Guppedantha Manasu September 7th Episode: ఏంజెల్‌తో రిషి పెళ్లి ఫిక్స్ - వసుధార ప్రేమకథలో ఇన్ని ట్విస్టులా!
07 September 2023, 9:27 IST
Guppedantha Manasu September 7th Episode: ఏంజెల్‌ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని విశ్వనాథంతో చెప్పాలని రిషి అనుకుంటాడు. కానీ రిషి మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన విశ్వనాథం అతడు పెళ్లికి ఒప్పుకున్నాడని భ్రమపడతాడు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు సీరియల్
Guppedantha Manasu September 7th Episode: రిషిని కలిసి విశ్వనాథం..ఏంజెల్ మనసులో ఉన్న అబ్బాయి ఎవరో తనకు తెలిసిపోయిందని అంటాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు నువ్వే అని చెప్పడంతో రిషి షాక్ అవుతాడు. ఏంజెల్ ఇష్టపడుతుంది, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నది నిన్నే అని రిషితో చెబుతాడు విశ్వనాథం. నేను నీలాంటి అబ్బాయిని ఏంజెల్‌కు భర్తగా తీసుకురాలేనని అంటాడు. రిషి ఏదో సమాధానం చెప్పేలోగా విశ్వనాథం అతడిని వారిస్తాడు. మంచి స్నేహితుడు భర్త అయితే ఆడపిల్ల జీవితం బాగుంటుందని రిషిని కన్వీన్స్ చేస్తాడు విశ్వనాథం. ఏంజెల్‌ను పెళ్లిచేసుకోమని రిషిని బతిమిలాడుతాడు.
పెళ్లి బంధం సెట్ కాదు...
కానీ ఏంజెల్ అడిగితే ఎందుకు వద్దని అంటున్నావో కారణం చెప్పమని రిషిని అడుగుతాడు విశ్వనాథం. తనకు పెళ్లి బంధం సెట్ కాదని అతడికి బదులిస్తాడు రిషి. ఏంజెల్ నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆమెను నేను ఎప్పుడూ అలాంటి దృష్టితో చూడలేదని, ఇకపై చూడను కూడా సీరియస్‌గా విశ్వనాథానికి ఆన్సర్ ఇస్తాడు రిషి.
రిషి మాటలతో విశ్వనాథం బాధపడతాడు. అలా అనోద్దు, నీ మాటలు నా మనసును కష్టపెట్టాయని అంటాడు. ఏంజెల్‌కు మంచి అబ్బాయిని చూసి పెళ్లిచేద్దామని రిషి చెప్పినా....నీతో ఏంజెల్ పెళ్లి జరిపించడమే నా బాధ్యత అని విశ్వనాథం పట్టుపడతాడు.
గతంపై అనుమానం..
రిషి గతంపై విశ్వనాథానికి డౌట్ వస్తుంది. గతంలో నీకు ప్రేమ ఉందా? నీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉందా? నీ తల్లిదండ్రులు ఎవరు అని రిషిని అడుగుతాడు. గతం గురించి అడగొద్దు అని విశ్వనాథంతో అంటాడు. ఆలోచించి నా మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకోమని రిషితో చెబుతాడు విశ్వనాథం.
క్లాస్ రూమ్‌లో రిషి...
కాలేజీలో రిషి కనిపించకపోవడంతో అతడి గురించి వెతుకుతుంటుంది వసుధార. క్లాస్ రూమ్‌లో కూర్చొని సీరియస్‌గా ఆలోచిస్తుంటాడు రిషి. అతడి దగ్గరకు వచ్చిన వసుధార మీతో మాట్లాడాలని అంటుంది. నేను కూడా మీతో చాలా మాట్లాడాలి. కానీ మాట్లాడుతున్నానా లేదా కదా అంటూ ఆమెపై సీరియస్ అవుతాడు రిషి. ఇప్పుడు మాట్లాడేది ఏం లేదని వెళ్లిపొమ్మని అంటాడు.
విశ్వనాథం తమ ఇంటికి వచ్చాడని రిషితో చెబుతుంది వసుధార. ఆ విషయం తెలుసునని, ఏంజెల్‌ను పెళ్లి చేసుకోమని తనను విశ్వనాథం ప్రాధేయపడుతున్నాడని, పెళ్లి ఇష్టం లేదు, నేను ఏంజెల్‌కు తగనని చెప్పిన వినడం లేదని, ఏంటి తనకు చిత్రవధ అని అంటాడు. నా తరఫున ఈ విషయాల్ని ఏంజెల్‌కు అర్థమయ్యేలా చెప్పమని వసుధారను బతిమిలాడుతాడు రిషి.
ఏ హక్కుతో చెప్పాలని రిషిని నిలదీస్తుంది వసుధార. మీరే చెప్పలేకపోయారా? ఎందుకు చెప్పలేదు. మౌనంగా ఉండటమే వాళ్ల ఆశకు ఆస్కారం అవుతుందని రిషికి క్లాస్ ఇస్తుంది.
వసుధారపై చెయ్యేత్తిన రిషి...
ఈ పెళ్లి ఇష్టం లేదని విశ్వనాథంతో చెప్పమని రిషికి సలహా ఇస్తుంది. వసుధార మాటలకు రిషి కన్వీన్స్ అవుతాడు. పెళ్లి ఇష్టం లేదని చెప్పాలని ఫిక్స్ అవుతాడు. రిషికి బెస్టాఫ్ లక్ చెబుతుంది వసుధార.
నేను మన ప్రేమ గురించి వాళ్లకు నిజం చెబుతానని అనుకుంటున్నారా? నా ప్రమేయం లేకుండా ఏంజెల్‌ను పెళ్లి చేసుకొని బాధపడమంటున్నారా? చెప్పండి ఎందుకు బెస్టాఫ్ లక్ చెప్పారని వసుధారను కోపంగా అడుగుతాడు రిషి. మీరు ఒంటరితనంతో బాధపడకూడదని , మీకు ఓ తోడు కావాలి. మీ పక్కన భార్య స్థానంలో నేను ఉండాలి అని అతడి మాటలకు వసుధార బదులిస్తుంది.వసుధార మాటలతో రిషి కోపం కట్టలుతెంచుకుంటుంది.
ప్రాణం కంటే ఎక్కువగా...
రిషి కోపాన్ని పట్టించుకోకుండా నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని రిషితో చెబుతుంది వసుధార. మీ పక్కన ఒక తోడు ఉండాలని, మిమ్మల్ని ఇలా ఒంటరిగా చూడలేకపోతున్నానని, చెబుతుంది. గతంలో ఉన్న మీ ప్రేమ గురించి చెప్పి ఏంజెల్‌తో పెళ్లి నుంచి తప్పించుకుంటారో...ఆ ఏంజెల్‌ను పెళ్లి చేసుకుంటారో మీ ఇష్టం అని చెబుతుంది.
ఆమె మాటలతో సీరియస్ అయిన రిషి వసుధారను కొట్టడానికి చెయ్యేత్తుతాడు. కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని వసుధారకు సారీ చెబుతాడు. మీ మాటలు గుండెల్లో సూదుల్లా గుచ్చుతున్నాయని, ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని వసుధారతో అంటాడు రిషి. అతడి మాటలతో కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార.
విశ్వనాథం టెన్షన్...
ఏంజెల్‌తో పెళ్లి విషయంలో రిషి ఏ నిర్ణయం తీసుకున్నాడోనని విశ్వనాథం అనుకుంటాడు. అంతలోనే అతడిని వెతుక్కుంటూ రిషి వస్తాడు. లగ్నపత్రిక రాయమంటూ పంతులును పిలిపించమంటావా అని రిషిని అడుగుతాడు విశ్వనాథం. నేను మీ మనసును నొప్పించాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మీరు నా ప్రాణం కాపాడారు. సొంత మనిషిలా ఆదరించి మీ ఇంట్లో పెట్టుకోవడంతో నేను మీ ఇంటి మనిషిని అయ్యాను.
మీ కోసం కాలేజీకి వెళ్లానని విశ్వనాథంతో అంటాడు రిషి. నేను చెప్పే మాట మీ మనసుకు కష్టంగా ఉంటుందని తెలుసు..అని ఏంజెల్‌ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేనే మీ మనిషిగా ఉండాలని అనుకుంటున్నాను అంతే కానీ మీ ఇంటి అల్లుడిగా కాదని అంటాడు. మీ మాటను కాదంటున్నదుకు క్షమించమని విశ్వనాథంతో అంటాడు రిషి. కానీ రిషి మాట్లాడుతుండగానే విశ్వనాథం నిద్రలోని జారుకుంటాడు. తన మాటల్ని విశ్వనాథం విన్నాడో లేదో కూడా రిషికి అర్థం కాదు.
ఏంజెల్‌తో పెళ్లి....
ఆ తర్వాత ఉదయాన్నే విశ్వనాథాన్ని కలిసి తన నిర్ణయాన్ని చెప్పాలని అనుకుంటాడు రిషి. నా ప్రాణాలను కాపాడటమే కాకుండా మీ ఇంట్లో చోటు ఇచ్చినందుకు, లెక్చరర్‌గా జాయిన్ చేసి నాకో దారి చూపించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని విశ్వనాథంతో అంటాడు రిషి. అందుకే నేను మిమ్మల్ని బాధపెట్టదలచుకోలేదు అని చెప్పిన రిషి ఆ తర్వాత ఏంజెల్‌ను తాను పెళ్లిచేసుకోననే నిజం చెప్పబోతాడు. కానీ రిషి పెళ్లికి అంగీకరించాడని భ్రమపడినా విశ్వనాథం సంతోష పడతాడు. రిషికి థాంక్స్ చెబుతాడు. ఇప్పడు నా మనసు కుదుటపడిందని అంటాడు.
రిషి టెన్షన్...
అక్కడే ఉన్న ఏంజెల్‌తో నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. అందుకే నిన్ను పెళ్లి చేసుకోమని రిషిని అడిగాను. ఇప్పుడే నీ కళ్ల ముందే అతడు ఒప్పుకున్నాడని మనవరాలితో అంటాడు విశ్వనాథం. తాతయ్య మాటలతో ఏంజెల్ కూడా ఆనందంలో మునిగిపోతుంది.
నువ్వు అనుకుంటున్నట్లుగానే నీ మనవరాలి పెళ్లి అవుతుంది. అది నువ్వు కోరుకున్న వాడితోనే అంటూ విశ్వనాథంతో తన ఆనందాన్ని పంచుకుంటుంది ఏంజెల్.తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని రిషి చెప్పాలనుకునేలోగా ఆనందంలో విశ్వనాథానికి హార్ట్ పెయిన్ వస్తుంది.
దాంతో ఏంజెల్, రిషి కంగారు పడతారు. ఏంజెల్‌ను తాను పెళ్లి చేసుకోనని నిజం చెప్పబోతాడు రిషి. కానీ విశ్వనాథం ఉన్న ఆ పరిస్థితుల్లో నిజం అప్పుడే చెప్పడం కరెక్ట్ కాదని ఆగిపోతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.