Hi Nanna Review: హాయ్ నాన్న రివ్యూ - నాని, మృణాల్ ఠాకూర్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
07 December 2023, 8:34 IST
Hi Nanna Review: నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న గురువారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందంటే?
నాని హాయ్ నాన్న
Hi Nanna Review: దసరా వంటి మాస్ మూవీ తర్వాత క్లాస్ లవ్‌స్టోరీని ఎంచుకొని నాని (Nani) చేసిన సినిమా హాయ్ నాన్న. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. శుక్రవారం థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. దసరా తర్వాత నాని నటించిన ఈ సినిమా ఎలా ఉంది? మరో బ్లాక్‌బస్టర్ హిట్ నానికి దక్కిందా? లేదా? అన్నది చూద్దాం...
విరాజ్ ప్రేమకథ...
విరాజ్(నాని)కు తన కూతురు మహి (బేబీ కియారా) అంటే ప్రాణం. మహికి తల్లి లేకపోవడంతో కూతురిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. అరుదైన వ్యాధి కారణంగా పుట్టుక నుంచే మహి ప్రాణాలతో పోరాడుతుంటుంది. కూతురిని ఆ బాధ నుంచి బయటపడేయడానికి విరాజ్ కథలు చెబుతుంటాడు. తండ్రి చెప్పే కథలతో రియల్‌లైఫ్ వ్యక్తులను ఊహించుకుంటుంది మహి.
అమ్మ కథ చెప్పమని విరాజ్‌ను చాలా రోజుల నుంచి అడుగుతుంది మహి. కానీ విరాజ్ మాత్రం ఆ కథ చెప్పకుండా వాయిదావేస్తుంటాడు. మహి జీవితంలోకి యశ్న (మృణాల్ ఠాకూర్) అనే అమ్మాయి వస్తుంది. అదే రోజు మహికి అమ్మ కథ చెబుతాడు విరాజ్. అమ్మ పాత్రలో యశ్నను ఊహించుకోమని అంటాడు. కూతురికి విరాజ్ అలా ఎందుకు చెప్పాడు? విరాజ్‌ను ప్రాణంగా ప్రేమించిన వర్ష (మృణాల్ ఠాకూర్) మహి పుట్టిన తర్వాత అతడికి ఎందుకు దూరమైంది?
యశ్నకు వర్షకు సంబంధం ఉందా? పెళ్లైకూతురు ఉన్న విరాజ్‌తో యశ్న ఎలా ప్రేమలో పడింది? వారి ప్రేమకథకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? విరాజ్, వర్ష తిరిగి కలుసుకున్నారా? మహి ప్రాణాలను విరాజ్ కాపాడాడా? లేదా? అన్నదే హాయ్ నాన్న(Hi Nanna Review) కథ.
సింపుల్ స్టోరీ...
నాని ఎంచుకునే కథలు సింపుల్‌గానే ఉన్నా వాటిలో బలమైన భావోద్వేగాలు, డ్రామా కనిపిస్తుంటుంది. కెరీర్ ఆరంభం నుంచి ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ సక్సెస్‌లను అందుకుంటున్నాడు నాని. హాయ్ నాన్న(Hi Nanna Review)తో మరోసారి అదే రూట్‌లో అడుగులు వేశాడు. ఓ జంట ప్రేమ ప్రయాణంతో ఎమోషనల్ రైడ్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు.ఓ చిన్న ట్విస్ట్‌పై ఆధారపడి డైరెక్టర్ శౌర్యువ్ ఈ కథను రాసుకున్నాడు. సింపుల్ లవ్ స్టోరీని నాని, మృణాల్ ఠాకూర్ తమ కెమిస్ట్రీ, యాక్టింగ్‌తో నిలబెట్టారు. ఒకే ప్రేమకథను రెండు కోణాల్లో చూపించడం, వాటిని కలుపుతూ వచ్చే మలుపును బలంగా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
తండ్రీకూతుళ్ల అనుబంధంతో...
విరాజ్, మహి అనుబంధంతో హాయ్ నాన్న సినిమా మొదలవుతుంది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్స్‌ను రియలిస్టిక్‌గా మనసుల్ని హత్తుకునేలా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. యశ్న ఎంట్రీతోనే కథ మలుపులు తిరుగుతుంది. విరాజ్ చెప్పే కథలో యశ్నను మహి ఊహించుకోవడంతో లవ్‌స్టోరీలోకి సినిమా ఎంటర్ అవుతుంది. విరాజ్, వర్ష లవ్ స్టోరీలో కొత్తదనం మిస్సయింది. పేదింటి అబ్బాయి, గొప్పింటి అమ్మాయి అంటూ రొటీన్ టెంప్లేట్ స్టోరీతో కథను ముందు నడిపించాడు. సెకండాఫ్‌లో విరాజ్, యశ్న లవ్‌స్టోరీలో కాన్‌ఫ్లిక్స్ అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. యశ్న, వర్షకు మధ్య ఉన్న సంబంధాన్ని రివీల్ చేసే క్లైమాక్స్ సీన్స్ సినిమాను(Hi Nanna Review) నిలబెట్టాయి.
నెమ్మదిగా సాగే కథనం...
ఆద్యంతం హాయ్ నాన్న కథ నెమ్మదిగా సాగడం కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ నాని, మృణాల్ ఠాకూర్ తమ కెమిస్ట్రీతో ఆ ఫీల్ కలగకుండా చేశారు. విరాజ్, వర్ష లవ్ స్టోరీని డిఫరెంట్‌గా రాసుకుంటే బాగుండేది.
విరాజ్ పాత్రలో నాని...
విరాజ్ పాత్రలో నాని అదరగొట్టాడు. కూతురి కోసం ఆరాటపడే తండ్రిగా...ప్రేమికుడిగా, డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడిన పాత్రలో చక్కటి వేరియేషన్స్ చూపించాడు. వర్ష, యశ్నగా రెండు షేడ్స్‌తో సాగే పాత్రలో మృణాల్ యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. సీతారామం తర్వాత మరోసారి తన యాక్టింగ్‌తో మెప్పించింది. శృతిహాసన్ ఓ పాటలో మాత్రమే కనిపిస్తుంది. బేబీ కియారా నటన ఆకట్టుకుంటుంది. అంగడ్‌బేడీ, జయరామ్ చిన్న పాత్రలే అయినా తమ అనుభవంతో మెప్పించారు.ఈ సినిమాకు హీషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ పెద్ద ఎసెట్‌గా నిలిచింది.
Hi Nanna Review -ఫ్యామిలీ మూవీ...
హాయ్ నాన్న ఫీల్‌గుడ్ ఎమోషనల్ మూవీ. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా కోసం ఎదురుచూస్తోన్న ఆడియెన్స్ మంచి ఛాయిస్‌గా ఈ మూవీ నిలుస్తుంది.
రేటింగ్: 2.75 /5