తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Intinti Ramayanam Teaser: నవ్వించే ఇంటింటి రామాయణం.. టీజర్‌ రిలీజ్‌

Intinti Ramayanam Teaser: నవ్వించే ఇంటింటి రామాయణం.. టీజర్‌ రిలీజ్‌

HT Telugu Desk HT Telugu

25 November 2022, 13:40 IST

    • Intinti Ramayanam Teaser: కడుపుబ్బా నవ్వించే ఇంటింటి రామాయణం టీజర్‌ వచ్చేసింది. ఆహా ఓటీటీలోకి రానున్న ఈ వెబ్‌ మూవీ టీజర్‌ను మేకర్స్‌ శుక్రవారం (నవంబర్‌ 25) రిలీజ్‌ చేశారు.
ఇంటింటి రామాయణంలో రాహుల్ రామకృష్ణ, నరేష్, నవ్యా స్వామి తదితరులు
ఇంటింటి రామాయణంలో రాహుల్ రామకృష్ణ, నరేష్, నవ్యా స్వామి తదితరులు

ఇంటింటి రామాయణంలో రాహుల్ రామకృష్ణ, నరేష్, నవ్యా స్వామి తదితరులు

Intinti Ramayanam Teaser: ఆహా ఓటీటీ తనదైన స్టైల్లో తెలుగు వెబ్‌సిరీస్‌, మూవీస్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ ఓటీటీ మరోసారి ఓ కామెడీ వెబ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమా ద్వారా తొలిసారి ఓటీటీలో అడుగుపెడుతోంది. ఇంటింటి రామాయణం పేరుతో వస్తున్న ఈ మూవీ టీజర్ శుక్రవారం రిలీజైంది.

ట్రెండింగ్ వార్తలు

Chitram Choodara OTT Release Date: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

కడుపుబ్బా నవ్వించేలా ఉన్న ఈ టీజర్‌ మూవీపై అంచనాలు పెంచింది. ఐవీ ప్రొడక్షన్స్‌, మారుతి టీమ్‌తో కలిసి సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ ఇంటింటి రామాయణాన్ని తెరకెక్కించింది. సురేశ్‌ నారెడ్ల ఈ మూవీకి కథ, దర్శకత్వం వహించాడు. ఓ కుటుంబం చుట్టూ తిరిగే ఫన్నీ స్టోరీ ఇది. రాహుల్‌ రామకృష్ణ, నరేష్‌లాంటి నటులు ఉండటం ఈ మూవీకి ప్లస్‌ పాయింట్‌.

తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ఇందులో చూపించినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. కరీంనగర్‌లో జరిగే కథ ఇది. ఇందులో రాములు అనే క్యారెక్టర్‌లో నరేష్‌ కనిపించాడు. అతని ఫ్యామిలీ కథే ఈ ఇంటింటి రామాయణం. ఓ సాధారణ మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ రోజువారీ జీవితంలో ఎదుర్కొనే కష్టాలనే ప్రధాన కథాంశంగా ఈ మూవీని తెరకెక్కించారు.

టీజర్‌ అయితే ఫన్నీగా సాగిపోయింది. డిసెంబర్‌ 16న ఆహా ఓటీటీలోకి ఇంటింటి రామాయణం రాబోతోంది. అన్ని ఎమోషన్స్‌ కలగలిపిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది.

మీరసలు హైలైట్‌ అన్నా.. మీ అసుంటి గొప్ప ఫ్యామిలీ ఏ ఊళ్లో కూడా ఉండదు తెలుసా అనే బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌తో ఈ టీజర్‌ మొదలవుతుంది. అసలు ఏం ఫ్యామిలీ రా మీది.. ఒక్కొక్కడికి ఒక్కో చరిత్ర ఉంది అని పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ డైలాగ్‌తో ముగుస్తుంది. మొత్తానికి టీజర్‌ మూవీపై ఆసక్తి రేపేలా సాగింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.