తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Fighter Movie Ban: అగ్ర తారలు నటించిన దేశభక్తి సినిమా ఫైటర్‌పై నిషేధం.. కోట్లల్లో నష్టం, కారణం అదేనా?

Fighter Movie Ban: అగ్ర తారలు నటించిన దేశభక్తి సినిమా ఫైటర్‌పై నిషేధం.. కోట్లల్లో నష్టం, కారణం అదేనా?

Sanjiv Kumar HT Telugu

24 January 2024, 12:04 IST

google News
  • Hrithik Roshan Fighter Movie Ban: హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్ వంటి స్టార్ నటీనటులు యాక్ట్ చేసిన దేశభక్తి మూవీ ఫైటర్. తాజాగా ఈ సినిమాకు షాక్ తగిలింది. ఫైటర్ మూవీని ఆ దేశాల్లో బ్యాన్ చేశారన్న టాపిక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. దీంతో ఫైటర్ మూవీకి కోట్లల్లో నష్టం వాటిల్లనుంది.

 స్టార్స్ నటించిన దేశభక్తి సినిమాపై నిషేధం.. ఫైటర్‌కు కోట్లల్లో నష్టం
స్టార్స్ నటించిన దేశభక్తి సినిమాపై నిషేధం.. ఫైటర్‌కు కోట్లల్లో నష్టం ((X/@Viacom18Studios))

స్టార్స్ నటించిన దేశభక్తి సినిమాపై నిషేధం.. ఫైటర్‌కు కోట్లల్లో నష్టం

Hrithik Deepika Fighter Banned: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, హాట్ బ్యూటి దీపికా పదుకొణె హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ఫైటర్. ఇందులో మరో అగ్ర నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. అలాగే కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ తదితరులు నటించారు. వార్, పఠాన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ మూవీని తెరకెక్కించారు. దీంతో ఫైటర్ మూవీపై క్రేజీ బజ్ క్రియేట్ అయింది. అలాగే మూవీ పోస్టర్స్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.

బాలీవుడ్ నుంచి ఇప్పటికీ చాలా దేశభక్తి సినిమాలు వచ్చాయి. ఈ మధ్యే పఠాన్, టైగర్ 3 వంటి దేశభక్తి సినిమాలతో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ఇప్పుడు ఇదే ఇండియన్ పాట్రియాటిజం కథతో ఏరియల్ యాక్షన్ మూవీగా వస్తోంది ఫైటర్. గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ఫైటర్. అయితే, హిందీలో ఫుల్ క్రేజీగా టాక్ ఉన్న ఫైటర్‌ మూవీ గురించి తెలుగులో పెద్దగా ఎవరికీ తెలియదు. అలాంటి ఫైటర్ మూవీకి తాజాగా షాక్ తగిలింది.

హృతిక్ రోషన్ ఫైటర్ మూవీపై నిషేధం విధించాయి గల్ఫ్ దేశాలు. అయితే, ఒక యూఏఈ (దుబాయ్) మినహా గల్ఫ్ దేశాలన్నింటిలోనూ ఫైటర్ మూవీని బ్యాన్ చేశారు. అంటే బహ్రేన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతర్, సౌది అరేబియా ఆరు దేశాల్లో నిషేధం విధించారు. ఒక దుబాయ్‌లో (యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్/యూఏఈ) మాత్రం పీజీ15 వర్గీకరణతో ఫైటర్ మూవీకి సెన్సార్ బోర్డ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో విడుదల చేస్తున్నారు.

ఈ విషయంపై సినీ వ్యాపార నిపుణుడు, నిర్మాత గిరీష్ జోహార్ ట్వీట్ చేశారు. "మిడిల్ ఈస్ట్ ప్రాంతాలలో ఫైటర్ మూవీ థియేట్రికల్ విడుదలపై అధికారికంగా నిషేధించారు. కేవలం యూఏఈ మాత్రమే పీజీ15 క్లాసిఫికేషన్‌తో ఫైటర్ సినిమాను విడుదల చేస్తుంది" అని గిరీష్ జోహార్ తెలిపారు. అయితే, బ్యాన్ చేయడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. దీంతో ఈ విషయం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఫైటర్ నిషేధంపై మూవీ టీమ్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

కాగా ఇలా బాలీవుడ్‌లోని చాలా సినిమాలకు బ్యాన్ సెగ అంటుకుంది. ఇటీవలే టైగర్ 3 సినిమాను సైతం గల్భ్ దేశాలు బ్యాన్ చేశాయి. సాధారణంగా తీవ్రవాదం, భారత్-పాకిస్తాన్ వివాదం వంటి సెన్సువల్ కథతో ఉన్న సినిమాలను గల్ఫ్ కంట్రీస్ బ్యాన్ చేస్తాయి. ఇలాంటి కారణంతోనే ఫైటర్ మూవీని బ్యాన్ చేశారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే, గల్ఫ్ దేశాల్లో నిషేధం వల్ల ఫైటర్ మూవీకి మిలియన్ డాలర్లలో కలెక్షన్స్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఫైటర్ మూవీ పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్ పట్టణ పరిసర ప్రాంతాల్లో భారత సాయుధ దళాలు చేసిన బాలాకోట్ వైమానిక దాడుల చుట్టూ తిరుగుతుంది. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అతిపెద్ద శిబిరంపై వైమానిక దాడులు జరిగాయి. ఈ ఉగ్రదాడిలో దాదాపు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

ఫైటర్ మూవీలో స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా అలియాస్ పాటీ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. స్క్వాడ్రన్ లీడర్ మినాల్ రాథోడ్ అలియాస్ మిన్నీ పాత్రలో దీపికా పదుకొణె కనిపించనుంది. గ్రూప్ కెప్టెన్ రాకేశ్ జై సింగ్ అలియాస్ రాకీ పాత్రలో సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం