తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kangana Ranaut: తిట్టిన స్టార్ హీరోయిన్‌కు సినిమా ఆఫర్ ఇస్తానన్న యానిమల్ డైరెక్టర్.. కానీ!

Kangana Ranaut: తిట్టిన స్టార్ హీరోయిన్‌కు సినిమా ఆఫర్ ఇస్తానన్న యానిమల్ డైరెక్టర్.. కానీ!

Sanjiv Kumar HT Telugu

06 February 2024, 10:48 IST

  • Kangana Ranaut Reacts To Sandeep Reddy Vanga Comments: యానిమల్ మూవీపై కంగనా రనౌత్ నెగెటివ్ కామెంట్స్ చేయడంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి పాజిటివ్‌గా తీసుకున్నాడు. కంగనా రనౌత్‌ ఒప్పుకుంటే కథ నెరేట్ చేస్తానని చెప్పాడు. కానీ, సందీప్ రెడ్డి ఆన్సర్‌కు కంగనా రనౌత్ షాకింగ్ రిప్లై ఇచ్చింది.

తిట్టిన హీరోయిన్‌కు సినిమా ఆఫర్ ఇస్తానన్న యానిమల్ డైరెక్టర్.. కానీ!
తిట్టిన హీరోయిన్‌కు సినిమా ఆఫర్ ఇస్తానన్న యానిమల్ డైరెక్టర్.. కానీ!

తిట్టిన హీరోయిన్‌కు సినిమా ఆఫర్ ఇస్తానన్న యానిమల్ డైరెక్టర్.. కానీ!

Sandeep Reddy Vanga vs Kangana Ranaut: గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది యానిమల్ మూవీ. ఇటీవల జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న యానిమల్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్‌తోపాటు విపరీతమైన నెగెటివిటీ వస్తోంది. ఓటీటీలో యానిమల్ మూవీ చూసిన స్టార్ సెలబ్రిటీలు విరుచుకుపడుతూ విమర్శిస్తున్నారు. అలా యానిమల్‌ మూవీని తిట్టిన వాళ్లలో బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటి కంగనా రనౌత్ ఒకరు.

ట్రెండింగ్ వార్తలు

Preminchoddu: పిల్లలకు తల్లిదండ్రులు చూపించాల్సిన సినిమా.. తెలుగులో తమిళ ఫ్లేవర్‌తో ప్రేమించొద్దు

Krishnamma OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వ‌చ్చిన స‌త్య‌దేవ్ కృష్ణ‌మ్మ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

అయితే తన సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేసిన కంగనా రనౌత్‌ ఒప్పుకుంటే ఆమెకు స్టోరీ చెబుతానని యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇటీవల చాలా పాజిటివ్‌గా స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో "కంగనాతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నారా?" అని సందీప్ రెడ్డిని యాంకర్ ప్రశ్నించాడు. "నాకు అవకాశం వస్తే ఆమె ఆ పాత్రకు సరిపోతుందని నాకు అనిపిస్తే నేను వెళ్లి ఆమెకు కథ చెబుతాను. నిజం చెప్పాలంటే జెన్యూన్‌గా ఆమె నటన అంటే నాకు చాలా ఇష్టం" అని కంగనాపై సందీప్ రెడ్డి వంగా కామెంట్స్ చేశాడు.

"కంగనా నటించిన క్వీన్ చూశాను. ఆమె యాక్ట్ చేసిన చాలా సినిమాలు చూశాను. ఆమె యాక్టింగ్ బాగుంటుంది. యానిమల్‌పై ఆమె చేసిన నెగెటివ్ కామెంట్స్‌ గురించి నేను అంతగా పట్టించుకోను. నాకు బాధగా కూడా అనిపించదు" అని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నాడు. అనంతరం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సందీప్ రెడ్డి వంగా ఆన్సర్‌కు వివాదస్పద బ్యూటి కంగనా రనౌత్ మెచ్చుకుంటూనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

"రివ్యూలు, విమర్శలు ఒకటి కాదు. అవి ఒకేలా ఉండవు. ప్రతి కళపై సమీక్ష, చర్చ అనేది జరుగుతుంది. ఇది ఒక సాధారణ విషయం. నా రివ్యూపై సందీప్ గారు నవ్వుతూ గౌరవాన్ని చూపించిన విధానం చాలా గొప్పది. అది అతను మ్యాన్లీగా సినిమాలు తీయడమే కాదు.. అతని యాటిట్యూడ్ కూడా మ్యాన్లీగానే ఉంటుందని చూపిస్తోంది. థ్యాంక్యూ సార్" అని కంగనా రనౌత్ తెలిపుతూ తాజాగా ట్వీట్ చేసింది.

అయితే కంగనా రనౌత్ ఇంకా కొనసాగిస్తూ "కానీ, దయచేసి నాకు ఎలాంటి పాత్రను ఇవ్వకండి. లేకపోతే మీ ఆల్ఫా మగ హీరోలు స్త్రీవాదులు అవుతారు. ఆపై మీ సినిమాలు కూడా విజయం సాధించవు. మీరు బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తారు. మీలాంటి వాళ్లు సినిమా పరిశ్రమకు కావాలి. కానీ, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలు స్త్రీద్వేషపూరిత సన్నివేశాలు, డైలాగ్స్ బహిష్కరించబడ్డాయి" అని ఓవైపు సందీప్ రెడ్డిని ప్రశంసిస్తూనే మరోవైపు ఇన్ డైరెక్ట్‌గా చమత్కరించింది కాంట్రవర్సీ క్వీన్.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగాపై కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా కంగనా చేసిన ట్వీట్ నెట్టింట్లో షేర్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇంతకుముందు యానిమల్ మూవీ కంగనా రనౌత్ "నా సినిమాలకు పెయిడ్ నెగెటివిటీని అందించడమే పెద్ద విషయం అని అనుకుంటుంటే.. ఆడవారిని కొట్టి, హింసించి, వారిని సెక్స్ వస్తువులులాగా భావించి.. వారితో షూ నాకమని అడిగే చిత్రాలను ఆడియెన్స్ ఎంకరేజ్ చేయడం మరో గొప్ప విషయం" అని ఇన్ డైరెక్ట్‌గా కామెంట్స్ చేసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం