తెలుగు న్యూస్  /  Entertainment  /  Kisi Ka Bhai Kisi Ki Jaan Bathukamma Song Out Salman Khan Pays Ode Tobathukamma Festival

Pooja Hegde - Bathukamma Song: స‌ల్మాన్‌ఖాన్‌ సినిమా కోసం బ‌తుక‌మ్మ ఎత్తిన పూజాహెగ్డే

31 March 2023, 13:37 IST

  • Pooja Hegde - Bathukamma Song: బాలీవుడ్ సినిమా కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా కోసం బ‌తుక‌మ్మ ఎత్తింది పూజాహెగ్డే. స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాలోని బ‌తుక‌మ్మ పాట‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు.

వెంక‌టేష్‌, పూజా హెగ్డే
వెంక‌టేష్‌, పూజా హెగ్డే

వెంక‌టేష్‌, పూజా హెగ్డే

Pooja Hegde - Bathukamma Song: బాలీవుడ్ సినిమా కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా కోసం హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde)బ‌తుక‌మ్మ ఎత్తింది. స‌ల్మాన్‌ఖాన్ (Salman Khan) హీరోగా న‌టిస్తోన్న తాజా బాలీవుడ్ మూవీ కిసి కా భాయ్ కిసి కి జాన్‌. తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా న‌టించిన కాట‌మ‌రాయుడు సినిమా ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ బాలీవుడ్ మూవీకి ఫ‌ర్హాద్ స‌మ్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

NNS May 2nd Episode: మనోహరికి షాక్ ఇచ్చిన మిస్సమ్మ.. చివరిసారిగా వీడ్కోలు పలికిన అరుంధతి.. ముగియనున్న పాత్ర

Flop Movies: 100 డేస్ ఆడి కూడా ప్లాప్ అయిన సినిమాలు.. మహేష్ బాబువే ఎక్కువ!

Aha OTT: ఆహా ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో అద‌ర‌గొడుతోన్న కామెడీ మూవీ -అలాంటి వారికి ఓ ఎగ్జాంపుల్ ఈ సినిమా!

HHVM Director: క్రిష్‌ను ప‌క్క‌న‌పెట్టేశారు - హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు కొత్త డైరెక్ట‌ర్ ఇత‌డే - అనౌన్స్‌చేసిన మేక‌ర్స్‌

పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరో వెంక‌టేష్ (Venkatesh) కీల‌క పాత్ర‌ను పోషిస్తోన్నారు. కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాలోని బ‌తుక‌మ్మ సాంగ్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు. ఈ పాట‌ను సోష‌ల్ మీడియా ద్వారా స‌ల్మాన్ ఖాన్ షేర్ చేశారు. బ‌తుక‌మ్మ పండుగ నేప‌థ్యంలో తెలుగు లిరిక్స్‌తో ఈ పాట ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట‌లో వెంక‌టేష్‌తో క‌లిసి బ‌తుక‌మ్మ‌ను ఎత్తుకుంటూ పూజాహెగ్డే క‌నిపించింది. చివ‌ర‌లో హిందీ లిరిక్స్ వ‌చ్చాయి. అందులో స‌ల్మాన్‌ఖాన్ ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో క‌నిపించాడు.

ముంగిట్లో ముగ్గేసి గొబ్బిల్లే పెడ‌దామా...గ‌డ‌ప‌కు బొట్టేట్టి తోర‌ణాలు క‌ట్టేద్దామా అంటూ కంప్లీట్‌గా బ‌తుక‌మ్మ పండుగ విశిష్ట‌త‌ను చాటిచెబుతూ తెలుగులోనే ఈ పాట సాగింది. హిందీ సినిమాలో తెలుగు పాట పెట్ట‌డం ఆస‌క్తిని పంచుతోంది. కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాలో పూజాహెగ్డే, వెంక‌టేష్ తెలుగు నేప‌థ్యం ఉన్న క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపిస్తార‌ని స‌మాచారం.

అందుకే తెలుగులోనే ఈ సాంగ్ సినిమాలో వ‌స్తోంద‌ని చెబుతోన్నారు. ఈ బ‌తుక‌మ్మ పాట‌ను కిన్న‌ల్ రాజ్, హ‌రిణి ఇవ‌టూరి ఆల‌పించారు. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ ర‌వి బ‌స్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తోన్నాడు. ఏప్రిల్ 21న కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా రిలీజ్ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.