తెలుగు న్యూస్  /  Entertainment  /  Indraja Mass Dance Like Keerthy Suresh In Dasara Movie

Indraja Mass Dance: తీన్మార్ డ్యాన్స్‌తో ఇరగదీసిన ఇంద్రజ.. మేడమ్ సార్ మేడమ్ అంతే..!

21 April 2023, 15:49 IST

    • Indraja Mass Dance: బుల్లితెర షో శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జీగా వ్యవహరిస్తున్న ఇంద్రజ తన డ్యాన్స్‌తో ఇరగదీశారు. ఇటీవల విడుదలైన దసరా చిత్రంలోని కీర్తి సురేష్ తీన్మార్ డ్యాన్స్‌ను ఈ షోలో చేసి అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కీర్తి సురేష్ మాదిరిగా తీన్మార్ డ్యాన్స్‌తో అదరగొట్టిన ఇంద్రజ
కీర్తి సురేష్ మాదిరిగా తీన్మార్ డ్యాన్స్‌తో అదరగొట్టిన ఇంద్రజ

కీర్తి సురేష్ మాదిరిగా తీన్మార్ డ్యాన్స్‌తో అదరగొట్టిన ఇంద్రజ

Indraja Mass Dance: నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ అంతా ఒక ఎత్తయితే.. ఇందులో వెన్నెల రోల్‌లో కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ మరో ఎత్తు. ముఖ్యంగా పెళ్లి కూతురు గెటప్‌లో ఆమె చేసిన తీన్మార్ డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫుల్ ఫిదా అవుతున్నారు. అదిరిపోయే రీతిలో పక్కా తెలంగాణ స్టైల్ తీన్మార్ డ్యాన్స్‌తో కీర్తి అదరగొట్టింది. ఇప్పటికీ ఆమె డ్యాన్స్ వీడియోకు స్పూఫ్‌లు, పేరడీలు, రీల్స్ విపరీతంగా వచ్చాయి. ఆడియెన్సే కాకుండా సెలబ్రెటీలు కూడా కీర్తి తీన్నార్‌ను అనుకరించడం ప్రారంభించారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం బుల్లితెరపై జడ్జీగా వ్యవహరిస్తున్న ఇంద్రజ.. దసరా చిత్రంలో కీర్తి సురేష్ మాదిరిగా తీన్మార్ డ్యాన్స్‌తో అదరగొట్టింది.

ట్రెండింగ్ వార్తలు

SS Rajamouli: అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తా: దర్శక ధీరుడు రాజమౌళి.. ఎందుకు ఇలా అన్నారంటే..

OTT Movies This Weekend: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి రానున్న ఈ 4 చిత్రాలను మిస్ అవొద్దండి!

Rajinikanth Biopic: రజినీకాంత్ బయోపిక్ హక్కులను తీసుకున్న బాలీవుడ్ నిర్మాత! వివరాలివే

Panchayat S3 Release: ఈనెలలోనే స్ట్రీమింగ్‍కు రానున్న పంచాయత్ సీజన్ 3.. డేట్ కోసం ఫ్యాన్స్‌కు పని పెట్టిన ఓటీటీ

అచ్చం కీర్తి మాదిరిగానే తన హావాభావాలతో అదరగొట్టింది. ప్రముఖ బుల్లి తెర షో శ్రీ దేవి డ్రామా కంపెనీలో జడ్జీగా వ్యవహరిస్తున్న ఇంద్రజ.. ఈ తీన్మార్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. వెన్నెల వలే మారి కాలు కదిపింది. తన మాస్ స్టెప్పులకు అక్కడున్న వారే కాకుండా.. ఈ వీడియోను చూసిన వారు సైతం ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వయసులోనూ ఆమె ఎనర్జీకి నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. ఆమె వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.

"ఇంద్రజ గారి మాటల్లో ఎంత డెప్త్ ఉందో.. డ్యాన్స్‌లోనూ అంతే డెప్త్ ఉంది" అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టారు. "మళ్లీ 90ల్లో డ్యాన్స్‌లోకి ఇంద్రజ గారు తీసుకెళ్లారు" అని మరొకరు "స్పందించారు. మేడమ్ ఇప్పటిదాకా చేసిన డ్యాన్స్ ఒక ఎత్తు ఈ డ్యాన్స్ మరో లెవల్.. మేడమ్ సార్ మేడమ్ అంతే" అంటూ ఇంకొకరు తన స్పందనను తెలియజేశారు.

శ్రీదేవి డ్రామా కంపెనీలో వీలు చిక్కినప్పుడల్లా తనలో మల్టీ టాలెంట్‌ను అప్పుడప్పుడు బయటపెడుతుంటారు ఇంద్రజ. ఆటలు, పాటలతోనే తనదైన మార్కు చూపిస్తుంటారు. అంతేకాకుండా ఇంద్రజ పాడిన పాటలు కొన్ని ట్రోలింగ్‌కు గురైనప్పటికీ.. మరికొన్నింటిపై మాత్రం సానుకూల స్పందనలు వస్తుంటాయి. తాజాగా కీర్తి సురేష్ మాదిరిగా తీన్మార్ డ్యాన్స్‌తో అదరగొట్టడంతో సర్వత్రా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.