Hanuman Collections: 250 కోట్ల క్లబ్‌లో హనుమాన్ - 100 కోట్ల లాభాలు - ఆర్‌ఆర్ఆర్, బాహుబలి 2 రికార్డులు బ్రేక్
27 January 2024, 15:29 IST
Hanuman Enters 250 cr Club: తేజా సజ్జా హనుమాన్ మూవీ 250 కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రభాస్, అల్లు అర్జున్‌తో పాటు స్టార్ హీరోలు సినిమా రికార్డులను బ్రేక్ చేసింది.
హనుమాన్ మూవీ
Hanuman Enters 250 cr Club: తేజా సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలుకొడుతోంది. తాజాగా ఈ మూవీ రెండు వందల యాభై కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
250 కోట్ల పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గురువారం నాటికి వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 250 కోట్లకుగాపై గ్రాస్‌ను 130 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్‌ను రాబట్టినట్లు పేర్కొన్నారు. తెలుగులో స్టార్ హీరోల సినిమాలు కాకుండా మిడ్ రేంజ్, యంగ్ హీరోలు నటించిన సినిమాలేవి ఇప్పటివరకు 250 కోట్ల వసూళ్లను రాబట్టలేదు. ఈ ఘనతను సాధించిన ఫస్ట్ మూవీగా హనుమాన్ నిలిచింది.
ప్రభాస్, అల్లు అర్జున్ రికార్డులు బ్రేక్...
గురువారం రోజు వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 5.33 కోట్ల కలెక్షన్స్ సాధించింది. రిలీజై పదిహేను రోజులు అవుతోన్న కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. తెలుగు సినిమాల్లో పదిహేనో రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా హనుమాన్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో 3.70 కోట్లతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన అల వైకుంఠపురములో మూవీ టాప్ ప్లేస్‌లో ఉండేది.
ఆ రికార్డ్‌ను హనుమాన్ బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ మూవీ కంటే కోటిన్నర ఎక్కువే హనుమాన్ వసూళ్లను రాబట్టింది. ఈ జాబితాలో 2.90 కోట్లతో బాహుబలి 2 టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆర్ఆర్ఆర్ కోటి డెబ్భై ఐదు లక్షలతో నాలుగో స్థానంలో ఉంది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోల రికార్డును హనుమాన్‌తో తేజా సజ్జా బ్రేక్ చేశాడు.
వంద కోట్ల లాభాలు...
గురువారం నాటికి హనుమాన్ సినిమాకు వంద కోట్ల లాభాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ గురువారం నాటికి 99.50 కోట్ల వరకు షేర్ వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు అరవై తొమ్మిది కోట్లకుపైగా లాభాలను మిగిల్చింది. ఇప్పటివరకు నైజాంలో అత్యధికంగా ఈ మూవీ 33 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా ఓవర్‌సీస్‌లో 25 కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్లు సమాచారం.
జీ5 ఓటీటీలో...
హనుమాన్ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. అంజనాద్రి అనే ఫిక్షనల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సూపర్ హీరో కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. హనుమంతుడి సహాయంతో సూపర్ పవర్స్ పొందిన హనుమంతు అంజనాద్రిని ఎలా కాపాడుడు? మైఖేల్ అనే వ్యక్తి కారణంగా హనుమంతు జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే ఈ మూవీ కథ.
హనుమాన్‌లో తేజా సజ్జా, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించింది. వినయ్ రాయ్ విలన్‌గా నటించాడు. హనుమాన్ మూవీ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకున్నది. మార్చిలో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.జాంబీరెడ్డి తర్వాత ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్‌లో రూపొందిన మూవీ ఇది.