తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Johnny Depp: 25 ఏళ్ల తర్వాత మెగాఫోన్‌ పట్టనున్న జానీ డెప్‌

Johnny Depp: 25 ఏళ్ల తర్వాత మెగాఫోన్‌ పట్టనున్న జానీ డెప్‌

HT Telugu Desk HT Telugu

15 August 2022, 21:59 IST

google News
  • Johnny Depp: హాలీవుడ్‌ స్టార్‌ హీరో, పైరేట్స్‌ ఆఫ్‌ కరీబియన్‌ ఫేమ్‌ జానీ డెప్‌ మళ్లీ డైరెక్టర్‌ అవతారమెత్తనున్నాడు. 25 ఏళ్ల తర్వాత అతడు మరో సినిమాను డైరెక్ట్‌ చేయబోతున్నాడు.

హాలీవుడ్ నటుడు జానీ డెప్
హాలీవుడ్ నటుడు జానీ డెప్ (REUTERS)

హాలీవుడ్ నటుడు జానీ డెప్

జానీ డెప్‌ మళ్లీ మెగా ఫోన్‌ పట్టుకుంటున్నాడు. వచ్చే ఏడాది అతడు ఓ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. ఇటాలియన్‌ ఆర్టిస్ట్‌ అమెదియో మొదిలియానీ బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు డెప్‌తోపాటు నటుడు అల్‌ పచీనో నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో నటీనటులు ఎవరు? జానీ డెప్‌ నటిస్తాడా లేదా అన్నది ఇంకా తెలియలేదు.

అమెదియో మొదిలియానీ ఓ ఇటాలియన్‌ పెయింటర్‌. అయితే అతడు బతికి ఉన్నప్పుడు రాని పేరు ప్రతిష్టలు చనిపోయిన తర్వాతే వచ్చాయి. తనను తాను ఓ విఫల పెయింటర్‌గా అతడు చెప్పుకునే వాడు. 1920లో మొదిలియానీ చనిపోయిన తర్వాత అతడు వేసిన పెయింటింగ్స్‌కు డిమాండ్‌ పెరిగిపోయింది. 20వ శతాబ్దం మొదట్లో పారిస్‌లో జీవించిన మొదిలియానీ జీవిత చరిత్రను ఈ మూవీ కళ్లకు కట్టనుంది.

వచ్చే ఏడాది ఫ్రాన్స్‌లోనే ఈ మొదిలియానీ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లోపు ఈ సినిమా నటీనటులను ప్రకటించనున్నారు. జానీ డెప్‌ తన కెరీర్‌లో ఒకే సినిమాకు దర్శకత్వం వహించాడు. 1997లో ది బ్రేవ్‌ అనే మూవీకి అతడే డైరెక్టర్‌. మార్లన్‌ బ్రాండోతో కలిసి జానీ డెప్‌ ఆ మూవీలో నటించాడు. ఇక కెరీర్‌లో 11 సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం