తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Harish Shankar: గ్యాప్ వెకేష‌న్ - సినిమా రిలీజైతే సెన్సేష‌న్‌ - ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌పై హ‌రీష్ శంక‌ర్ కామెంట్స్‌

Harish Shankar: గ్యాప్ వెకేష‌న్ - సినిమా రిలీజైతే సెన్సేష‌న్‌ - ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌పై హ‌రీష్ శంక‌ర్ కామెంట్స్‌

15 December 2023, 9:28 IST

  • Harish Shankar: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమాపై డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సినిమా రిలీజైతే సెన్సేష‌న్ అని చెప్పాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్
ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్

Harish Shankar: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా షూటింగ్ ఆగిపోయిన‌ట్లు గ‌త కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తోన్నాయి. ఈ సినిమా షూటింగ్ తిరిగి మొద‌లుకావ‌డం అనుమాన‌మేనంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే ర‌వితేజ‌తో హ‌రీష్ శంక‌ర్ కొత్త సినిమాను అనౌన్స్‌చేయ‌డంతో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ప్యాక‌ప్ వార్త‌ల‌కు బ‌లం చేకూరింది.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

ఉస్తాడ్ మూవీ రిలీజ్ కావ‌డం డౌటేన‌ని ప‌వ‌న్ అభిమానులు ఫిక్స‌య్యారు. ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల‌కు చెక్ పెట్టాడు డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్. బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు హ‌రీష్ శంక‌ర్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు. ఈ ఎపిసోడ్ తాలూకు ప్రోమో రిలీజైంది.

ఈ ప్రోమోలో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌పై హ‌రీష్ శంక‌ర్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. “ఏంటి బాబాయ్ హాలీడేసా ఫ్రీగా ఉన్నావ్” అని హ‌రీష్ శంక‌ర్‌ను బాల‌కృష్ణ ప్ర‌శ్న అడిగారు. బాల‌కృష్ణ ప్ర‌శ్న‌కు “గ్యాప్ మ‌ట్టుకు వెకేష‌న్‌. సినిమా రిలీజైతే సెన్సేష‌నే” అంటూ హ‌రీష్ శంక‌ర్ బ‌దులిచ్చాడు.

ఇన్నాళ్లు తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌వ‌న్ బిజీగా ఉన్నారు. మ‌రోవైపు వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న ఏపీ ఎలెక్ష‌న్స్ కోసం ఐదారు నెల‌ల వ‌ర‌కు సినిమా షూటింగ్‌ల‌కు బ్రేకిచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గ్యాప్‌ను ఉద్దేశించే అన్‌స్టాప‌బుల్ షోలో హ‌రీష్ శంక‌ర్ ఈ కామెంట్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

అత‌డి కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన తేరీ రీమేక్‌గా ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప‌వ‌న్ బ్రేక్‌తో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌తో పాటు హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు, ఓజీ సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం