తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Titanic In Theatres : మళ్లీ థియేటర్లలోకి టైటానిక్ మూవీ.. ఎప్పుడంటే?

Titanic In Theatres : మళ్లీ థియేటర్లలోకి టైటానిక్ మూవీ.. ఎప్పుడంటే?

Anand Sai HT Telugu

17 January 2023, 14:24 IST

google News
    • Titanic Movie Re Release : ప్రపంచ సినిమా చరిత్రలో టైటానిక్ చిత్రానిది స్పెషల్ ప్లేస్. ఈ భాష.. ఆ భాష అని లేదు.. అన్ని భాషల్లోనూ ఆ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. అంత గొప్ప సినిమా మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. అవునూ.. ఇది నిజం.
టైటానిక్ రీ రిలీజ్
టైటానిక్ రీ రిలీజ్ (twitter)

టైటానిక్ రీ రిలీజ్

టైటానిక్(Titanic) పేరు వినగానే.. మెుదట గుర్తొచ్చేది ఓ విషాద ఘటన. ఆ తర్వాత.. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన గొప్ప ప్రేమ కావ్యం గుర్తొస్తుంది. ప్రపంచ సినీ చరిత్రలో గొప్ప చిత్రాల్లో ఇది ఒకటి. టైటానిగ్ మునిగిపోయిన ఘటనకు.. ప్రేమ కావ్యాన్ని జోడించి.. తీసిన సినిమా(Cinema). అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ ఇళ్లల్లో మళ్లీ.. మళ్లీ చూస్తారు. కేట్ విన్స్‌లెట్ మరియు లియోనార్డో డికాప్రియో నటించిన ఈ చిత్రం మొదట డిసెంబర్ 19, 1997న విడుదలైంది. 25 ఏళ్లూ పూర్తి చేసుకుంది.

జేమ్స్ కామెరూన్ ఆస్కార్ అవార్డు(oscar award) గెలుచుకున్న ఐకానిక్ లవ్ స్టోరీ టైటానిక్ ఫిబ్రవరి 10న తిరిగి థియేటర్లలోకి రాబోతోంది. మూడు గంటల 15 నిమిషాల నిడివితో సాగే ఈ చిత్రం 3డి 4కె హెచ్‌డిఆర్‌లో ప్రదర్శిస్తారు. ఈ చిత్రం సాంకేతికంగా ఎన్నో అద్భుతాలను చేసింది. సినిమాలోని సన్నివేశాలు, పాత్రలు వారి నటన కూడా ప్రేక్షకులను టైటానిక్​ ప్రపంచంలో లీనమయ్యేలా చేసిందని చెప్పవచ్చు.

ఫిబ్రవరి 10వ తేదీన సినిమాను రీమాస్టర్డ్​ వెర్షన్​లో రిలీజ్​ చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి. రీమాస్టర్డ్ చేయడం అంటే.. 3D, 4K హెచ్​డీఆర్​, హై ఫ్రేమ్​ రేట్​ ఫార్మాట్​లో మరింత క్వాలిటీతో సినిమాను విడుదల చేస్తారు. ప్రేమికుల దినోత్సవం(Lovers Day) సందర్భంగా నాలుగు రోజుల ముందుగా అంటే.. ఫిబ్రవరి 10న థియేటర్లలో వస్తుంది.

ఈ సినిమా 14 నామినేషన్లలో ఉత్తమ చిత్రం, దర్శకుడు, విజువల్ ఎఫెక్ట్‌లతో సహా 11 అకాడమీ అవార్డులను అందుకుంది. ఇప్పుడు ఈ గొప్ప ప్రేమ కథను మళ్లీ తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 4K 3Dలో టైటానిగ్ సినిమాను చూడటం గొప్ప అనుభూతిగా సినిమా లవర్స్(Cinema Lovers) ఫీల్ అవుతున్నారు. రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రం 1912లో మునిగిపోయిన టైటానిక్ ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాలో బిల్లీ జేన్, కాథీ బేట్స్, ఫ్రాన్సిస్ ఫిషర్, గ్లోరియా స్టువర్ట్, బిల్ పాక్స్‌టన్ వంటి నటులు ఉన్నారు. ఫిబ్రవ‌రి 10న భార‌త‌దేశం అంత‌టా ఈ సినిమా విడుద‌ల‌వుతున్నప్పటికీ, ఎన్ని రోజులు థియేట‌ర్లో ఉంటుందనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం