Robo Movie Kamal Haasan: కమల్‌హాసన్, ప్రీతీ జింటాలతో రోబో మూవీ తీయాలనుకున్న శంకర్ - ఎందుకు ఆగిపోయిందంటే?
07 February 2024, 10:17 IST
Robo Movie Kamal Haasan: రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 2010లో రిలీజైన రోబో మూవీ కలెక్షన్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. రజనీకాంత్ కంటే ముందు రోబో మూవీని కమల్‌హాసన్, ప్రీతీ జింటాలతో శంకర్ తెరకెక్కించాలని అనుకున్నాడు.
కమల్ హాసన్, ప్రీతీ జింటా రోబో మూవీ
Robo Movie Kamal Haasan: రజనీకాంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో ఒకటిగా రోబో నిలిచింది. దక్షిణాది సినిమా స్థాయిని వరల్డ్ వైడ్‌గా చాటిచెప్పిన సినిమాల్లో రోబో ఒకటి. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 2010లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. 2010లో ప్రేక్షకలు ముందుకొచ్చిన ఈ మూవీ ఇండియాలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ప్రభాస్ బాహుబలి వరకు రోబో రికార్డులను ఏ మూవీ బ్రేక్ చేయలేకపోయింది.
రజనీ ఫస్ట్ ఛాయిస్ కాదు...
అయితే రోబో సినిమాలో రజనీకాంత్ ఫస్ట్ ఛాయిస్ కాదు. 1999లో రోబో మూవీని కమల్‌హాసన్‌తో చేయాలని శంకర్ ప్లాన్ చేశారు. హీరోయిన్‌గా అప్పటి బాలీవుడ్ సెన్సేషన్ ప్రీతి జింటాను తీసుకున్నారు. కమల్‌హాసన్, ప్రీతిజింటాపై ఫోటో షూట్ తో పాటు టెస్ట్ షూట్‌గా ఓ పాటను చిత్రీకరించారు. శంకర్ తీసిన టెస్ట్ షూట్ ఫొటోలు అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి
బడ్జెట్ కారణంగా...
టెస్ట్ షూట్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో రోబో షూటింగ్‌ను ప్రారంభించేందుకు శంకర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. . కానీ బడ్జెట్ పరమైన కారణాల కమల్‌హాసన్, ప్రీతీజింటాలతో శంకర్ చేయాలనుకున్న రోబో ఆగిపోయింది. ఆ తర్వాత షారుఖ్‌ఖాన్‌తో పాన్ ఇండియన్ లెవెల్‌లో రోబోను తెరకెక్కించాలని శంకర్ అనుకున్నారు. అమితాబ్ బచ్చన్‌ను విలన్‌గా తీసుకోవాలని అనుకున్నాడు. కానీ అది కుదరలేదు. చివరగా రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ కాంబినేషన్‌లో ఈ మూవీ తెరపైకివచ్చింది.
320 కోట్ల కలెక్షన్స్...
ఎంథిరన్ పేరుతో తమిళంలో రిలీజైన ఈ మూవీ 2010లోనే 320 కోట్ల కలెక్షన్స్ సాధించింది. రోబో పేరుతో తెలుగులో డబ్ అయి 53 కోట్ల కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. రోబో సినిమాకు సీక్వెల్‌గా రోబో 2.ఓ సినిమాను తెరకెక్కించారు శంకర్. కానీ ఈ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. సీక్వెల్‌లో రజనీకాంత్ హీరోగా నటించగా అక్షయ్‌కుమార్ విలన్ పాత్రను పోషించాడు.
గేమ్‌ఛేంజర్‌తో బిజీ...
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నాడు శంకర్. రామ్‌చరణ్ హీరోగా పాన్ ఇండియన్ లెవెల్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. శంకర్ తెలుగులో చేస్తోన్న ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ ఇదే. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ ఏడాది చివరలో గేమ్ ఛేంజర్ రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇండియన్ 2
గేమ్ ఛేంజర్‌తో పాటు కమల్‌హాసన్‌తో ఇండియన్ 2 మూవీ చేస్తోన్నాడు శంకర్. ఇండియన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఇటీవలే షూటింగ్‌ను పూర్తిచేసుకున్నది. ఈ సీక్వెల్‌లో కమల్‌హాసన్, సిద్ధార్థ్‌తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ కీలక పాత్రలు పోషించనున్నారు. దాదాపు ఆరేళ్లుగా షూటింగ్‌లో ఉన్న ఈ సీక్వెల్ ఈ ఏడాది వేసవిలోనే ర ఇలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకేసారి రెండు సినిమాలు చేయడంశంకర్ కెరీర్‌లో ఇదే మొదటిసారి.