తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kamal Haasan Thug Life: మ‌ణిర‌త్నం మూవీ సెట్స్‌లో అడుగుపెట్టిన‌ క‌మ‌ల్‌హాస‌న్ - థ‌గ్‌లైఫ్ షూటింగ్ షురూ

Kamal Haasan Thug Life: మ‌ణిర‌త్నం మూవీ సెట్స్‌లో అడుగుపెట్టిన‌ క‌మ‌ల్‌హాస‌న్ - థ‌గ్‌లైఫ్ షూటింగ్ షురూ

24 January 2024, 13:38 IST

  • Kamal Haasan Thug Life: క‌మ‌ల్‌హాస‌న్‌, డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న థ‌గ్ లైఫ్ మూవీ షూటింగ్ బుధ‌వారం నుంచి మొద‌లైంది. ఈ సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్‌, జ‌యంర‌వి, త్రిష కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

క‌మ‌ల్‌హాస‌న్‌
క‌మ‌ల్‌హాస‌న్‌

క‌మ‌ల్‌హాస‌న్‌

Kamal Haasan Thug Life: క‌మ‌ల్‌హాస‌న్ జోరు మామూలుగా లేదు. ఇప్ప‌టికే పాన్ ఇండియ‌న్ సినిమాలు క‌ల్కి 2989 ఏడీ, ఇండియ‌న్ 2 షూటింగ్ ల‌ను కంప్లీట్ చేసిన క‌మ‌ల్‌హాస‌న్ బుధ‌వారం నుంచి థ‌గ్‌ లైఫ్ సెట్స్‌లో అడుగుపెట్టాడు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. థ‌గ్ లైఫ్ షూటింగ్ బుధ‌వారం నుంచి మొదలైన‌ట్లు సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది.ఈ మేర‌కు ఓ స్పెష‌ల్‌ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు ప్ర‌ధాన పాత్ర‌ధారులు, సాంకేతిక నిపుణుల ఫొటోల‌ను చూపించారు.

ట్రెండింగ్ వార్తలు

Madgaon Express OTT: ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ యాక్టర్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Yuvaraj OTT: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన కాంతార హీరోయిన్ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

థ‌గ్ లైఫ్ కోసం దాదాపు రెండు నెల‌ల పాటు ఏక‌ధాటిగా బ‌ల్క్ డేట్స్‌ను క‌మ‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఈ ఏడాదిలోనే షూటింగ్‌ను పూర్తిచేసి డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తోన్న‌ట్లు తెలిసింది. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు దుల్క‌ర్ స‌ల్మాన్‌, జ‌యంర‌వి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

దుల్క‌ర్ స‌ల్మాన్‌...

గ‌త్ంలో క‌మ‌ల్‌హాస‌న్, డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం కాంబినేష‌న్‌లో నాయ‌కుడు మూవీ రూపొందింది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ క‌ల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. దాదాపు 35 ఏళ్ల త‌ర్వాత క‌మ‌ల్‌హాస‌న్‌, మ‌ణిర‌త్నం క‌లిసి థ‌గ్ లైఫ్ మూవీ చేయ‌డం కోలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది. అధికారం కోసం పోరాడే కొంద‌రు తిరుగుబాటుదారుల క‌థ‌తో థ‌గ్ లైఫ్ మూవీ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో క‌మ‌ల్‌హాస‌న్ క్యారెక్ట‌ర్ నెగెటివ్ షేడ్స్‌తోసాగుతుంద‌ని అంటున్నారు. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో థ‌గ్ లైఫ్ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

క‌ల్కి, ఇండియ‌న్ 2తో బిజీగా...

ప్ర‌స్తుతం థ‌గ్ లైఫ్‌లో పాటు మ‌రో నాలుగు సినిమాల‌తో క‌మ‌ల్ బిజీగా ఉన్నాడు. ప్ర‌భాస్ క‌ల్కి 2989 ఏడీలో క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ప్ర‌భాస్‌కు ధీటుగా ప‌వ‌ర్‌ఫుల్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మే 9న ఈ మూవీ రిలీజ్ కానుంది. క‌మ‌ల్‌హాస‌న్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఇండియ‌న్ 2 మూవీ షూటింగ్ ఇటీవ‌లే పూర్త‌యింది. 1996లో రిలీజైన ఇండియ‌న్‌కు సీక్వెల్‌గా ఇండియ‌న్ 2 తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ఈ సీక్వెల్‌కు సంబంధించి నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు. ఏప్రిల్‌లో ఇండియ‌న్ 2 రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

పొన్నియ‌న్ సెల్వ‌న్…

అలాగే హెచ్ వినోథ్‌తో ఓ పాన్ ఇండియ‌న్ మూవీని క‌మ‌ల్ చేయ‌నున్నాడు. వీటితోపాటు శింబు, శివ‌కార్తికేయ‌న్ సినిమాల్లో క‌మ‌ల్ హాస‌న్ అతిథి పాత్ర‌లు చేస్తున్నాడు. మ‌రోవైపు మ‌ణిర‌త్నం చివ‌ర‌గా పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. హిస్టారిక‌ల్ క‌థాంశంతో త‌న కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా మ‌ణిర‌త్నం ఈ సినిమాల‌ను చేశారు. పొన్నియ‌న్ సెల్వ‌న్ పార్ట్ 1 విజ‌యం సాధించ‌గా...పార్ట్ 2 మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం