తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Captain Vijayakanth: విజయ్ కాంత్‌కు 'కెప్టెన్' బిరుదు.. అది ఎలా వచ్చిందో తెలుసా?

Captain Vijayakanth: విజయ్ కాంత్‌కు 'కెప్టెన్' బిరుదు.. అది ఎలా వచ్చిందో తెలుసా?

Sanjiv Kumar HT Telugu

28 December 2023, 14:32 IST

google News
  • Politician Vijayakanth Moniker Captain: తమిళ అగ్ర నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయ్ కాంత్ అనారోగ్యం కారణంగా ఇవాళ కన్నుమూశారు. సినిమాల్లో స్టార్ హీరోగా పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ కాంత్‌కు కెప్టెన్ అనే బిరుదు ఎలా వచ్చిందనే విషయం ఆసక్తిగా మారింది.

విజయ్ కాంత్‌కు 'కెప్టెన్' బిరుదు.. అది ఎలా వచ్చిందో తెలుసా?
విజయ్ కాంత్‌కు 'కెప్టెన్' బిరుదు.. అది ఎలా వచ్చిందో తెలుసా?

విజయ్ కాంత్‌కు 'కెప్టెన్' బిరుదు.. అది ఎలా వచ్చిందో తెలుసా?

Captain Vijayakanth Death: డీఎండీకే అధినేత, ప్రముఖ తమిళ నటుడు విజయ్ కాంత్ కన్నుమూశారు. కెప్టెన్‌గా పేరొందిన విజయ్ కాంత్ గత కొన్నేళ్లుగా ఆరోగ్యం బాగోలేదు. న్యూమోనియాతో బాధపడుతున్న కెప్టెన్ విజయ్ కాంత్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన్ను చికిత్స నిమిత్తం వెంటిలేటర్‌పై ఉంచారని ఎంఐఓటీ ఇంటర్నేషనల్ ఆసుపత్రి పత్రికా ప్రకటనలో తెలిపింది.

అప్పుడే పాపులర్

వైద్య సిబ్బంది ఎంతగా శ్రమించినా ఇవాళ ఉదయం (డిసెంబర్ 28) కెప్టెన్ విజయ్ కాంత్ కన్నుమూశారు. ఇదిలా ఉంటే డీఎండీకే అధినేత విజయ్ కాంత్‌కు కెప్టెన్ అనే బిరుదు సినీ రంగంలోనే ఉన్నప్పుడే పాపులర్ అయింది. రాజకీయాల్లోకి రాకముందు విజయ్ కాంత్ పలు తమిళ సినిమాల్లో నటించి సినీ నటుడిగా సక్సెస్ ఫుల్ కెరీర్‌ను కొనసాగించారు.

100వ సినిమా హిట్

1991లో విడుదలైన 'కెప్టెన్ ప్రభాకరన్' మూవీ విజయ్ కాంత్‌కు ఒక సినిమా మాత్రమే కాదు. తమిళ సినిమాల్లో ఇప్పటి వరకు సాటిరాని రికార్డును నెలకొల్పిన సినిమా కెప్టెన్ ప్రభాకరన్. అయితే ఈ మూవీ విజయ్ కాంత్‌కు 100వ సినిమా. కెప్టెన్ ప్రభాకరన్ మూవీ విజయం కావడమే కాకుండా విజయ్ కాంత్ కంటే ముందుగా ఏ నటుడూ కూడా తన 100వ సినిమా హిట్ కావడాన్ని చూడలేదు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన హీరోగా విజయ్ కాంత్‌కు పేరు వచ్చింది.

అసాధారణ విజయం

కెప్టెన్ ప్రభాకరన్ సినిమా విజయంతో నటుడిగా విజయ్ కాంత్ స్థాయిని తమిళ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. దాంతో అప్పటి నుంచి విజయ్ కాంత్‌ను కెప్టెన్‌గా పిలవడం మొదలు పెట్టారు. అనంతరం చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశేష సేవలకు, 'కెప్టెన్ ప్రభాకరన్'తో ఆయన సాధించిన అసాధారణ విజయానికి గుర్తింపుగా నటీనటుల సంఘం అధ్యక్షుడిగా విజయ్ కాంత్ ఎన్నికయ్యారు.

నిజమైన కెప్టెన్‌గా

ప్రముఖ నటుడి నుంచి ఇండస్ట్రీలో నాయకత్వ పాత్రను చేపట్టే స్థాయికి విజయ్ కాంత్ ఎదగడంతో రియల్ లైఫ్‌లో కూడా నిజమైన కెప్టెన్ అనిపించుకున్నారు. మొదట సినీ వ్యక్తిత్వంతో ముడిపడి ఉన్న ఈ 'కెప్టెన్' బిరుదు, రాజకీయంలో అభివృద్ధి చెందుతున్న ఆయన నాయకత్వ లక్షణాలకు చిహ్నంగా మారింది.

ప్రతిపక్ష నేతగా

అలా నాయకత్వానికి చిహ్నంగా 'కెప్టెన్' బిరుదును స్వీకరించిన విజయ్ కాంత్ 2000 దశకం ప్రారంభంలో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం (డీఎండీకె) ను స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని జయలలిత నేతృత్వంలోని కూటమి విజయం సాధించడంతో విజయ్ కాంత్ ప్రతిపక్ష నేత అయ్యారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం