Avatar 2 10 Days Box office Collection: కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోన్న అవతార్ 2.. 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
26 December 2022, 12:58 IST
- Avatar 2 10 Days Box office Collection: అవతార్ 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా దూసుకెళ్తోంది. మొదటి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్‌కు కలెక్షన్లు తగ్గినప్పటికీ.. మెరుగైన వసూళ్లను రాబడుతోంది. విడుదలైన పది రోజుల్లో రూ.855 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
అవతార్ 2 కలెక్షన్లు
Avatar 2 10 Days Box office Collection: జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ డిసెంబరు 16న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన ఐదో చిత్రంగా నిలిచింది. సినిమా విడుదలై పది రోజులు కావస్తున్నా బాక్సాఫీస్ వసూళ్లపరంగా మాత్రం అస్సలు తగ్గలేదు. 20వ సెంచరీ ఫాక్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 855 మిలియన్ డాలర్లు(రూ. దాదాపు 7 వేల కోట్లు) రాబట్టింది.
ఈ సినిమా ఒక్క అమెరికాలోనే 253.7 మిలయన్ డాలర్లు(2 వేల కోట్లు) వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా 855 మిలియన్ డాలర్లను రాబట్టింది. అంటే 660 మిలియన్ డాలర్లు(4 వేల 964 కోట్లు) వసూళ్లతో దూసుకెళ్లింది. ఉత్తర అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. వసూళ్లపై పెద్దగా ప్రభావం పడకపోవడం గమనార్హం.
రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెరైటీ మ్యాగజైన రిపోర్టు ప్రకారం 350 మిలియన్ డాలర్లతో(రూ.2800 కోట్లు) ఈ ఏడాది చివరకు ఒక బిలియన్ డాలర్(రూ.8వేల 200 కోట్ల) మార్కును అధిగమించే అవకాశముందని అంచనా వేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు టాప్ గన్ మ్యావ్రిక్, జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రాలు మాత్రమే ఒక బిలియన్ మార్కును అందుకున్నాయి. త్వరలో ఈ రికార్డును అవతార్ 2 అధిగమించే అవకాశం కనిపిస్తోంది.
ఉత్తర అమెరికాలో కాకుండా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ దుమ్మురేపుతోంది. చైనాలో 100 మిలియన్ డాలర్లు, కొరియాలో 53 మిలియన్ డాలర్లు, ఫ్రాన్స్‌లో 52.3 మిలియన్ డాలర్లు, భారత్‌లో 37 మిలియన్ డాలర్లు, జర్మనీలో రూ.35.7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అవతార్ 2 ముందు భాగమైన అవతార్ రికార్డును మాత్రం అందుకోవడం కష్టంగా మారింది. అవతార్ మొదటి భాగం 2.97 బిలియన్ డాలర్లతో రికార్డు సృష్టించింది.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల్లో ఈ సినిమాకు తగినంత ఆదరణ లభించట్లేదు. చైనాలో ఓ పక్క కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం, రష్యాలో ఈ సినిమాకు ఆదరణ లేకపోవడంతో వసూళ్లపై ప్రభావం పడింది.