Karthika Deepam Today Episode: దీపను చంపేందుకు జ్యోత్స్న ప్లాన్, రౌడీ లారెన్స్ ఎంట్రీ
27 November 2024, 7:19 IST
- Karthika Deeapam 2 Today November 27 Episode: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీప కార్తీక్ గురించి చాలా బాధపడుతూ కనిపిస్తుంది. తనని పెళ్లి చేసుకోవడం వల్లే కార్తీక్ సీఈవో పదవి పోయిందని మధనపడుతూ ఉంటుంది.
కార్తీక దీపం సీరియల్
కార్తీకదీపం నేటి ఎపిసోడ్ లో దీప కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపిస్తుంది. జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ సీఈవో పదవి నుంచి కార్తీక్‌ని తొలగించడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో కాంచన వచ్చి దీపతో ‘నీ కన్నీళ్ళకు కారణం మా నాన్నే కదా ’ అని అడుగుతుంది. అప్పుడు దీపా ‘మీ మేనకోడలిని పెళ్లి చేసుకుని కంపెనీ యజమాని అవ్వాల్సిన మనిషి ... నన్ను పెళ్లి చేసుకొని ఉన్న స్థానం నుంచి కూడా దిగిపోయారు’ అని చాలా బాధగా చెబుతుంది.
నన్ను పెళ్లి చేసుకోవడమే తప్పు
ఇలా సీఈఓ పదవి నుంచి తీసేసి కార్తీక్ ని అవమానించడం తనను చాలా బాధపెట్టిందని చెబుతుంది. దీప... కార్తీక్ చేసిన తప్పు ఒకటేనని అది తనను పెళ్లి చేసుకోవడమేనని అంటుంది. కార్తీక్ బాబు జీవితంలో తాను ఉన్నంతకాలం ఒక్కో మెట్టు కిందకి దిగుతూనే ఉంటాడని బాధగా చెబుతుంది. పదిమందికి మంచి చేసే మనిషికి ఇలా జరగడం ఏమిటని బాధపడుతుంది. కార్తీక్ మంచితనం గురించి కాసేపు వర్ణిస్తుంది. తాను ఊహించిన దాని కంటే కార్తీక్ చాలా గొప్ప మనిషి అని చెబుతుంది. అప్పుడు కాంచన నీ భర్త మంచితనం కన్నా ఆ సీఈవో పోస్టు పెద్దదా? అని అడుగుతుంది. దానికి దీప కాదని సమాధానం చెబుతుంది.
ఈలోపు అనసూయ శౌర్యని తీసుకొని ఇంటికి వస్తుంది. శౌర్య వస్తూనే కార్తీక్ ని పిలుస్తుంది. వెంటనే దీప శౌర్యను చేయి పట్టుకొని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్తుంది. శౌర్య... కార్తీక్ అని పిలుస్తుండడంతో దీపా అలా పిలవద్దని చెబుతుంది. అప్పుడు శౌర్య మరి ఏమని పిలవాలో చెప్పమని అడుగుతుంది. ఇంతకుముందు ఎలా పిలిచావో అలా పిలవమని చెబుతుంది. మరి నువ్వు ఎందుకు కార్తీక్ బాబు అంటున్నావ్ అని ప్రశ్నిస్తుంది. ఇకపై కార్తీక్ ని నాన్న అని పిలవమని చెబుతుంది దీపా. అది విని అనసూయ, కాంచన ఎంతో ఆనందపడతారు.
ఇక శివన్నారాయణ ఇంట్లోకి సీన్ మారుతుంది. అక్కడ సుమిత్ర బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ ను సీఈవో పదవి నుంచి తీసేయడం తనకి ఏమీ నచ్చలేదని భర్తతో చెబుతుంది. కుటుంబాల మధ్య ఉన్న గొడవను వ్యాపారం లోకి తీసుకురావడం మంచి పద్ధతి కాదని అంటుంది. జ్యోత్స్నా సీఈవో పదవిని సరిగా నిర్వహించగలదో లేదో అని అనుమానం పడుతుంది. అదే సమయంలో శివన్నారాయణ అక్కడికి వచ్చి తన మనవరాలు చక్కగా పదవిని చేస్తుందని, తనకు ఆ నమ్మకం ఉందని చెబుతాడు. అలా వదిలేస్తే కార్తీక్ కోసం ఏమైపోతుందనే ఆ పదవిని ఇచ్చానని వివరిస్తాడు.
శివన్నారాయణ పగ
సుమిత్ర కార్తీక్ లండన్ నుంచి రావడానికి ముందు మన బిజినెస్ తక్కువగా ఉండేదని కార్తీక్ బాధ్యతలు తీసుకున్నకే లాభాలు వచ్చాయని అంటుంది. దానికి శివన్నారాయణ వ్యాపారంలో లాభాలు వచ్చినా, వ్యక్తిగతంగా నష్టాలు వచ్చాయని చెబుతాడు. కార్తీక్, అతడి నాన్న కలిసి తన పరువు తీసారని, ఎవరి దగ్గరా తలెత్తుకోకుండా చేశారని, తన మనవరాలి సంబంధాన్ని చెడగొట్టారని శివన్నారాయణ కోప్పడతాడు.
కార్తీక్ చెప్పే సలహాలతో బిజినెస్ నడిపించాల్సిన అవసరం లేదని, అందుకే తన మనవరాలిను సీఈవోగా చేశానని శివన్నారాయణ చెబుతాడు. ఎవరైనా సరే జోత్స్న చెప్పిన మాట వినాల్సిందేనని అంటాడు. ఆ మాటలు సుమిత్రకు ఏమాత్రం నచ్చవు. దీపలాంటోలు రెస్టారెంట్ వంట గదిలోకి దూరడం వంటివి ఇకపై జరగకూడదని అంటాడు. సుమిత్ర ఎన్ని రకాలుగా చెప్పినా శివన్నారాయణ ఏమాత్రం ఒప్పుకోడు. దానికి సుమిత్ర ఎప్పటికైనా ‘రెండు కుటుంబాలు కలవాల్సిందే కదా’ అని అంటే దానికి శివన్నారాయణ .. ఆ రెండు కుటుంబాలు కలిసే సమయానికి తాను బతికి ఉండనని చెబుతాడు. దానికి షాక్ తింటుంది సుమిత్ర.
ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే కార్తీక్ ఎంత బాధ పడతాడో తనకు తెలుసని సుమిత్ర ఎంతో వేదన పడుతుంది. కేవలం పగ తీర్చుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని అంటుంది.
మల్లెపూలు తెచ్చిన కార్తీక్
దీప పనిచేస్తుండగా కార్తీక్ ఇంట్లోకి వస్తాడు. శౌర్యకి ఐస్ క్రీమ్ కొనిస్తాడు. దీప కోసం మల్లెపూలు కొని ఇంటికి తెస్తాడు. ఆ మల్లెపూలను చూసి దీప ఎంతో ఆనందపడుతుంది. వెంటనే కార్తీక్ ‘ అమ్మ మల్లెపూలు కొని తెచ్చి నీకు ఇవ్వమంది’ అని చెబుతాడు. దానికి దీప ‘నా కోసమా’ అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ ‘దేవుడు కోసం అమ్మ తెమ్మంది’ అని చెబుతాడు. ఆ తర్వాత ‘నువ్వు కూడా పెట్టుకోవచ్చు. నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మల్లెపూలని మంచం మీద చల్లుకొని పడుకునే వాడిని’ అంటాడు. తర్వాత మల్లెపూలను దీప చేతికి ఇచ్చేస్తాడు.
జ్యోత్స్న హత్యాపథకం
జ్యోత్స్నా దీప తనను కొట్టిన చెంప దెబ్బను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పగతో రగిలిపోతూ ఉంటుంది. ‘ఇప్పుడు నాకు గుడ్ టైం స్టార్ట్ అయింది బావా. నీ పోస్ట్ నాకు వచ్చినట్టే... ఇకపై దీప పోస్టు కూడా నాకే రావాలి’ అనుకుంటూ ఒక రౌడీ కి ఫోన్ చేస్తుంది. అతడి పేరు లారెన్స్. ఒక ఆడ మనిషిని చంపాలని దానికి ఎంత తీసుకుంటావని అడుగుతుంది. లారెన్స్ నేరుగా వచ్చి మాట్లాడమని చెబుతాడు.
ఇంట్లో శౌర్య కళ్ళు మంటగా ఉన్నాయని ఏడుస్తూ ఉంటుంది. కంట్లో నలత పడిందని చెబుతుంది. దీపా, కార్తీక్ కలిసి ఆ నలతను తొలగిస్తారు. ఆ సమయంలో కార్తీక దీప చీర కొంగును తీసుకొని శౌర్య కంట్లోని నలతను తీస్తాడు.దీప చీర కొంగు కార్తీక్ చేతిలో ఉండడంతో... దీప అలా నిలుచుండి పోతుంది. ఆ సమయంలో పిల్లల కోసం పెద్దవాళ్లు కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలని చెబుతాడు కార్తీక్. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.
టాపిక్