తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  800 The Movie: “యాక్టర్లతో క్రికెట్ టీమ్ అయితే.. ఆ తెలుగు హీరోనే కెప్టెన్ చేస్తా” : దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్

800 The Movie: “యాక్టర్లతో క్రికెట్ టీమ్ అయితే.. ఆ తెలుగు హీరోనే కెప్టెన్ చేస్తా” : దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్

25 September 2023, 17:22 IST

    • 800 The Movie: ‘800’ సినిమా ప్రమోషన్లలో దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పాల్గొంటున్నారు. తెలుగు వెర్షన్ కోసం నిర్వహించిన ఈవెంట్‍‍కు హాజరై.. పలు విషయాలపై మాట్లాడారు.
800 The Movie: “యాక్టర్లతో క్రికెట్ టీమ్ అయితే.. ఆ తెలుగు హీరోనే కెప్టెన్ చేస్తా” : దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్
800 The Movie: “యాక్టర్లతో క్రికెట్ టీమ్ అయితే.. ఆ తెలుగు హీరోనే కెప్టెన్ చేస్తా” : దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్

800 The Movie: “యాక్టర్లతో క్రికెట్ టీమ్ అయితే.. ఆ తెలుగు హీరోనే కెప్టెన్ చేస్తా” : దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్

800 The Movie: శ్రీలంక గ్రేట్ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ‘800’ పేరుతో సినిమా రూపొందింది. మురళీధరన్ బయోపిక్‍గా ఈ మూవీ తెరకెక్కింది. క్రికెటర్‌గా మురళీధరన్ ఎదిగిన తీరు, పడిన కష్టాలు, ఆటలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, సాధించిన ఘనతలు ఇలా ఆయన జీవితంలోని ముఖ్యమైన విషయాలతో ‘800’ సినిమా రూపొందింది. ఇప్పటికే వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మురళీధరన్ తన టెస్టు కెరీర్లో 800 టెస్టు వికెట్లు తీయగా.. దాన్నే ఈ సినిమాకు టైటిల్‍గా పెట్టింది మూవీ యూనిట్. ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రను మాధుర్ మిట్టల్ పోషించారు. 800 సినిమా అక్టోబర్ 6వ తేదీన తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో తెలుగు కోసం 800 మూవీ ప్రమోషన్ ఈవెంట్ హైదరాబాద్‍లో నేడు జరిగింది. దీంట్లో ముత్తయ్య మురళీధరన్ పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

హైదరాబాద్‍లో జరిగిన 800 సినిమా తెలుగు ప్రమోషన్ ఈవెంట్‍‍కు భారత దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీధరన్‍కు ఓ ప్రశ్న ఎదురైంది. భారత్‍లో వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలతో ఓ క్రికెట్ టీమ్ ఏర్పాటు చేయాల్సి వస్తే ఎవరిని తీసుకుంటారని మురళీని ప్రశ్నించారు హోస్ట్. అలా.. సెలెబ్రిటీలతో టీమ్ ఎంపిక చేయాల్సి వస్తే.. తాను టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‍ను కెప్టెన్‍గా తీసుకుంటానని మురళీధరన్ అన్నారు. “వెంకటేశ్‍ను కెప్టెన్‍గా తీసుకుంటా. ఎందుకంటే ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎస్ఆర్‌హెచ్ (ఐపీఎల్) మ్యాచ్‍ను ఆయన అసలు మిస్ అవరు. నిజమైన సపోర్టర్. అందుకే ఆయన తొలి ఎంపిక” అని మురళీధరన్ చెప్పారు.

రాజకీయ నాయకులంటే తనకు తెలియదని, తనకు తెలిసిన మరికొందరి యాక్టర్స్ పేరు చెబుతానని మురళీధరన్ అన్నారు. సెలెబ్రెటీలతో క్రికెట్ జట్టు ఏర్పాటు చేయాల్సి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్, నాని, ప్రభాస్‍లను జట్టులోకి తీసుకుంటానని అన్నారు. తనకు సినిమాలంటే ఇష్టమని అందుకే ఇతర పెద్ద స్టార్లను కూడా జట్టులోకి తీసుకుంటానని అన్నారు. నాని చేసిన గొప్ప సినిమా జెర్సీని చూశానని, అతడితో ఫోన్‍లో మాట్లాడానని ముత్తయ్య మురళీధరన్ అన్నారు. నాని సినిమాలు తనకు నచ్చుతాయని చెప్పారు.

800 సినిమాలో మురళీధరన్ పాత్రలో మాధుర్ మిట్టల్ నటించగా.. మహిమా నంబియార్ కీలకపాత్ర చేశారు. తమిళంలో రూపొందిన ఈ సినిమా హిందీ, తెలుగులోనూ అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. మూవీ ట్రైన్స్ మోషన్స్ పిక్చర్స్ ఈ ‘800’ చిత్రాన్ని నిర్మించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం