Guppedantha Manasu January 26th Episode: వసుధార తగ్గేదేలే- శైలేంద్ర ఛాప్టర్ క్లోజ్ - దేవయానికి షాకిచ్చిన మహేంద్ర
26 January 2024, 10:19 IST
Guppedantha Manasu January 26th Episode: శైలేంద్ర ఆడుతోన్న డ్రామాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు రిషిని కాలేజీకి తీసుకురావాలని వసుధార ఫిక్సవుతుంది. రిషి ముందే నీ నిజ స్వరూపం మొత్తం బయటపెడతానని శైలేంద్రతో ఛాలెంజ్ చేస్తుంది వసుధార. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
గుప్పెడంత మనసు సీరియల్
Guppedantha Manasu January 26th Episode: కాలేజీలో వసుధార నిర్వహిస్తోన్న యూత్‌ఫెస్టివల్‌కు రిషి వస్తున్నాడని ప్రచారం చేసి ఆమెను ఇబ్బంది పెట్టాలని అనుకుంటాడు శైలేంద్ర. కానీ రిషి నిజంగానే ఈ యూత్‌ఫెస్టివల్‌కు వస్తున్నాడని చెప్పి అతడికి షాకిస్తుంది వసుధార. నీ నిజస్వరూపం రిషి ముందు బయటపెట్టబోతున్నానని శైలేంద్రతో అంటుంది. నిన్ను చూసి భయపడే రోజులు పోయానని , నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఇక తప్పించుకోలేవని, నీ ఛాప్టర్ క్లోజ్ అని శైలేంద్రకువార్నింగ్ ఇస్తుంది.
వసుధార మాటలతో శైలేంద్ర టెన్షన్ పడతాడు. తన ప్లాన్ మొత్తం రివర్స్ కావడంతో ఏం చేయాలో తెలియక రాజీవ్‌కకు ఫోన్ చేస్తాడు. వెంటనే చక్రపాణి ఆచూకీ తెలుసుకొని అతడి దగ్గర ఉన్న రిషిని చంపేయమని రాజీవ్‌తో చెబుతాడు శైలేంద్ర. అప్పుడే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. నీకు వసుధార దక్కుతుందని అంటాడు.
రాజీవ్ ప్లాన్...
రిషి గురించి వసుధార పడుతోన్న బాధ చూడలేక తల్లడిల్లిపోతాడు చక్రపాణి. తొందరగా రిషి కోలుకోవాలని దేవుడిని వేడుకుంటాడు. రిషి, వసుధార కలిసి సంతోషంగా ఉంటే అంతే చాలని అనుకుంటాడు. చక్రపాణి మిత్రుడు స్వామినాథ్‌ను గన్‌తో బెదిరిస్తాడు రాజీవ్. అతడి చేత చక్రపాణికి ఫోన్ చేయించి రిషి అడ్రెస్ కనుక్కోవాలని అనుకుంటాడు. స్వామినాథ్ ఎంత అడిగినా చక్రపాణి మాత్రం తాను ఎక్కడున్నది చెప్పడు.
తాను ఓ అర్జెంట్ పనిలో ఉన్నానని, అడ్రెస్ చెప్పడం కుదరదని ఫోన్ కట్ చేస్తాడు. రిషి గురించి ఆలోచించి అడ్రెస్ చెప్పడానికి నిరాకరిస్తాడు. చక్రపాణి అడ్రెస్ గురించి వెతుకుతున్నట్లుగా అతడితో చెబితే చంపేస్తానని స్వామినాథ్‌ను బెదిరిస్తాడు రాజీవ్. రిషి అడ్రెస్ తెలుసుకోవాలనే తన ప్లాన్ బెడిసికొట్టడంతో రాజీవ్ సహించలేకపోతాడు. రిషిని ఇంకా ఎన్నాళ్లు కాపాడుతావో నేను చూస్తానని చక్రపాణిపై కోపంతో రగిలిపోతాడు. తొందరలోనే నిన్ను కలిసే భాగ్యం నాకు కలుగుతుంది. అప్పుడు రాజీవ్ ప్రతాపం ఏమిటో చూపిస్తానని అంటాడు.
చక్రపాణి షాక్...
తండ్రికి ఫోన్ చేస్తుంది వసుధార. కాలేజీలో యూత్ ఫెస్టివల్ జరుగుతుందని, ఈ ఫెస్ట్‌కు రిషిని తీసుకురమ్మని అంటుంది. వసుధార మాటలతో చక్రపాణి షాకవుతాడు. కూతురిని కన్వీన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ వసుధార అతడి మాటలు వినదు. రిషిని చూడాలని స్టూడెంట్స్, లెక్చరర్స్ పట్టుపడుతున్నారని, వారికి రిషిని చూపించడం తప్పితే తనకు మరో దారి లేదని వసుధార అంటుంది. శైలేంద్ర గురించి చక్రపాణి భయపడతాడు. నేను ఉండగా రిషిని ఎవరూ ఏం చేయలేరని వసుధార అంటుంది.
శైలేంద్రపై పంతంతో…
రిషి కాలేజీకి వస్తోన్న విషయం మహేంద్ర, అనుపమలతో చెబుతుంది వసుధార. ఆమె మాటలు విని ఇద్దరు షాకవుతారు. శైలేంద్ర మీద కోపం, పంతంతో వసుధార తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావని వసుధారతో అంటుంది అనుపమ. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిషి ఇక్కడికి రావడం కరెక్ట్ కాదని, అతడు వచ్చే పరిస్థితుల్లో లేడని వసుధారను కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది అనుపమ.
రిషిని తీసుకురావద్దని తండ్రితో చెప్పమని వసుధారతో అంటుంది. అనుపమ మాటలు కూడా వినదు వసుధార. ఈ ఫెస్ట్‌కు రిషి రావాల్సిందేనని అంటుంది. కాలేజీ కోసం, స్టూడెంట్స్ సంతోషం కోసం రిషిని కాలేజీకి తీసుకొస్తున్నానని చెబుతుంది. శైలేంద్ర చెంప చెల్లుమనిపించడానికైనా రిషిని కాలేజీకి తీసుకొస్తానని అంటుంది.
శైలేంద్రకే రిస్క్...
రిషిని బయటకు తీసుకొచ్చి అవసరంగా అతడిని రిస్క్‌లో పెట్టొద్దని వసుధారకు చెబుతుంది అనుపమ. రిస్క్ రిషికి కాదు...శైలేంద్రకు అని వసుధార బదులిస్తుంది. రిషికి ప్రమాదం తలపెడతానని బెదిరిస్తూ శైలేంద్ర ఆడుతున్న నాటకాలకు ఈ రోజుతో తెరపడటం ఖాయమని అంటుంది. ఇన్నాళ్లు మేము వెనకగుడు వేయడం వల్లే వాడు భయపెడుతూ వచ్చాడు. ఇక తగ్గేదే లేదు. వాడు ఏం చేసుకుంటాడో చేసుకోని అని అంటుంది.
ఇప్పుడు కరెక్ట్‌గా మాట్లాడుతున్నావని వసుధారనుసపోర్ట్ చేస్తాడు మహేంద్ర. మనకు కావాల్సిన ఎమోషన్ ఇదే అంటూ చెబుతాడు.నా కొడుకు కాలేజీకి రాకుండా ఎవడు అడ్డుకుంటాడో చూస్తాను. శైలేంద్ర ఎక్స్‌ట్రా లు చేస్తే వాడి చితక్కోడతానని మహేంద్ర కూడా ఆవేశపడతాడు. రిషి కాలేజీకి రావాలని, అతడి దుర్మార్గాలకు పుల్‌స్టాప్ పడాలని అనుకుంటాడు.
దేవయాని పార్టీ...
వసుధారను ఎండీ పదవి నుంచి దించి తన కొడుకు ఆ సీట్‌లో కూర్చోబోతున్నాడని దేవయాని సంతోషంలో ఉంటుంది. సెలబ్రేషన్స్ కోసం స్వీట్ రెడీ చేసి తినబోతుంది. అప్పుడే శైలేంద్ర ఫోన్ చేస్తాడు. వసుధారను ఇరికించి భలే దెబ్బకొట్టావని కొడుకుతో అంటుంది దేవయాని. ఇరుక్కుంది వసుధార కాదు. మనం అని తల్లికి షాకిస్తాడు శైలేంద్ర. రిషి కాలేజీకి వస్తున్నాడని అంటాడు. రిషి ఎలా వస్తాడు. అతడు కాలేజీకి వస్తున్నాడని ఎవరు చెప్పారని దేవయాని కంగారుగా శైలేంద్రను అడుగుతుంది.
వసుధారనే స్వయంగా ఈ మాట తనతో చెప్పిందని, రిషి ముందు తన నిజ స్వరూపం బయటపెడతానని వసుధార తనతో చేసిన ఛాలెంజ్ గురించి తల్లితో చెబుతాడు. వసుధార ఏం ప్లాన్ చేస్తుందో తెలియడం లేదని వణికిపోతాడు. తాను జైలుకు వెళ్లకుండా ఏదో ఒకటి చేయమని, కాలేజీకి రమ్మని తల్లిని అడుగుతాడు. కాలేజీలో ఉండగా రిషిని టచ్ చేయడం కూడా కష్టమని తల్లితో అంటాడు శైలేంద్ర.
మహేంద్ర ఎంట్రీ...
దేవయానితో శైలేంద్ర మాట్లాడుతోండగా అప్పుడే అక్కడికి మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు. శైలేంద్ర దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటాడు. శైలేంద్ర ఏదో చెబుతున్నాడని, ఏం మాట్లాడుకుంటున్నారని దేవయానిని అడుగుతాడు మహేంద్ర. ఫంక్షన్ గురించే మాట్లాడుకుంటున్నామని దేవయాని అబద్ధం ఆడుతుంది. మారరా...ఇలాగే అబద్దాలు చెబుతూనే ఉంటారా అంటూ దేవయానిపై సెటైర్ వేస్తాడు మహేంద్ర. ఈ రోజుతో మీ మోసాలకు పుల్‌స్టాప్ పడటం ఖాయమని అంటాడు.
రిషి వస్తున్నాడు..మీరు కూడా కాలేజీకి వస్తే మంచిదని దేవయానితో అంటాడు మహేంద్ర. మీ కొడుకు చేసే దుర్మార్గాలు, అన్యాయాలకు మీరే ఆజ్యం పోశారు. అలాంటిది శైలేంద్ర నిజ స్వరూపం బయటపడే రోజు మీరు పక్కనుండకపోతే ఎలా అని దేవయానితో అంటాడు మహేంద్ర. అతడి మాటలతో దేవయాని టెన్షన్ పడుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.