తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli: రాజమౌళి నాకు 10 సెకండ్లే కథ చెప్పారు.. కన్నడ హీరో సంచలన వ్యాఖ్యలు

Rajamouli: రాజమౌళి నాకు 10 సెకండ్లే కథ చెప్పారు.. కన్నడ హీరో సంచలన వ్యాఖ్యలు

06 August 2022, 14:58 IST

    • కన్నడ హీరో సుదీప్.. ఈగ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా కథను రాజమౌళి కేవలం 10 సెకండ్లలోనే వివరించారని తెలిపారు. ఆయనతో పనిచేయాలనే ఉత్కంఠతో ఉన్నానని అన్నారు.
కిచ్చా సుదీప్
కిచ్చా సుదీప్ (PTI)

కిచ్చా సుదీప్

దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పనిచేయాలని ప్రతి హీరో హీరోయిన్లు కలలు కంటారు. ఆయన మాత్రం ఎవరైతే తన కథకు సరిపోతారనుకుంటారో వారితోనే సినిమా చేస్తుంటారు. అది ఏ భాష నటుడైనా సరే.. వారి వద్దకు వెళ్లి కథ చెప్పి వారి డేట్స్ ఓకే చేయిస్తారు. తాజాగా ఆయనతో పనిచేసిన కన్నడ హీరో కిచ్చా సుదీప్ కూడా జక్కన్న దర్శకత్వంలో పనిచేయడాన్ని ఆస్వాదించారన్నారు. రాజమౌళి కేవలం తనకు 10 సెకండ్లు మాత్రమే కథ చెప్పారని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Love Guru OTT streaming: విజయ్ ఆంటోనీ రోమియో తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది

Chiranjeevi: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. నేను పిఠాపురం వెళ్లడం లేదు: చిరంజీవి కామెంట్స్ వైరల్

Rashmika Mandanna Movies: రష్మిక మందన్నా రాబోయే ఆరు సినిమాలు ఇవే.. అన్నీ పాన్ ఇండియా మూవీసే

Best Crime Thriller Web Series: ఇండియాలో ఎక్కువ మంది చూసిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే

ఇటీవల సుదీప్ నటించిన విక్రాంత్ రోణ సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళితో పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్న పిల్లాడిలా ఎగ్జైట్ అయ్యానని స్పష్టం చేశారు.

ఎస్ఎస్ రాజమౌళి సార్‌ను కలవడానికి వెళ్లినప్పుడు నేనే పెద్దగా ఎదురుచూడలేదు. ఆయన ఈగ కథను కేవలం 10 సెకండ్లలోనే వివరించారు. అంతేకాకుండా నా పాత్ర ప్రతికూలంగా ఉందని ఆలోచించకుండానే వెంటనే చేస్తానని అంగీకరించాను అని కిచ్చా సుదీప్ స్పష్టం చేశారు.

జక్కన్న దర్శకత్వంలో సుదీప్ ఈగలో నటించారు. ఈ సినిమాలో ఆయన విలన్ పాత్ర పోషించగా.. నాని, సమంత లీడ్ రోల్స్ పోషించారు. ఈ సినిమా 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

మరోపక్క సుదీప్ ఇటీవలే విక్రాంత్ రోణతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పాన్ఇండియా స్థాయిలో జులై 28న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ సినిమా అడ్వెంచర్ ఫాంటసీ జోనర్‌లో తెరక్కికంది. ఈ చిత్రంలో సుదీప్ వెటగాడి పాత్రలో కనిపించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం