులో ఎప్పటికీ పోదు. ఐయామ్ మేడ్ ఫర్ మురారి అని ముకుంద మనసులో అనుకుంటుంది. మీరు తక్కువ ఏం కాదన్నయ్య మీరు మేడ్ ఫర్ అదర్స్ ముందు పక్కవాళ్ళ గురించి ఆలోచించి తర్వాత మీ గురించి ఆలోచించుకుంటారని నందిని మెచ్చుకుంటుంది.
ముకుందని పొగిడిన ఆదర్శ్
ఆదర్శ్ భోజనం చేస్తూ ముకుంద గురించి మాట్లాడతాడు. అమ్మా నీకు తెలుసో తెలియాడ్వ ముకుందకి నువ్వంటే ఆపరమైన ప్రేమ, గౌరవం అనేసరికి అందరూ షాక్ అవుతారు. భవానీ సైలెంట్ గా ఉంటుంది. మిలటరీలో ఉన్నాను కదా కొంచెం మందు తీసుకునే అలవాటు ఈరోజు కూడా చిన్న పెగ్ వేశానని ఆదర్శ్ నిజం చెప్పేస్తాడు. ఈ భూమి బద్ధలైనట్టు సీరియస్ అయ్యింది. తాగొద్దని గొడవ చేసిందని చెప్తాడు. ఈ విషయం చెప్పడం అవసరమా అత్తయ్య అంటే గౌరవం ఇంట్లో ఎవరికి లేదు. ఆవిడ మనసు తెలుసుకుని నడుచుకోవాలని అంటుంది. ఒకరి మీద ప్రేమ ప్రత్యేకంగా చెప్పాలా వాళ్ళకి ఇచ్చే విలువ బట్టి అది తెలిసిపోతుందని ముకుంద చెప్తుంది. చెప్పు మురారి తెలిసిపోతుంది కదా మళ్ళీ చెప్పుకోవడం అవసరమా అని అడుగుతుంది.
తరువాయి భాగంలో..
మీరు తిరిగొచ్చినందుకు గుర్తుగా ఒకరికొకరు ఉంగరాలు మార్చుకోమని కృష్ణ వాటిని ఆదర్శ్, ముకుందకి ఇస్తుంది. ఆదర్శ్ సంతోషంగా ముకుంద వేలికి రింగ్ పెడతాడు.