తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu January 29th Episode: మాయమైపోయిన రిషి.. వసుధార ఉగ్రరూపం.. శైలేంద్రను ఎడాపెడా కొట్టిన వసు

Guppedantha Manasu January 29th Episode: మాయమైపోయిన రిషి.. వసుధార ఉగ్రరూపం.. శైలేంద్రను ఎడాపెడా కొట్టిన వసు

Sanjiv Kumar HT Telugu

29 January 2024, 8:11 IST

google News
  • Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ జనవరి 29వ తేది ఎపిసోడ్‌లో వసుధార ఉగ్రరూపం చూపించింది. శైలేంద్ర చెంపలను ఎడాపెడా వాయించేంసింది. మరోవైపు కాలేజీకి రాకుండా రిషి మాయమైపోయాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జనవరి 29వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ జనవరి 29వ తేది ఎపిసోడ్‌

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జనవరి 29వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Episode 985: గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి ఉన్న ఇంటికి రాజీవ్ వస్తాడు. కానీ, అక్కడి వచ్చేలోపే ఇంటికి తాళం వేసి ఉంటాడు. మావయ్య.. మావయ్య.. మళ్లీ నా మరదలు పిల్లే గెలిచేలా చేశావు కదా. ఎప్పుడు గెలిచినట్లు ఈసారి కూడా నా మరదలు పిల్లే గెలిచింది. కానీ, ఇంతకుముందు జరిగినట్లు ఇకనుంచి జరగదు. ఎందుకంటే ఇన్నిరోజులు ఈ రాజీవ్ గాడు లేడు. ఇప్పుడు ఈ రాజీవ్ గాడు రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ రిషిగాడిని చంపేసి నిన్ను నా దాన్ని చేసుకుంటా మరదలు పిల్లా అని రాజీవ్ అనుకుంటాడు.

మేడమ్ కొడుకువని

నీ మీద కసిలాంటి ప్రేమను నీకు చూపిస్తాను అని రాజీవ్ అనుకుంటుంటే ఇంతలో శైలేంద్ర కాల్ చేస్తాడు. రేయ్ వాళ్లు దొరికారా అని శైలేంద్ర అడిగితే.. లేదు. కొద్దిలో మిస్ అయ్యారు అని రాజీవ్ అంటాడు. ఏంట్రా. నువ్ కాలు మీద కాలు వేసుకుని కూర్చో భయ్యా. వాడిని వేసేస్తాను అని చెప్పావని రాజీవ్‌ మీద శైలేంద్ర అరుస్తాడు. చూడు భయ్యా.. మా మేడమ్ కొడువి కదా అని ఇన్నిసార్లు ఊరుకుంటున్నాను. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఇలా ఇంకోసారి చేస్తే ఈ రాజీవ్ రాక్షసత్వం మీకు కూడా చూపించాల్సి వస్తుందని రాజీవ్ అంటాడు.

దాంతో సైలెంట్‌గా ఉండిపోతాడు శైలేంద్ర. అయినా ఆ రిషి గాడు చావడం నీకన్నా నాకే ఎక్కువ. ఆ ఎండీ సీటు ఏంటీ భయ్యా. వాడు ఉన్నా లేకున్నా దక్కించుకోవచ్చు. కానీ, నేను మనసు పడ్డ నా మరదలు పిల్ల దక్కాలంటే రిషిగాడు చావాల్సిందే. వాళ్లు పక్కనే ఉండొచ్చు. నేను వెళ్లి వాన్ని చంపాకా చెబుతాను అని రాజీవ్ అంటాడు. మరోవైపు ఫెస్ట్ జరుగుతుంటుంది. అంతా వసుధారను మెచ్చుకుంటారు. అన్ని రకాలుగా ఫెస్ట్ బాగా నడుస్తోందని ఫణీంద్ర అంటాడు.

శైలేంద్రకు ఐడియా

మరోవైపు ఫెస్ట్ గ్రాండ్ సక్సెస్ అయ్యేలా ఉంది. ఏం చేయను అని ఆలోచించినా శైలేంద్ర ఐడియా.. ఆ రిషిగాడు ఎక్కడిదాక వచ్చాడో తెలిసుకుని దారిలోనే భద్రతో లేపించేద్దాం అని అనుకుంటాడు. ఫణీంద్ర వాళ్ల దగ్గరికి వెళ్తాడు శైలేంద్ర. ఎక్కడికి వెళ్లావురా అని ఫణీంద్ర అంటే.. రిషి వస్తున్నాడుగా.. ఎంట్రన్స్ దగ్గర ఉండి రిసీవ్ చేసుకుందామని అక్కడే ఉన్నా అని శైలేంద్ర అంటాడు. వసుధార రిషి ఎక్కడిదాకా వచ్చాడో ఓసారి కనుక్కో అని శైలేంద్ర అంటాడు.

అవునమ్మా మినిస్టర్ గారు కూడా ఎదురుచూస్తున్నారు. ఓసారి కనుక్కో అని ఫణీంద్ర అంటాడు. దాంతో వసుధార చక్రపాణికి కాల్ చేస్తుంది. నాన్న ఎక్కడిదాకా వచ్చారంటుంది. ఈ ఫోన్ మీ తండ్రిగారిదా. నేను హాస్పిటల్ సిబ్బందిని మాట్లాడుతున్నాను. మీ నాన్నా గారిని గాయాలతో ఉంటే ఎవరో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు అని అటునుంచి నర్స్ మాట్లాడుతుంది. మరి ఆయనతో రిషి సార్ ఉంటారు కదా. అతను అని వసుధార అడుగుతుంది. ఆయనతో ఇంకెవరు లేరని నర్స్ చెబుతుంది. దీంతో స్పృహ తప్పి పడిపోతుంది వసుధార.

నన్ను క్షమించమ్మా

దాంతో అందరూ షాక్ అవుతారు. శైలేంద్ర మాత్రం నవ్వుకుంటాడు. శైలేంద్ర పట్టు హాస్పిటల్‌కు తీసుకెళ్దాం అని ఫణీంద్ర అంటాడు. కట్ చేస్తే బెడ్‌పై వసుధార పడుకుని ఉంటే తలకు కట్టు కట్టుకుని చక్రపాణి ఉంటాడు. అనుపమ, శైలేంద్ర పక్కనే ఉంటారు. ఇంతలో సార్ అంటూ ఉలిక్కిపడి లేస్తుంది వసుధార. ఎలా ఉన్నావని అంతా అడిగితే.. నేను బాగానే ఉన్నాను. నాన్న రిషి సార్ ఎక్కడ అని వసుధార అంటుంది. నన్ను క్షమించమ్మా అల్లుడు గారు ఏమైపోయారో నాకు తెలియదు అని చక్రపాణి అంటాడు.

అసలు ఏం జరిగింది. నేను ఫోన్ చేస్తున్నప్పుడు రిషి సార్‌ను తీసుకొస్తున్నాని చెప్పారు కదా అని వసుధార అడుగుతుంది. అవునమ్మా.. కానీ నీ కాల్ మాట్లాడిన తర్వాత నన్ను వెనుక నుంచి తలపై ఎవరో కొట్టారు. లేచి చూస్తే హాస్పిటల్‌లో ఉన్నాను. అల్లుడి గారి గురించి అంతా అడిగాను. ఎవరు తెలియదు అన్నారు. నా తలకు దెబ్బ తగిలిందమ్మా అంటూ చక్రపాణి కుమిలిపోతాడు. ఏంటీ కష్టాలు. ఒకదాని తర్వాత ఒకటి. రిషి ఏ పరిస్థితుల్లో ఉన్నాడా. వాడికి ఇంకా సంతోషం ఉండదా అని మహేంద్ర బాధపడుతుంటాడు.

రిషి కోసం వసుధార

శైలేంద్ర కూడా కాలేజీలోనే ఉన్నాడు. రిషిని తీసుకెల్లే అవసరం ఇంకెవరికి ఉంటుంది. మినిస్టర్ గారు కూడా డిసప్పాయింట్ అయి వెళ్లారు అని అనుపమ అంటుంది. వాళ్ల సంగతి పక్కన పెట్టు అనుపమ అసలు రిషి ఎక్కడున్నట్లు అని మహేంద్ర అంటాడు. సార్ ఎక్కుడున్నారో నాకు తెలుసు. నేను తీసుకొస్తానంటూ బెడ్‌పై నుంచి లేస్తుంది వసుధార. మహేంద్ర, అనుపమ ఎంత ఆపినా ఆగదు. వసుధార వెళ్తుంది. మీ తలకు దెబ్బ తగిలింది. రెస్ట్ తీసుకోండని చక్రపాణితో మహేంద్ర అంటాడు.

మరోవైపు శభాష్ భద్ర. నిన్ను తక్కువ అంచనా వేశాను. ఈరోజు చూపించావ్ అని శైలేంద్ర పొగుడుతాడు. నేను ఏం చేశానని ఇంతలా పొగుడుతున్నారు అని భద్ర అంటాడు. చేసింది కూడా చెప్పుకుంటలేవు. నీలాంటి వాళ్లు కోటికి ఒకరు ఉంటారు అని శైలేంద్ర అంటాడు. దేని గురించి మాట్లాడుతున్నారు అని భద్ర అంటాడు. రిషిని మాయం చేసి కాలేజీకి రాకుండా చేసింది నువ్వే కదా. వాన్ని ఎక్కడ దాచిపెట్టావ్ అని శైలేంద్ర అడుగుతాడు. నాకు వాళ్లు కనపడలేదు సార్. ఇప్పుడు మీరు చెబితేనే రిషి కాలేజీకి రాలేదని తెలిసింది అని భద్ర అంటాడు. సరే అని కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర.

శైలేంద్ర కాలర్ పట్టుకున్న వసు

ఇదేంటీ వీడికి కూడా తెలియదా. రాజీవ్ కూడా తనకు చూల్లేదు అన్నాడు. మరి రిషి ఎలా మాయం అయ్యాడు. ఎవరు తీసుకెళ్లారు అని శైలేంద్ర ఆలోచిస్తుంటే వసుధార కోపంగా వస్తుంది. రేయ్ శైలేంద్ర.. రారా బయటకు.. రారా అంటూ అరుస్తుంది వసుధార. శైలేంద్ర రాగానే.. కాలర్ పట్టుకుంటుంది వసుధార. దాంతో అంతా షాక్ అవుతారు. రిషి సార్ ఎక్కడ అంటూ అలాగే పట్టుకుని నిలదీస్తుంది వసుధార. వదలమని శైలేంద్ర, అనుపమ, మహేంద్ర చెబుతారు. అయినా వసుధార వినదు.

దాంతో చేతులు పక్కకు తీసేస్తాడు శైలేంద్ర. అప్పుడు రిషి సార్ ఎక్కడా అంటూ శైలేంద్ర చెంపలు ఎడా పెడా వాయించేస్తుంది. వసుధార కోపం కట్టలు తెంచుకుని అలా కొడుతూనే ఉంటుంది. ఇంతలో దేవయాని వచ్చి ఆపుతుంది. ఏయ్ ఏమైంది. వాడిని పశువులా కొడుతున్నావ్ అని దేవయాని అంటుంది. వాడు పశువే కదా. మనిషి అని ఎవడన్నాడని వసుధార అంటుంది. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. చెంప వాయిస్తాను అని దేవయాని అంటే.. రా.. రా.. కొడుతువు గానీ అని మీదకు వెళ్తుంది వసుధార.

నా భర్త కోసం

అమ్మా వసుధార.. ఏంటిది. దేనికోసం ఇదంతా చేస్తున్నావ్ అని కంగారుగా అడుగుతాడు ఫణీంద్ర. రిషి సార్ కోసం. నా భర్త కోసం అని వసుధార అంటుంది. దానికి వీడు ఏం చేస్తాడు. వీన్ని అంటే ఏమొస్తుంది అని ఫణీంద్ర అంటాడు. వీడే సార్.. వీడే. రిషి సార్‌ను వీడే ఏదో చేశాడు అని వసుధార అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం