తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Thriller: ఓటీటీ డీల్ జరగక యూట్యూబ్‍లోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం.. వివరాలివే

OTT Action Thriller: ఓటీటీ డీల్ జరగక యూట్యూబ్‍లోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం.. వివరాలివే

21 September 2024, 20:49 IST

google News
    • Jigar Action Thriller: జిగర్ చిత్రం యూట్యూబ్‍లోకే వచ్చింది. ఓటీటీ డీల్ కోసం మేకర్స్ ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దీంతో ఈ కన్నడ మూవీని యూట్యూబ్‍లోకే తీసుకొచ్చారు. కావాలంటే ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేయవచ్చు.
OTT Action Thriller: ఓటీటీ డీల్ జరగక యూట్యూబ్‍లోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం.. వివరాలివే
OTT Action Thriller: ఓటీటీ డీల్ జరగక యూట్యూబ్‍లోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం.. వివరాలివే

OTT Action Thriller: ఓటీటీ డీల్ జరగక యూట్యూబ్‍లోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం.. వివరాలివే

కొన్ని తక్కువ బడ్జెట్ చిత్రాలకు ఓటీటీ డీల్ కష్టంగా మారుతోంది. ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. కన్నడలో చాలా సినిమాలకు ఓటీటీ ఒప్పందాలు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. మిక్స్డ్ టాక్ వచ్చే చిన్న చిత్రాలకు ఓటీటీ డీల్ దక్కడం కష్టం మారుతోంది. జిగర్ చిత్రం కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. ప్రవీణ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ హక్కులను ఏ ఓటీటీ తీసుకోకపోవటంతో యూట్యూబ్‍లోకి అడుగుపెట్టింది.

జిగర్ చిత్రం జూలైలో థియేటర్లలో రిలీజైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు యూట్యూబ్‍లో ఈ మూవీ ప్రీమియర్‌కు వచ్చింది.

ఎక్కడ చూడొచ్చంటే..

జిగర్ చిత్రం యూట్యూబ్‍లో ఎస్‍ఆర్ఎస్ మీడియా విజన్ ఛానెల్‍లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీని ఆ యూట్యూబ్ ఛానెల్‍లో ఉచితంగా చూసేయవచ్చు.

జిగర్ చిత్రానికి సూరి కుందర్ దర్శకత్వం వహించారు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. లవ్ స్టోరీ, యాక్షన్‍తో రూపొందించారు. ఈ మూవీలో ప్రవీణ్ తేజ్ సరసన విజయ శ్రీకలబురిగి హీరోయిన్‍గా నటించారు. విజేశ్, యశ్ శెట్టి, ధర్మన్న కడుర్, లోకీ, కరణ్ కుందర్ కీలకపాత్రలు చేశారు.

జిగర్ మూవీని పూజ వసంత్ కుమార్ నిర్మించగా.. రుత్విక్ మురళీధర్ సంగీతం అందించారు. శివసేన సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి జ్ఞానేశ్ ఎడిటింగ్ చేశారు.

జిగర్ చిత్రం జూలై 5వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రవీణ్ తేజ్ యాక్టింగ్‍కు ప్రశంసలు దక్కాయి. అయితే, స్టోరీని సూరి ఎంగేజింగ్‍గా తెరకెక్కించలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లను దక్కించుకోలేదు. ఓటీటీ ప్లాట్‍ఫామ్‍తో డీల్ కూడా జరగలేదు. దీంతో మొత్తానికి మేకర్స్ ఈ మూవీని యూట్యూబ్‍లోనే తీసుకురావాల్సి వచ్చింది.

జిగర్ స్టోరీలైన్

జీవన్ (ప్రవీణ్ తేజ్) ఓ రికవరీ ఏజెంట్‍గా పని చేస్తుంటాడు. ఓ స్నేహితుడు మృతి చెండటంతో అంత్యక్రియల కోసం సొంతఊరికి వెళతాడు. తనకు అంతకు ముందు నేరాలు చేసిన చరిత్ర ఉన్నా బెంగళూరులో సాధారణ జీవనం సాగిస్తుంటాడు. అయితే, అనుకోని పరిస్థితుల్లో మరో హత్య చేయాల్సి వస్తుంది. దీంతో చిక్కుల్లో పడతాడు. ఈ క్రమంలో రక్ష (విజయశ్రీ)తో జీవన్ ప్రేమలో పడతాడు. జీవన్ గతం తెలుసుకొని వేరే వ్యక్తితో పెళ్లికి రక్ష సిద్ధమవుతుంది. జీవన్‍ను చంపాలని మాల్పే మున్నా (యశ్ శెట్టి) తిరుగుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? జీవన్‍తో రక్ష మళ్లీ కలిసిందా? జీవన్ గతమేంటి? మళ్లీ హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ చిక్కుల్లో నుంచి బయటపడ్డాడా? అనే అంశాల చుట్టూ జిగర్ చిత్రం సాగుతుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం