Hanuman OTT Date: ఓటిటిలోకి హనుమాన్ మూవీ.. వారం ముందుగానే స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
18 February 2024, 14:23 IST
Hanuman OTT Streaming Date: జనవరి 12న విడుదలై సంక్రాంతి బరిలో సూపర్ హిట్ మూవీగా రికార్డ్ కొట్టింది హనుమాన్. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వసూలు చేస్తూ సత్తా చాటుతున్న హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. పూర్తి విషయాల్లోకి వెళితే..
ఓటీటీలోకి హనుమాన్.. స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్! ఒక వారం ముందే రిలీజ్, ఎక్కడ చూడొచ్చంటే?
Hanuman OTT Release Date: మొదట్లో అతి చిన్న మూవీగా స్టార్ట్ అయి తర్వాత విడుదలకు వచ్చేసరికి అతి భారీ చిత్రంగా మారింది హనుమాన్. తెలుగుతోపాటు కేవలం భారతీయ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిద్దామనుకున్న హనుమాన్ మూవీని ఏకంగా అంతర్జాతీయ భాషల్లో సైతం రిలీజ్ చేశారు. తెలుగుతోపాటు తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్, చైనీస్, కొరియన్, జపనీస్ భాషల్లో రిలీజ్ చేసిన పాన్ వరల్డ్ మూవీగా అవతరించింది హనుమాన్.
ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. రిలీజ్‌కు ముందు పెయిడ్ ప్రీమియర్స్, సినిమా షోస్ చూసిన ప్రేక్షకులు హనుమాన్ సినిమాను ప్రశంసలతో ముంచెత్తారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మను ఆకాశానికి ఎత్తేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ సినిమాతో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాల్లో అన్నింటికంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది హనుమాన్ చిత్రం.
అయితే, ఇప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంపర కొనసాగిస్తున్న హనుమాన్ చిత్రం ఓటీటీ విడుదల తేది ఆసక్తికరంగా మారింది. హనుమాన్ చిత్రం డిజిటల్ స్ట్కీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో ఉండటంతో దానికి తగినట్లుగానే ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. హనుమాన్ సినిమాను జీ5 సంస్థ మొత్తంగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఇన్ సైడ్ టాక్. అందులో హనుమాన్ తెలుగు వెర్షన్‌కు రూ. 11 కోట్లు, హిందీ వెర్షన్‌కు రూ. 5 కోట్లు వచ్చినట్లు ఇదివరకు టాక్ జోరుగా నడిచింది.
ఇక ఇటీవలే హనుమాన్ ఓటీటీ రిలీజ్‌పై జీ5 సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. అయితే ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్ అయిన మూడు వారాల తర్వాత హనుమాన్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాల్సిది. కానీ, సినిమాకు మంచి ఆదరణ రావడంతో థియేట్రికల్ రన్‌ను 55 రోజులకు పొడగించారు. 55 రోజుల తర్వాత జీ5 ఓటీటీలోకి హనుమాన్ మూవీని రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. మార్చి రెండో వారంలో జీ5లో హనుమాన్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా ఓటీటీ సంస్థ ప్రకటించింది.
అయితే, అప్పుడు హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు తాజాగా హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. జీ5లో హనుమాన్ మూవీని మార్చి 2 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఓ టాక్ వస్తోంది. దాదాపుగా ఇదే డేట్ నుంచి స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే, ఇంతకుముందు మార్చి రెండో వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం సాగింది. కానీ, ఒకవారం ముందుకు జరిగి మార్చి 2నే హనుమాన్ వచ్చేస్తోంది. కాబట్టి హనుమాన్‌ను ఓటీటీలో చూడాలనుకునేవారు ఇంకొన్ని రోజులు ఆగితే సరిపోతుంది.
ఇదిలా ఉంటే ఇటీవలే హనుమాన్ మూవీ టికెట్ రేట్‌ను రూ. 100 తగ్గించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఇండియన్ తొలి సూపర్ హీరో చిత్రం హనుమాన్‌లో తేజ సజ్జ హీరోగా చేశాడు. అమృత అయ్యర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. వినయ్ రాయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, సత్య పలు పాత్రల్లో ఆకర్షించారు.