తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu November 3rd Episode: వ‌సుధార‌ పంచ్‌ల వ‌ర్షం - దేవయాని విలవిల - శైలేంద్ర‌కు శిక్ష‌

Guppedantha Manasu November 3rd Episode: వ‌సుధార‌ పంచ్‌ల వ‌ర్షం - దేవయాని విలవిల - శైలేంద్ర‌కు శిక్ష‌

03 November 2023, 7:35 IST

google News
  • Guppedantha Manasu November 3rd Episode: జ‌గ‌తి మ‌ర్డ‌ర్ కేసు ఇన్వేస్టిగేష‌న్ కు సంబంధించి స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా అపాయింట్ అయిన ముకుల్‌కు త‌మ‌పై అనుమానం రాకుండా శైలేంద్ర‌, దేవ‌యాని తెగ క‌వ‌ర్ చేసుకుంటారు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే…

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu November 3rd Episode: జ‌గ‌తి మ‌ర్డ‌ర్ కేసును ఇన్వేస్టిగేష‌న్ చేయ‌డానికి స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా ముకుల్ అపాయింట్ అవుతాడు. అత‌డిని ఫ‌ణీంద్ర‌తో పాటు శైలేంద్ర‌, దేవ‌యానిల‌కు ప‌రిచ‌యం చేస్తాడు రిషి. అత‌డిని చూడ‌గానే శైలేంద్ర‌, దేవ‌యాని కంగారు ప‌డ‌తారు.

మ‌ర్డ‌ర్ జ‌రిగిన రోజు జ‌గ‌తి ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం త‌న‌కు త‌ప్ప ఎవ‌రికి తెలియ‌ద‌ని ముకుల్‌తో అంటాడు రిషి. అలాంట‌ప్పుడు బ‌య‌టివాళ్ల‌కు ఆ విష‌యం ఎలా తెలిసిందా అని రిషి అనుమానం వ్య‌క్తం చేస్తాడు.

మ‌న చుట్టూ ఉన్న‌వాళ్ల‌ను...అవ‌స‌ర‌మైతే మ‌న అనుకున్న‌వాళ్ల‌ను ఇన్వేస్టిగేట్ చేసుకుంటూ వెళితే బాగుంటుంద‌ని ముకుల్‌కు స‌ల‌హా ఇస్తుంది వ‌సుధార‌. ఆమె మాట‌లు విని శైలేంద్ర‌, దేవ‌యాని మ‌రింత కంగారు ప‌డ‌తారు. వ‌సుధార ఆలోచ‌న‌తో ముకుల్ ఏకీభ‌విస్తాడు.

దేవ‌యాని ఫైర్‌...

ఏదైనా ఇన్సిడెంట్ జ‌రిగిన‌ప్పుడు ముందు ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ను ఎంక్వైరీ చేసి...ఆ త‌ర్వాత స్నేహితుల్ని, చుట్టుప‌క్క‌ల‌వాళ్ల‌ను ఎంక్వైరీ చేస్తామ‌ని ముకుల్ అంటాడు. మా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ను ఇంట‌రాగేట్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, మేము చాలా అన్యోన్యంగా ఉంటామ‌ని దేవ‌యాని చెబుతుంది. ఇప్పుడు చాలా కేసుల్లో ఇంట్లో వాళ్లే నేర‌స్తులుగా బ‌య‌ట‌ప‌డుతున్నార‌ని దేవ‌యానికి బ‌దులిస్తుంది వ‌సుధార‌.

అంటే జ‌గ‌తి మ‌ర‌ణానికి మ‌న ఇంట్లో వాళ్లు కార‌ణం అని అంటున్నావా అని వ‌సుధార‌పై ఫైర్ అవుతుంది దేవ‌యాని. నేను అలా అన‌డం లేదు...ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌కుండా ఎంక్వైరీ చేస్తే మంచిద‌ని చెప్పాన‌ని వ‌సుధార చెబుతుంది. మ‌నం త‌ప్పు చేయ‌క‌పోవ‌చ్చు...కానీ మ‌న‌ల్ని ఆధారంగా చేసుకొని వెనుక గోతులు తీసేవాళ్లు ఉంటారు. అది నైనేనా కావ‌చ్చు..మీరైనా కావ‌చ్చు...శైలేంద్ర అయినా కావ‌చ్చున‌ని వ‌సుధార బాంబ్ పేలుస్తుంది. ఇన్‌డైరెక్ట్‌గా శైలేంద్ర‌నే కిల్ల‌ర్ అని చెబుతుంది.

ఎంఎస్ఆర్ టార్గెట్‌...

మీకు ఎవ‌రిమీదైనా అనుమానం ఉందా అని ఫ‌ణీంద్ర‌ను అడుగుతాడు ముకుల్‌. త‌మ‌కు ఎవ‌రూ శ‌త్రువులు లేర‌ని ఫ‌ణీంద్ర బ‌దులిస్తాడు. ఎంఎస్ఆర్ ఉన్నాడు క‌దా అని వ‌సుధార అంటుంది. ఎంఎస్ఆర్ మోసం చేసేవాడే కానీ హ‌త్య‌లు చేసే వాడ‌ని నేను అనుకోవ‌డం లేద‌ని రిషి అంటాడు. వ‌సుధార కావాల‌నే త‌న‌ను టార్గెట్ చేసిందిన శైలేంద్ర క‌నిపెడ‌తాడు. ఎంఎస్ఆర్ ద్వారా త‌న పేరును బ‌య‌ట‌పెట్టాల‌ని అనుకుంటుంద‌ని కంగారు ప‌డ‌తాడు.

వ‌సుధార అబ‌ద్ధం...

జ‌గ‌తి చ‌నిపోయిన ప్లేస్‌లో మీరు ఉన్నారు క‌దా అని వ‌సుధార‌ను అడుగుతాడు ముకుల్‌. జ‌గ‌తిని టార్గెట్ చేసిన విష‌యం మీకు ఎలా తెలిసింద‌ని ప్ర‌శ్నిస్తాడు. ధ‌ర‌ణి ద్వారా ఆ విష‌యం త‌న‌కు తెలిసిన సంగ‌తి వ‌సుధార బ‌య‌ట‌పెట్ట‌దు. గ‌తంలో రిషిపై చాలా సార్లు ఎటాక్స్ జ‌రిగాయ‌ని, ఆరోజు కూడా జ‌రుగుతుంద‌నే అనుమానంతోనే అక్క‌డ‌కు వెళ్లాన‌ని, కానీ జ‌గ‌తి మేడ‌మ్‌కు చ‌నిపోతార‌ని తాను ఊహించ‌లేద‌ని ముకుల్‌తో అంటుంది వ‌సుధార‌.

ధ‌ర‌ణి బాంబ్‌...

రిషిపై ఎటాక్స్ ఎప్ప‌టినుంచి మొద‌ల‌య్యాయ‌ని ముకుల్ అడుగుతాడు. మా ఆయ‌న ఫారిన్ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అని ధ‌ర‌ణి స‌మాధాన‌మిస్తుంది. ఆమె ఆన్స‌ర్‌తో శైలేంద్ర కంగు తింటాడు. ధ‌ర‌ణి ఆన్స‌ర్‌ను క‌వ‌ర్ చేయ‌డానికి దేవ‌యాని, శైలేంద్ర నానా తంటాలు ప‌డ‌తారు. ధ‌ర‌ణి వ‌ట్టి అమాయ‌కురాలు అంటూ శైలేంద్ర అంటాడు.

అమాయ‌కురాలు కాబ‌ట్టే ధ‌ర‌ణి నిజం చెప్పింద‌ని శైలేంద్ర‌కు పంచ్ ఇస్తుంది వ‌సుధార‌. నేను వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాన‌ని ధ‌ర‌ణి ద‌గ్గ‌ర తాను చాలా సార్లు బాధ‌ప‌డేవాడిన‌ని, ఆ విష‌య‌మే ధ‌ర‌ణి మీకు చెప్పింద‌ని తెలివిగా క‌వ‌ర్ చేస్తాడు శైలేంద్ర‌. ఇలా ఎన్ని రోజులు క‌వ‌ర్ చేస్తారో తాను చూస్తాన‌ని వ‌సుధార లోలోన అనుకుంటుంది.

శైలేంద్ర కంగారు...

జ‌గ‌తిని చంపింది ఎవ‌రో త్వ‌ర‌లోనే తాను తెలుసుకుంటాన‌ని ముకుల్ అంటాడు. మా ఇంట్లో వారి మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌ని శైలేంద్ర అంటాడు. అలా అనుకుంటే భూష‌ణ్ ఫ్యామిలీని అవ‌మానించిన‌ట్లే అని శైలేంద్ర త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు.

అలా అనుకోవ‌డం త‌ప్పు అని శైలేంద్ర‌కు ఝ‌ల‌క్ ఇస్తాడు రిషి. ముకుల్ విచార‌ణ‌కు అంద‌రం స‌పోర్ట్ చేయాల‌ని చెబుతాడు. నిజం తెలుసుకునే ప్ర‌య‌త్నం ముకుల్ చేస్తున్నాడ‌ని, అత‌డు అడిగిన వాటికి స‌మాధానం చెప్పాల‌ని కొడుకుకు షాక్ ఇస్తాడు ఫ‌ణీంద్ర‌. నువ్వెందుకు భుజాలు త‌డుముకుంటున్నావ‌ని డౌట్ వ్య‌క్తం చేస్తాడు. జ‌గ‌తి ప్రాణం తీసిన వాడిని ఎలాగైనా ప‌ట్టుకొని తీరాల‌ని ముకుల్‌తో అంటాడు ఫ‌ణీంద్ర‌. మీ ప్ర‌య‌త్నం మీరు గ‌ట్టిగా చేయండి...శ‌త్రువు ఎవ‌రైనా స‌రే అత‌డిని ప‌ట్టుకొని తీరండి అని చెబుతుంది.

వ‌సుధార పంచ్‌...

జ‌గ‌తి మేడ‌మ్ శిష్యుడిగా ఈ కేసును తాను చాలా ప‌ర్స‌న‌ల్‌గా తీసుకుంటున్న‌ట్లు ముకుల్ చెబుతాడు. జ‌గ‌తి మేడ‌మ్ కాల్‌లిస్ట్ మొత్తం తీసుకున్నామ‌ని, ఆమెతో ఎవ‌రు ఎక్కువ‌గా మాట్లాడో తెలుసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నామ‌ని చెబుతాడు. జ‌గ‌తి మ‌ర్డ‌ర్ జ‌రిగిన ప్ర‌దేశం నుంచి మ‌రిన్ని ఆధారాలు సేక‌రిస్తున్నామ‌ని అంటాడు.

త‌న ఇన్వేస్టిగేష‌న్‌కు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని ఫ‌ణీంద్ర‌తో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో అంటాడు ముకుల్‌. ముకుల్ ఎప్పుడొచ్చినా ఏ ఇన్ఫ‌ర్మేష‌న్ అడిగినా ఇవ్వాల‌ని పెద‌నాన్న‌ను కోరుతాడు రిషి. త‌ప్ప‌కుండా ఇస్తామ‌ని అని రిషికి మాటిస్తాడు ఫ‌ణీంద్ర‌. . మీరు కూడా ఇన్వేస్టిగేష‌న్‌కు స‌హ‌క‌రించాల‌ని శైలేంద్ర‌తో అంటుంది వ‌సుధార‌. అత‌డు త‌డ‌బ‌డుతూ స‌రేన‌ని అంటాడు.

నువ్వు కూడా స‌హ‌క‌రిస్తాన‌ని చెప్ప‌మ‌ని దేవ‌యానిపై సెటైర్ వేస్తాడు ఫ‌ణీంద్ర‌. బెల్లంకొట్టిన రాయిలా అలా ఉంటావేంటి అని అంటాడు. భ‌ర్త మాట‌ల‌తో తాను కూడా ఏ స‌మాచారం అడిగినా ఇస్తాన‌ని దేవ‌యాని అంటుంది.

ప్రేమ జ్ఞాప‌కాలు…

ముకుల్ గురించి ముందే చెప్ప‌నందుకు బాధ‌ప‌డుతున్నావా అని వ‌సుధార‌ను అడుగుతాడు రిషి. మీరు ఏది చేసినా స‌రైందే చేస్తార‌ని, నాకు ఏది చెప్పి చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని భ‌ర్త‌కు స‌పోర్ట్ చేస్తుంది వ‌సుధార‌. వ‌సుధార మ‌ల్లెపూల మాల అల్లుతుంటుంది. ఆ మ‌ల్లెపూలు చూసి రిషి గ‌తంలోకి వెళ‌తాడు. ఇద్ద‌రు ప్రేమ జ్ఞాప‌కాల్ని నెమ‌రువేసుకుంటారు.

ఆ త‌ర్వాత మ‌ల్లెపూలు క‌ట్ట‌డంలో వ‌సుధార‌కు సాయం చేస్తాడు రిషి. ఈ మ‌ల్లెపూల‌తో మ‌న‌కు చాలా జ్ఞాప‌కాలు ఉన్నాయ‌ని రిషి అంటాడు. మ‌న జ్ఞాప‌కాలు కాలంతో పాటు క‌రిగిపోకూడ‌ద‌ని క‌వితాత్వ‌కంగా చెబుతాడు. ఆ జ్ఞాప‌కాలు చెర‌పాల‌ని అనుకుంటే చెరిగిపోవు..చిర‌కాలం మ‌న‌ మ‌దిలోనే ఉంటాయ‌ని వ‌సుధార స‌మాధాన‌మిస్తుంది.

మ‌ల్లెపూల మాల‌ను వ‌సుధార జ‌డ‌లో తానే అలంక‌రిస్తాడు రిషి. అది చూసి వ‌సుధార సిగ్గుప‌డుతుంది. ఈ మ‌ల్లెపూల మాల‌లో అందంగా ఉన్నావ‌ని వ‌సుధార‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తాడు రిషి. ఈ మ‌ల్లెపూల లాగే మ‌న బంధం ఎప్పుడూ స్వ‌చ్ఛంగా ఉండాల‌ని అంటాడు.

త‌న‌కు తానే శిక్ష‌...

త‌న ప్లాన్స్ మొత్తం బెడిసికొట్ట‌డంతో శైలేంద్ర కోపం ప‌ట్ట‌లేక‌పోతాడు. త‌న‌కు తానే శిక్ష వేసుకోవాల‌ని అనుకుంటాడు. బెల్ట్‌తో కొట్టుకుంటాడు. కొడుకు చేస్తోన్న ప‌నిచూసి దేవ‌యాని కంగారు ప‌డుతుంది. అత‌డిని అడ్డుకుంటుంది. కాఫీ క‌ప్‌తో ధ‌ర‌ణి వ‌స్తుంది. ఇక్క‌డ ఏం జ‌రుగుతుంది, నువ్వు ఏం చేస్తున్నావ‌ని ధ‌ర‌ణిపై సీరియ‌స్ అవుతుంది దేవ‌యాని.

మా ఆయ‌న టెన్ష‌న్‌లో ఏం చేయాలో తెలియ‌క బెల్ట్‌తో కొట్టుకుంటున్నాడ‌ని, ఆ టెన్ష‌న్ త‌గ్గించ‌డానికే కాఫీ తీసుకొచ్చాన‌ని అంటుంది. నువ్వు న‌న్ను చిరాకు పెడుతున్నావ‌ని ధ‌ర‌ణిపై సీరియ‌స్ అవుతాడు శైలేంద్ర‌. శైలేంద్ర కోపాన్ని ప‌ట్టించుకోకుండా ధ‌ర‌ణి త‌న సెటైర్స్ కంటిన్యూ చేస్తుంది. మీకు ఎలాంటి రోజు వ‌స్తుంద‌ని ముందే ఊహించాన‌ని అంటుంది. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం