తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalyan Ram Devil: ఇట‌లీ నుంచి బ్లేజ‌ర్స్ - క‌ళ్యాణ్ రామ్ డెవిల్ కాస్ట్యూమ్స్ కోస‌మే భారీ ఖ‌ర్చు!

Kalyan Ram Devil: ఇట‌లీ నుంచి బ్లేజ‌ర్స్ - క‌ళ్యాణ్ రామ్ డెవిల్ కాస్ట్యూమ్స్ కోస‌మే భారీ ఖ‌ర్చు!

11 December 2023, 12:20 IST

google News
  • Kalyan Ram Devil: డెవిల్ మూవీలో క‌ళ్యాణ్ రామ్ ఉప‌యోగించిన‌ కాస్ట్యూమ్స్ కోస‌మే ప్రొడ్యూస‌ర్ కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ ఉప‌యోగించిన కాస్ట్యూమ్స్‌ను ఇట‌లీ నుంచి తెప్పించారు.

క‌ళ్యాణ్ రామ్ డెవిల్
క‌ళ్యాణ్ రామ్ డెవిల్

క‌ళ్యాణ్ రామ్ డెవిల్

Kalyan Ram Devil: క‌ళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ డిసెంబ‌ర్ 29న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. పీరియాడిక‌ల్ డ్రామాగా స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు అభిషేక్ నామా ద‌ర్శ‌కనిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నారు. తొలుత ఈ సినిమాను న‌వంబ‌ర్ 24న రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో డిసెంబ‌ర్ 29కి రిలీజ్ డేట్ వాయిదాప‌డింది. కాగా డెవిల్ సినిమాలో క‌ళ్యాణ్ రామ్‌ కాస్ట్యూమ్స్ కోస‌మే భారీగా ఖ‌ర్చుచేసిన‌ట్లు సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది.

ఈ సినిమా కోసం క‌ళ్యాణ్ రామ్ 90 కాస్ట్యూమ్స్ వాడిన‌ట్లు ప్ర‌క‌టించింది. డెవిల్ మూవీలో క‌ళ్యాణ్ రామ్ బ్రిటీష్ కాలం నాటి గూఢ‌చారి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఆ కాలం నాటి స్టైల్‌ను ఫాలో అవుతూ క‌ళ్యాణ్‌రామ్ క్యారెక్ట‌ర్‌ను ఎలివేట్ చేసేలా క్యాస్టూమ్ డిజైన‌ర్ రాజేష్ ప్ర‌త్యేకంగా డ్రెస్‌ల‌ను డిజైన్ చేశారు. ఈ సినిమాలోక‌ళ్యాణ్ రామ్ ఎక్కువ‌గా వెయిస్ట్ కోటు, ధోతి ధ‌రించి క‌నిపిస్తారు.

ఈ క్యారెక్ట‌ర్ కోసం ఇట‌లీ నుంచి తెప్పించిన మెహైర్ ఊల్‌తో 60 బ్లేజ‌ర్స్ ప్ర‌త్యేకంగా త‌యారు చేసిన‌ట్లు రాజేష్ తెలిపాడు. 25 వెయిస్ట్ కోటుల‌ను డిజైన్ చేసిన‌ట్లు చెప్పారు. ఢిల్లీ నుంచి హ్యాంగింగ్ వాచ్‌ను తెప్పించి సినిమాలో వాడారు. ఇవ‌న్నీ సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తాయ‌ని కాస్ట్యూమ్ డిజైన‌ర్ రాజేష్ చెప్పారు.

ఎంత మంచివాడ‌వురా నుంచి క‌ళ్యాణ్ సినిమాల‌కు రాజేష్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేస్తోన్నాడు. డెవిల్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా రాజేష్‌కు 60వ సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. డెవిల్ మూవీలో సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 12న రిలీజ్ చేయ‌బోతున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం