తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Seria February 1st: ఆదర్శ్ తో ఉంగరం పెట్టించుకోకుండా షాకిచ్చిన ముకుంద.. బలపడుతున్న భవానీ అనుమానం

Krishna mukunda murari seria february 1st: ఆదర్శ్ తో ఉంగరం పెట్టించుకోకుండా షాకిచ్చిన ముకుంద.. బలపడుతున్న భవానీ అనుమానం

Gunti Soundarya HT Telugu

01 February 2024, 7:18 IST

google News
    • Krishna mukunda murari serial today february 1st episode: ఆదర్శ్ ఉంగరం పెట్టె టైమ్ కి  ముకుంద తన చేతిని వెనక్కి తీసేసుకుంటుంది. దీంతో అందరూ ముకుంద వైపు అనుమానంగా చూడటంతో సిరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. 
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 1వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 1వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 1వ తేదీ ఎపిసోడ్

Krishna mukunda murari serial today february 1st episode: కృష్ణ హాల్లోకి వచ్చి అందరినీ పిలుస్తూ హడావుడి చేస్తుంది. భవానీ వచ్చి ఏంటని అంటుంది. కృష్ణ ఏదో సర్ ప్రైజ్ ప్లాన్ చేసిందంట అని చెప్తాడు. అప్పుడే ఆదర్శ్, ముకుంద కూడా వచ్చేస్తారు. సర్ ప్రైజ్ అయితే పరవాలేదు షాక్ అయితే మాత్రం కష్టమని భవానీ కూడా అంటుంది. కృష్ణ వెంటనే వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి ఉంచిన రెండు ఉంగరాలు తీసుకుని వస్తుంది. రింగ్ బాక్స్ కదా నేను ఇంకా తొండ గురించి చెప్తావని అనుకున్నానని మధు అనేసరికి ముకుంద వాళ్ళు షాక్ అవుతారు. వీడు ఈ తొండ గురించి వదిలేలా లేడని ఆదర్శ్ అనుకుంటాడు. భవానీ తొండ ఏంటని తిడుతుంది. 

కృష్ణ సర్ ప్రైజ్ ముకుంద షాక్ 

రింగ్ కాదు సర్ ప్రైజ్ దీన్ని తెచ్చిన పర్పస్ సర్ ప్రైజ్. ముకుంద వాళ్ళ పెళ్లి నేను చూడలేదు కదా పైగా ఇన్నాళ్ల తర్వాత ఆదర్శ్ తిరిగి వచ్చాడు కదా. మీరు ఇద్దరూ ఒకటైనందుకు గుర్తుగా మీరు ఈ ఉంగరాలు మార్చుకోమని చెప్పి ఉంగరాలు వాళ్ళకి ఇస్తుంది. ముకుంద బిత్తరపోతుంది పైకి మాత్రం నవ్వుతుంది. భవానీ ముకుంద ఏం చేస్తుందానని అనుమానంగా చూస్తుంది. ఆదర్శ్ సంతోషంగా ఉంటాడు కానీ ముకుంద మాత్రం ఇబ్బంది పడుతుంది. వెంటనే మధు ముకుందకి ఇష్టం ఉందో లేదోనని ఆదర్శ్ కి డౌట్ గా ఉందని అనేస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు ముకుందకి ఎందుకు ఇష్టం ఉండదని మురారి అంటాడు. 

ఆదర్శ్ రింగ్ తొడుగుతానని అంటే ముకుంద ఆనందంగా ఫీల్ అవకుండా టెన్షన్ గా కనిపించేసరికి డౌట్ వచ్చిందని మధు చెప్తాడు. నీ మొహం అది బిడియం. లోపల సంతోషంగా ఉన్న నలుగురి మధ్యలో ఇలాంటివి చేయాలంటే కొందరికి సిగ్గుగా ఉంటుందని కృష్ణ చెప్తుంది. 

ఉంగరం పెడుతుంటే చేతిని వెనక్కి తీసేసుకున్న ముకుంద 

మేమందరం ఉన్నామని సిగ్గు పడాల్సిన అవసరం లేదని అంటుంది. ఎంత తప్పించుకుందామని చూసినా కుదరడం లేదు మనసుకి నచ్చని పనులు ఎలా చేయాలని ముకుంద మనసులో టెన్షన్ పడుతుంది. ఈ రింగ్ పెట్టించుకొదని మధు అంటాడు. రింగ్ పెట్టకుండా ముకుంద ఆలోచిస్తూ ఉంటే చెప్పాను కదా రింగ్ పెట్టడం ఇష్టం లేదని మధు అనేసరికి అదేం లేదులే అని కృష్ణ ముకుందకి సపోర్ట్ గా మాట్లాడుతుంది. 

ఆదర్శ్ సంతోషంగా ముకుంద వేలికి ఉంగరం పెడుతుంటే ఒక్కసారిగా చేతిని వెనక్కి తీసుకుంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఏమైందని ముకుందని కృష్ణ అడుగుతుంది. చెప్పాను కదా ఉంగరం పెట్టించుకోవడం ఇష్టం లేదంటే ఆదర్శ్ అంటే కూడా ఇష్టం లేదనే కదాని మధు అంటాడు. చాలు ఆపుతావా మధు ఇష్టం లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావ్ ఏంటని ముకుంద సీరియస్ అవుతుంది. ఇంకేం కారణం ఉంది నువ్వు చేసిన పనికి ఎవరికైనా మధుకి వచ్చిన అనుమానమే వస్తుందని రేవతి అనేస్తుంది. వేరే కారణం ఏదో ఉందని అంటుంది కదా అది ఏంటో చెప్పమని భవానీ అడుగుతుంది. 

ఉంగరాలు మార్చుకున్న కృష్ణ, మురారి 

ఈ రింగ్ ఆదర్శ్ నాకు తొడగడం కంటే మురారి కృష్ణకి తొడగడం కరెక్ట్ అని ముకుంద చెప్తుంది. మీ కోసం కృష్ణ ముచ్చటపడి తీసుకొస్తే వాళ్ళని తొడుక్కోమని చెప్తావు ఏంటని నందిని కూడ అడుగుతుంది. ఎప్పుడు కృష్ణ మా గురించే ఆలోచించాలా మేము కృష్ణ గురించి ఆలోచించకూడదా? చెప్పు ఆదర్శ్ వాళ్ళే మన కోసం ఆలోచించాలా? మనం ఆలోచించకూడదా? కృష్ణ మా పెళ్లి నువ్వు చూడకపోయినా ఇంట్లో వాళ్ళందరూ చూశారు. మీ పెళ్లి మేము ఎవరం చూడలేదు. కాబట్టి ఈ ఉంగరం మురారి నీకు తొడిగితేనే బాగుంటుందని చెప్తుంది. వాళ్ళకి కావాలంటే వేరేవి తెప్పించుకుంటారు మీరు పెట్టుకుంటే బాగుంటుందని మధు అంటాడు. 

రింగ్స్ ఏముందని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కానీ కృష్ణ నా మీద చూపించిన అభిమానానికి కొంచెం అయినా కృతజ్ఞత చూపించినట్టు అవుతుంది. కావాలంటే అత్తయ్యని అడగమని భవానీని ఇరికిస్తుంది. భవానీ సైలెంట్ గా ఉండేసరికి మౌనం అంగీకారం అందుకే ఏమి అనలేదని ముకుంద ఆ ఉంగరాలు కృష్ణ చేతిలో పెడుతుంది. మురారి సంతోషంగా కృష్ణ చేతికి ఉంగరం తొడుగుతాడు. కృష్ణ కూడా మురారికి రింగ్ పెడుతుంది. అందరూ సంతోషంగా చప్పట్లు కొడతారు. కృష్ణ వెళ్ళి ముకుందకి థాంక్స్ చెప్తుంది. నువ్వు మారావు అనేదానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదని కృష్ణ అంటుంది. 

మురారీని ఎప్పటికీ మర్చిపోలేను 

సోరి కృష్ణ నేను మారాను కానీ నువ్వు అనుకున్నంత మాత్రం మారలేదు. మురారిని ఎప్పటికీ మర్చిపోలేను ఆదర్శ్ ని అంగీకరించలేనని.. అలాగే నీకు మాత్రం అన్యాయం చేయలేనని ముకుంద మనసులో అనుకుంటుంది. గదిలో ముకుం దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ ఉంగరం చూసుకుంటూ ముకుంద చాలా మారిపోయిందని సంతోషపడుతుంది. ఒకప్పుడు మురారిని అమితంగా ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు తనతోనే నాకు ఉంగరం తొడిగించిందంటే ఎంత మారిపోయిందని కృష్ణ అనుకుంటుంది. 

నేను చేసింది కరెక్టేనా ఆదర్శ్ తో తాళి కట్టించుకున్నాను కదా ఉంగరం తొడిగించుకుంటే ఏమవుతుంది. కృష్ణ మీద ప్రేమతో అని నేను ఎంత బిల్డప్ ఇచ్చినా అత్తయ్యకి నా మీద అనుమానం వచ్చి ఉంటుంది. ఆదర్శ్ కూడా ఫీల్ అయి ఉంటాడు. అటు కృష్ణకి అన్యాయం చేయలేక ఇటు ఆదర్శ్ కి న్యాయం చేయలేక నలిగిపోతున్నాను. దేవుడా నువ్వే ఏదో ఒక దారి చూపించమని మనసులో అనుకుంటుంది. అప్పుడే ఆదర్శ్ రాగానే క్షమించమని అడుగుతుంది. ఎందుకని అంటే రింగ్ తొడగమని ఇస్తే అది తిరిగి వాళ్ళకే ఇచ్చేశాను. కృష్ణ మీద అభిమానం చూపించాలని అనుకున్నాను కానీ మీరు ఫీల్ అవుతారనే విషయం మర్చిపోయానని చెప్తుంది. నువ్వు నన్ను దూరం పెడితే ఫీల్ అవుతాను కానీ ఈ విషయంలో కాలేదని ఆదర్శ్ చెప్తాడు. 

ముకుందని మెచ్చుకున్న ఆదర్శ్ 

ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తారు. కానీ నీకు దొరికిన అవకాశాన్ని కూడా కృష్ణ కోసం ఆలోచించావు నువ్వు చాలా మంచిదానివి. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టమని చెప్తాడు. అనుమానం రానందుకు సంతోషపడాలా లేదంటే ఇలా తనని మభ్యపెడుతున్నందుకు బాధ పడాలో అర్థం కావడం లేదని ముకుంద అనుకుంటుంది. ముకుందకి ఆదర్శ్ సోరి చెప్తాడు. 

రాత్రి నువ్వు కింద పడుకున్నావని నిన్ను అనుమానించాను. నీలో నిజంగా మార్పు రాకపోయి ఉంటే కృష్ణ వాళ్ళని వేరు చేసి ఉండే దానివి. కానీ వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసేలా ఆ రింగ్ వాళ్ళకి ఇచ్చేశావు. ఇది చాలు నువ్వు మారావు అనడానికి. ఇది చాలు నీకు నా మీద ప్రేమ పుట్టిందని అనడానికి. నీలోఈ  మార్పు వచ్చిందని నాకు తెలియదు తెలిసి ఉంటే అప్పుడే రెక్కలు కట్టుకుని నీ దగ్గరకి వాలిపోయి ఉండేవాడిని. అయినా తప్పు నాదే ఎందుకు నిన్ను వదిలేసి ఆవేశంగా వెళ్లిపోవాలి. నేను ఇక్కడే ఉంటే నీలో మార్పు రాగానే నాకు తెలిసి సంతోషంగా ఉండేవాడిని కదా అని అంటాడు. నీ లైఫ్ లో నన్ను ఉంచినందుకు థాంక్స్ అంటాడు. 

తరువాయి భాగంలో..

రేవతి దిగులుగా నిలబడి ఏదో ఆలోచిస్తుంటే ఏమైందని కృష్ణ అడుగుతుంది. శోభనం కోసం పెట్టుడు ముహూర్తాలు పెట్టిద్దామని అక్కని అడిగితే వద్దని అంది. ఆ ముహూర్తం కృష్ణ వాళ్ళకి సరిపోతే వాళ్ళకి పెట్టించమని చెప్పిందని చెప్తుంది. కృష్ణ భవానీ దగ్గరకి వెళ్ళి ముకుంద మారిందని అంటుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలనే శోభనం ముహూర్తం పెట్టించలేదు. ఆ ముహూర్తం మీకు సరిపోతే పెట్టించుకోండి నాకేం అభ్యంతరం లేదని భవానీ చెప్పేసరికి కృష్ణ షాక్ అవుతుంది. 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం