OG: పవర్ స్టార్ ‘ఓజీ’ మూవీ గురించి ఆసక్తికర లీక్! ఆ బ్యాక్‌డ్రాప్‌లో..!
11 June 2023, 10:04 IST
- OG Movie: పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ గురించి ఓ ఆసక్తికర లీక్ బయటికి వచ్చింది. ఏ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుందో సమాచారం లీకైంది.
OG: పవర్ స్టార్ ‘ఓజీ’ మూవీ గురించి ఆసక్తికర లీక్! ఆ బ్యాక్‌డ్రాప్‌లో..!
OG Movie: వరుస సినిమాలతో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న బ్రో సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో ఈ మూవీ చేస్తున్నారు పవన్. ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రం కూడా చేస్తున్నారు పవన్. ఈ క్రమంలో ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీలోనూ పపవ్ స్టార్ నటిస్తున్నారు. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో గ్యాంగ్‌స్టర్ పాత్రను పవన్ పోషిస్తున్నారు. దీంతో అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఓజీలో పవర్ స్టార్‌ను గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో చూడాలని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. కాగా, ఈ మూవీ గురించి క్రమంగా అప్డేట్లు, లీక్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓజీ సినిమా బ్యాక్‌డ్రాప్ గురించి ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.
ఓజీ మూవీ 1950ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోందని టాక్ బయటికి వచ్చింది. ఆ కాలంలో బడా గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ బ్యాక్‌డ్రాప్ గురించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం లీకైంది. 1950 బ్యాక్‌డ్రాప్‌లో వస్తుందనే లీక్‌తో వింటేజ్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో ఓజీ మూవీలో పవన్ కల్యాణ్ కనిపిస్తారనే విషయం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ బ్యాక్‌డ్రాప్ అంశంపై త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాగా, ఖైదీ సినిమా ద్వారా బాగా ఫేమస్ అయిన తమిళ నటుడు అర్జున్ దాస్.. ఓజీ సినిమాలో నటిస్తున్నాడు. అర్జున్ దాస్‌ను ఆహ్వానిస్తూ ఓజీ చిత్రబృందం అధికారికంగా కూడా ట్వీట్ చేసింది.
ఓజీ మూవీలో పవన్ కల్యాణ్‌కు జోడీగా అరుల్ మోహన్ నటిస్తోంది. మరోవైపు ప్రభాత్‌తో సాహో సినిమా చేసిన సుజీత్‌కు యాక్షన్ డైరెక్టర్‌గా మంచి పేరు వచ్చింది. తెలుగుతో పాటు హిందీలోనూ సాహో మంచి విజయం సాధించింది. ఇక ఓజీ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయింది. ఆ మూవీ విడుదల కావాల్సింది. మరోవైపు పవన్ స్టార్ నటించిన బ్రో సినిమా జూలై 28న రిలీజ్ కానుంది.