తెలుగు న్యూస్  /  Entertainment  /  Kiran Abbavaram New Movie Nenu Meeku Baga Kavalsina Vadine Trailer Release

Attaanti Ittaanti Lyrical Video: మాస్ నెంబర్‌తో దుమ్ము రేపిన కిరణ్ అబ్బవరం.. అదిరిపోయిన్ ఐటెం సాంగ్

30 August 2022, 13:25 IST

    • Item Song from NMBK: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన నేను మీకు బాగా కావాల్సినవాడినే చిత్రం నుంచి ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు మణిశర్మ సంగీతాన్ని అందించగా.. సాకేత్, కేతన శర్మ ఆలపించారు.
కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం

Item song from NMBK: ఇటీవల కాలంలో వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న నటుడు కిరణ్ అబ్బవంరం. ఈ టాలీవుడ్ యంగ్ హీరో ఈ ఏడాది ఇప్పటికే స్టెబాస్టియన్, సమ్మతమే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇందులో స్టెబాస్టియన్ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడనప్పటికీ.. సమ్మతమే మాత్రం ఫర్వాలేదనిపించింది. త్వరలో నేను మీకు బాగా కావాల్సిన వాడినే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా.. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Jr NTR Dinner: బాలీవుడ్ స్టార్లతో జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్ నైట్.. బ్రహ్మాస్త్ర, వార్ 2 టీమ్‌తో కలిసి..

Guppedantha Manasu April 29th Episode: గుప్పెడంత మనసు- దొరికిన రాజీవ్ డెడ్ బాడీ- కోర్టుకు మను- శైలేందపై దేవయాని డౌట్

Krishna mukunda murari serial april 29th: ముకుంద ఉచ్చులో పడిన మురారి, కృష్ణ.. సర్ ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసిన భవానీ

Brahmamudi April 29th Episode: బ్రహ్మముడి- అనామికను కొట్టేంతపని చేసిన కనకం- ఇక పుట్టింటికే- పూల బొకేలో రాజ్ బిడ్డ రహస్యం

ఈ ఐటెమ్ నెంబర్‌తో కిరణ్ అబ్బవరం దుమ్మురేపాడు. తనదైన శైలి స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. అట్టాంటి ఇట్టాంటి దాన్ని కాదు మామ అంటూ ఈ పాట ఆకట్టుకుంది. ఆ పాటను సాకేత్ కొమండూరి, కేతన శర్మ ఆలపించారు. కాసర్ల శ్యామ్ పాటకు సాహిత్యాన్ని అందించాడు.మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. మణిశర్మ మ్యూజిక్‌తో ఈ ఐటెం సాంగ్ ఇంకా అదిరిపోయింది.

శ్రీధర్ గాదే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరించారు. కిరణ్ అబ్బవరం సరసన సంజన ఆనంద్, సోనూ ఠాకూర్, దివ్యా రాధన్ హీరోయిన్లుగా చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్లను విడుదల చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.