Inaya Sultana Love Proposal To Sohel: సోహెల్‌కు లవ్ ప్రపోజ్ చేసిన ఇనయా
27 December 2022, 10:09 IST
Inaya Sultana Love Proposal To Sohel: సోహెల్ తన ఫస్ట్ క్రష్ అని బిగ్‌బాస్ 6లో ఇనయా సుల్తానా చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా అతడిని డైరెక్ట్‌గా కలిసి లవ్ ప్రపోజ్ చేసింది. సోహెల్‌కు ఇనయా లవ్ ప్రపోజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇనయా సుల్తానా
Inaya Sultana Love Proposal To Sohel: ఇనయా సుల్తానా కల నెరవేరింది. సోహెల్‌కు లవ్ ప్రపోజ్ చేసింది. బిగ్‌బాస్ సీజన్ 6 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా ఇనయా సుల్తానా నిలిచింది. చివరి వీక్ వరకు ఆటతో ఆకట్టుకున్న ఆమె అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. ఇనాయా ఫైనల్ చేరుకోవడం పక్కా అని అందరూ అనుకున్నారు. కానీ ఫైనల్‌కు ముందే హౌజ్‌ను వీడింది. గెస్ట్ ఎపిసోడ్‌లో భాగంగా ఇనయా కోసం సోహెల్ బిగ్‌బాస్ హౌజ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సోహెల్ అంటే తనకు ఇష్టమని, అతడే తన ఫస్ట్ క్రష్ అని ఇనయా చెప్పింది.
కానీ సోహెల్‌కు మాత్రం తన ప్రేమను ఇప్పటివరకు వ్యక్తం చేయలేకపోయానని బిగ్‌బాస్ హౌజ్‌లో చెప్పింది. తాజాగా ఆ కలను ఇనయా నెరవేర్చుకున్నది సోహెల్‌కు డైరెక్ట్‌గా ప్రపోజ్ చేసింది. మై ప్రపోజల్ టూ సోహెల్ అంటూ ఓ వీడియోను యూట్యూబ్ ద్వారా అభిమానులతో పంచుకున్నది ఇనయా.
ఇందులో మీ కోసం ఒక సర్‌ప్రైజ్ ఉంది అంటూ సోహెల్‌తో ఇనాయా చెప్పింది. బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాకా మీతో మాట్లాడాలని వచ్చాను. ఒకటి చెప్పదలచుకున్న మీరు ఏమనుకున్న పర్వాలేదు. నా మనసులో ఉన్నది చెప్పేస్తాను అంటూ ఇనాయా టెన్షన్‌తో సోహెల్‌తో మాట్లాడుతూ ఈ వీడియోలో కనిపించింది.
ఆ తర్వాత సోహెల్ ముందుకు వచ్చి ప్రేమ ఉన్నంత వరకు కాదు ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తాను అంటూ గులాబీ పువ్వులను ఇచ్చి అతడికి ప్రపోజ్ చేసింది. నాకు మీరంటే చాలా ఇష్టమని సోహెల్‌తో చెప్పింది. మీకోసమే ఇలా రెడీ అయ్యివచ్చాను, ప్రపోజ్ చేయడానికే వచ్చానంటూ సోహెల్‌తో ఇనయా అన్నది. నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పే అవకాశం ఇన్నాళ్లు రాలేదు. ఇప్పడు చెబుతున్నా రియల్లీ లవ్ యూ అంటూ ఇనయా..సోహెల్‌తో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.
ఇనయా లవ్ ప్రపోజల్ పట్ల సోహెల్ రెస్పాన్స్ ఏమిటన్నది మాత్రం ఈ వీడియోలో చూపించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోహెల్ హీరోగా నటిస్తోన్న లక్కీ లక్ష్మణ్ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ కానుంది.