తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hi Nanna Vs Extra Ordinary Man: హాయ్ నాన్న Vs ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ - నితిన్‌పై నానిదే డామినేషన్

Hi Nanna vs Extra Ordinary Man: హాయ్ నాన్న vs ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ - నితిన్‌పై నానిదే డామినేషన్

12 December 2023, 12:31 IST

  • Hi Nanna vs Extra Ordinary Man: గ‌త వారం రిలీజైన సినిమాల్లో నాని హాయ్ నాన్న బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. సోమ‌వారం రోజు రెండు కోట్ల తొంభై ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.  నితిన్ మూవీ ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ 50 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి డిస‌పాయింట్ చేసింది.

హాయ్ నాన్న , ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్
హాయ్ నాన్న , ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్

హాయ్ నాన్న , ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్

Hi Nanna vs Extra Ordinary Man: గ‌త వారం బాక్సాఫీస్ వ‌ద్ద నాని హాయ్ నాన్న‌తో పాటు నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమాలో పోటీప‌డ్డాయి. ఇందులో నాని బాక్సాఫీస్ విన్న‌ర్‌గా నిల‌వ‌గా నితిన్‌కు మ‌రోసారి నిరాశే మిగిలింది. ఐదో రోజు కూడా నాని హాయ్ నాన్న మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటాగా నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సోమ‌వారం రోజు పూర్తిగా డీలా ప‌డింది. ఐదో రోజు హాయ్ నాన్న మూవీ రెండు కోట్ల తొంభై ల‌క్ష‌ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

Krishna mukunda murari serial:ముకుందకు మురారి సేవలు.. మీరా నెల తప్పిందన్న భవానీ, షాక్ లో కృష్ణ

Karthika deepam 2:కార్తీకదీపం 2 సీరియల్..కాంచనని మోసం చేస్తున్న శ్రీధర్.. కార్తీక్ గురించి మరో నిజం తెలుసుకున్న పారిజాతం

మొత్తంగా ఐదు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా న‌ల‌భై ఎనిమిది కోట్ల వ‌ర‌కు గ్రాస్‌ను, ఇర‌వై నాలుగు కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్‌ను హాయ్ నాన్న ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. మంగ‌ళ‌వారం నాటితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. 27 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన హాయ్ నాన్న 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైంది. బాక్సాఫీస్ వ‌ద్ద నాని జోరు కొన‌సాగుతోండ‌గా నితిన్‌కు మాత్రం నిరాశే మిగిలింది.

ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ మూవీ సోమ‌వారం రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా కోటి వ‌ర‌కు గ్రాస్‌ను యాభై ల‌క్ష‌లకుపైగా షేర్‌ను రాబ‌ట్టిన‌ట్లు తెలిసింది. ఓవ‌రాల్‌గా నాలుగు రోజుల్లో ఈ మూవీ తొమ్మిది కోట్ల వ‌ర‌కు గ్రాస్‌ను నాలుగున్న‌ర కోట్ల షేర్ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ట్లు చెబుతోన్నారు. దాదాపు ఇర‌వై ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ రిలీజైంది.

ఇప్ప‌టివ‌ర‌కు ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమా నాలుగున్న‌ర కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టిన నేప‌థ్యంలో లాభాల్లోకి అడుగుపెట్ట‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించింది. తండ్రీకూతుళ్ల అనుబంధంతో ద‌ర్శ‌కుడు శౌర్యువ్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. మ‌రోవైపు ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమాకు వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం