kiccha sudeep | జానీ మాస్టర్‌కు ఖరీదైన జీప్ గిఫ్ట్ గా ఇచ్చిన కన్నడ స్టార్ హీరో
25 March 2022, 15:49 IST
దర్శకులతో పాటు సాంకేతిక నిపుణులకు స్టార్ హీరోలు అప్పుడప్పుడు ఖరీదైన బహుమతులు ఇస్తూ సర్ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కన్నడ స్టార్ హీరో సుదీప్ పదిహేను లక్షల విలువైన గిఫ్ట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన బహుమతి ఏమిటో తెలుసా...
జానీ మాస్టర్, సుదీప్
తెలుగులో సినిమాలతో కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ కెరీర్ ఆరంభమైంది. ఆ తర్వాత తమిళ,కన్నడ భాషల్లో బిజీ అయిపోయారు. ఇటీవల జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందించిన తమిళ చిత్రం ‘బీస్ట్’ లోని ‘అరబిక్ కుతు’ పాట పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో పాటు తమిళ చిత్రం ఈటీ,తెలుగులో రౌడీబాయ్స్,ఖిలాడీ సినిమాల్లో జానీ మాస్టర్ డ్యాన్సులకు మంచి పేరు వచ్చింది.
కన్నడంలో సుదీప్ హీరోగా నటిస్తున్న ‘విక్రాంత్ రోనా’ సినిమాకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందిన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఇందులో జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి మెచ్చిన సుదీప్ అతడికి పదిహేను లక్షల విలువైన మహీంద్ర బీస్ట్ థార్ జీప్‌ను బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని జానీ మాస్టర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సుదీప్ తనకు జీప్ గిఫ్ట్‌గా ఇస్తున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. తనకు జీప్‌ను బహుమతిగా అందించిన సుదీప్తో పాటు అతడి కుటుంబసభ్యులకు జానీ మాస్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు. సుదీప్ తనపై చూపించే ప్రేమ,అభిమానం మరువలేనివని పేర్కొన్నారు.
అనూప్ భండారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పది భాషల్లో రిలీజ్ కానుంది. త్రీడీలో విడుదలచేయబోతున్నారు.