తెలుగు న్యూస్  /  Entertainment  /  Kangana Ranut As Indira Gandhi In This New Teaser From Emergency Movie

Emergency Teaser: పూర్తిగా ఇందిరాగాంధీలా మారిపోయిన కంగనా.. ఎమర్జెన్సీ టీజర్‌

HT Telugu Desk HT Telugu

14 July 2022, 11:32 IST

    • Emergency Teaser: భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా భావించే ఎమర్జెన్సీ టైమ్‌పై అదే పేరుతో కంగనా రనౌత్‌ సినిమా తీస్తోంది. ఈ మూవీ టీజర్‌ గురువారం (జులై 14) రిలీజైంది.
ఎమర్జెన్సీ మూవీలో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్
ఎమర్జెన్సీ మూవీలో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్

ఎమర్జెన్సీ మూవీలో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ డైరెక్షన్‌లో వస్తున్న మూవీ ఎమర్జెన్సీ. ఈ మూవీలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కనిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన చిన్న ప్రోమో వీడియోను మేకర్స్‌ గురువారం (జులై 14) రిలీజ్‌ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Premikudu Re Release: ప్రభుదేవా బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమికుడు రీ రిలీజ్.. 30 ఏళ్లకు మళ్లీ.. 300కుపైగా థియేటర్లలో!

City Hunter Review: సిటీ హంటర్ రివ్యూ.. ఓటీటీ లైవ్ యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

OTT Top Releases in May: మే నెలలో ఓటీటీల్లో 5 ముఖ్యమైన రిలీజ్‍లు ఇవే.. సూపర్ హిట్ సినిమాలు.. ఓ భారీ వెబ్ సిరీస్

Vishwak Sen: ఇండియాలోనే గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్: విశ్వక్‍సేన్.. ఇంటెన్స్ యాక్షన్‍తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్

అందరూ సర్‌ అని పిలిచిన ఆమెను పరిచయం చేస్తున్నా అంటూ కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా ఈ వీడియోను షేర్‌ చేసింది. దీనికి ఎన్నో పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. చాలా మంది ఫ్యాన్స్ ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశారు. ఇందులో పూర్తిగా ఇందిరా గాంధీ లుక్‌లో కనిపిస్తున్న కంగనాను చూడొచ్చు. దేశ ప్రధానుల్లో ఇందిరాకు చాలా పవర్‌ఫుల్‌గా పేరుంది.

ఆమె క్యారెక్టర్‌లో నటించడం అంటే మాటలు కాదు. అయితే ఈ మూవీలో ఆమెలాగా కనిపించడంతోపాటు ఇందిర హావభావాలను కూడా అలాగే చూపించడానికి కంగనా బాగానే ప్రయత్నించినట్లు ఈ వీడియోను బట్టి తెలుస్తోంది. ఇందిరాకు గొప్ప ప్రధానిగా పేరున్నా.. దేశంలో ఎమర్జెన్సీ విధించారన్న ఆగ్రహం, అసంతృప్తి కూడా ఆమెపై ఉంది. తాను ప్రధానిగా ఉన్న రోజుల్లో ఓ డిక్టేటర్‌గా పేరున్న ఇందిర.. ప్రపంచ నేతలను కూడా గడగడలాడించారు.

ఈ ఎమర్జెన్సీ మూవీలో ఒక్క డైలాగుతో ఇందిర వ్యక్తిత్వాన్ని చూపించే ప్రయత్నం కంగనా చేసింది. అమెరికా ప్రెసిడెంట్‌ నిక్సన్‌ మీతో ఫోన్‌ కాల్‌ మాట్లాడినప్పుడు మేడమ్‌ అని పిలవొచ్చా అని అడిగారు అంటూ ఆమె పీఏ వచ్చి చెబుతాడు. దానికి ఆమె దీర్ఘంగా ఆలోచించి సరే అంటుంది. అయితే ఆ వెంటనే నా ఆఫీస్‌లో అందరూ నన్ను సర్‌ అనే పిలుస్తారని చెప్పండి అంటూ చాలా గంభీరంగా చెబుతుంది.

అచ్చూ ఇందిరలాగే ఓ కాటన్ చీర, మెడలో హారం, తలకు తెల్ల రంగుతో కంగనా కనిపించింది. ఆస్కార్ విన్నర్‌ డేవిడ్ మలినోవ్‌స్కీ ఈ మూవీలో కంగనాను ఇలా ఇందిరగా మార్చాడు. ఇతడు డార్కెస్ట్‌ హవర్‌, వరల్డ్‌ వార్‌ జీ, ద బ్యాట్‌మ్యాన్‌లాంటి మూవీస్‌కి పని చేశాడు. ఈ చిన్న ప్రోమో వీడియోతోనే ఎమర్జెన్సీ మూవీలో కంగనా.. ఇందిర పాత్రను ఎలా చూపించబోతున్నారో స్పష్టమవుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.