Guppedantha Manasu December 1st Episode: అన్నయ్యే హంతకుడని ఫిక్సయిన రిషి - శైలేంద్రపై ఎటాక్ - దేవయాని నాటకం
01 December 2023, 7:33 IST
Guppedantha Manasu December 1st Episode: తన తల్లిని చంపించింది అన్నయ్య శైలేంద్ర అనే నిజం తెలిసి రిషి తట్టుకోలేకపోతాడు. తనను ప్రేమగా చూసుకునే అన్నయ్య ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టాడని తెలిసి ఎమోషనల్ అవుతాడు.ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
గుప్పెడంత మనసు సీరియల్
Guppedantha Manasu December 1st Episode: జగతిని హత్య చేసిన కిల్లర్‌తో శైలేంద్ర మాట్లాడిన వాయిస్ రికార్డ్‌కు సాక్ష్యంగా సంపాదిస్తాడు ముకుల్. ఆ వాయిస్ క్లిప్‌ను శైలేంద్ర, మహేంద్ర, రిషితో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్‌కు వినిపిస్తాడు ముకుల్. ఆ వాయిస్ రిషిదేనని అందరూ గుర్తుపడతారు. అయితే ఆ వాయిస్ తన కొడుకుది కాదని, ఎవరో మిమిక్రీ చేశారని ముకుల్‌తో వాదిస్తుంది దేవయాని. ముకుల్ వాదన కరెక్ట్ కాదని అతడితో చెప్పమని రిషితో అంటుంది దేవయాని. కానీ రిషి సెలైంట్‌గా ఉంటాడు.
ఫోన్ లిఫ్ట్ చేయని శైలేంద్ర...
శైలేంద్ర ఎక్కడున్నాడని ఫణీంద్రను అడుగుతాడు ముకుల్. శైలేంద్ర, దరణిలను తానే ట్రిప్‌కు పంపించానని సమాధానం చెబుతాడు. ఫణీంద్రతో పాటు ముకుల్ ఫోన్ చేసినా శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడు. దేవయాని కూడా శైలేంద్రను హెచ్చరించడానికి ఫోన్ చేస్తుంది. తన ఫోన్‌ను పోలీసులు ట్రాప్ చేసే అనుమానం ఉందని శైలేంద్ర ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో దేవయాని టెన్షన్ పడుతుంది.
శైలేంద్ర భయం...
ముకుల్‌కు మహేంద్ర అన్ని నిజాలు చెప్పాడనుకొని శైలేంద్ర భయంతో వణికిపోతాడు. పదే పదే ఇంటి నుంచి ఫోన్స్ రావడంతో అతడి భయం రెట్టింపు అవుతుంది. ముకుల్ సాక్ష్యంగా చూపించిన ఆడియో క్లిప్‌లో అన్నయ్య వాయిస్ విని రిషి ఎమోషనల్ అవుతాడు. ఇదంతా అన్నయ్య చేశాడంటే నమ్మలేకపోతున్నానంటూ బాధపడతాడు. మీ అన్నయ్య గురించి మీకు తెలిస్తే తట్టుకోలేరు. నేను చెబితే మీరు నమ్మరని ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండిపోయానని, ఈ రోజు అన్ని విషయాలు బయటపడటం ఖాయమని వసుధార అనుకుంటుంది.
సొంత తమ్ముడిలా...
అన్నయ్య నన్ను సొంత తమ్ముడిలా ప్రేమగా చూసుకున్నాడని వసుధారతో అంటాడు రిషి. అమ్మను కూడా చాలా గౌరవించేవాడని రిషి చెబుతాడు. జగతిని తాను మేడమ్ అని పిలిస్తే అమ్మ అని పిలువు...ఆ పిలుపు కోసం పిన్ని చాలా రోజులుగా ఎదురుచూస్తుంది. బాధపడుతుందని శైలేంద్ర తనను మందలించాడని గతాన్ని గుర్తుచేసుకొని రిషి ఎమోషనల్ అవుతాడు. అలాంటి అన్నయ్య...అమ్మను చంపేశాడా? అమ్మ దూరం కావడానికి అన్నయ్య కారణమా? అని రిషి తల్లడిల్లిపోతాడు.
అలా చేయాల్సిన అవసరం అన్నయ్యకు ఏముంది అని రిషి అనుకుంటాడు. అందరం కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తి ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టాడంటే నమ్మకలేకపోతున్నానని వసుధారతో అంటాడు రిషి. నాకు తెలిసిన అన్నయ్యను నమ్మాలా...మన కళ్ల ముందు ఉన్న సాక్ష్యాన్ని నమ్మలా? అని వసుధారను అడుగుతాడు. శైలేంద్ర గురించి అన్ని నిజాలు రిషికి అప్పుడే చెప్పాలయని ఫిక్స్ అవుతుంది వసుధార. కానీ అప్పుడే రిషిని ముకుల్ పిలుస్తాడు. దాంతో వసుధార ఆగిపోతుంది.
దేవయాని తడబాటు...
ఆ తర్వాత ఫణీంద్ర, మహేంద్ర ఫోన్స్ నుంచి కాల్ చేస్తే శైలేంద్ర లిఫ్ట్ చేయడం లేదని రిషితో చెబుతాడు ముకుల్. ఆ తర్వాత దేవయానిని పిలిచిన ముకుల్.... శైలేంద్రకు ఫోన్ చేయమని చెబుతాడు. కానీ ఆమె తడబడుతూ సమాధానం చెప్పడంతో ఆమె ఫోన్ తీసుకుంటాడు ముకుల్. అప్పటికే ఆమె చాలా సార్లు శైలేంద్రకు ఫోన్ చేసినట్లుగా డయల్ లిస్ట్‌లో కనిపిస్తుంది. శైలేంద్రకు ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశారని దేవయానిని అడుగుతాడు ముకుల్. అతడి మాట విని అందరూ షాక్ అవుతారు. శైలేంద్రను ఇక్కడికి పిలవడానికే ఫోన్ చేశానని అబద్ధం ఆడుతుంది దేవయాని. ఆ తర్వాత అందరి ఫోన్స్ తీసుకుంటాడు ముకుల్.
ఫణీంద్ర కోపం...
తన కొడుకు జగతి ప్రాణం తీశాడని తెలిసి కోపంతో ఫణీంద్ర ఊగిపోతాడు. నిజంగా అన్నయ్యే ఇదంతా చేశాడా అని పెదనాన్నతో రిషి అంటాడు. నమ్మిన...నమ్మకపోయినా కనిపిస్తోన్న సాక్ష్యాలను కాదనలేమని చెప్పి శైలేంద్రను మరింత ఇరికిస్తుంది వసుధార. శైలేంద్ర దుర్మార్గుడని నిరూపించే సాక్ష్యాల కోసమే ఇన్నాళ్లు ఎదురుచూశానని మహేంద్ర అనుకుంటాడు.
మరో వాయిస్...
ఇంతలోనే దేవయాని ఫోన్‌కు శైలేంద్ర మొబైల్ నుంచి కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయమని ముకుల్ అంటాడు. అవతలి వైపు నుంచి శైలేంద్ర వాయిస్ కాకుండా మరో వ్యక్తి వాయిస్ వినిపిస్తుంది. శైలేంద్ర, ధరణి ఇద్దరు గాయాలతో హాస్పిటల్‌లో ఉన్నట్లు చెబుతాడు. అతడి మాటలు విని దేవయాని, ఫణీంద్ర కంగారు పడతారు.
రౌడీలు ఎటాక్...
హాస్పిటల్ లో ధరణి కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపిస్తుంది. ఆమె దగ్గరకు వచ్చిన దేవయాని... నా కొడుకు ఎక్కడ, అతడికి ఎమైంది అంటూ అడుగుతుంది. శైలేంద్ర ఐసీయూలో ఉంటాడు. డాక్లర్లు ట్రీట్‌మెంట్ ఇస్తుంటారు. ముగ్గురు రౌడీలు వచ్చి శైలేంద్రను తన కళ్ల ముందే కత్తులతో పొడిచారని ధరణి చెబుతుంది. వాళ్లు వెళుతూ మీ ఫ్యామిలీలో ఎవరిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారని ధరణి అంటుంది.
శైలేంద్రను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని మహేంద్ర అనుమానపడతాడు. వాళ్లు మన ఫ్యామిలీ మీద పగ పట్టి ఉంటారు. శైలేంద్ర కోసం మాటు వేసి ఒంటరిగా ఉన్న సమయంలో ఎటాక్ చేసి ఉంటారని దేవయాని కన్నీళ్లు పెట్టుకుంటుంది. శైలేంద్ర ఆడిన డ్రామా ఇదని కనిపెడుతుంది. ఆ డ్రామాను తన కన్నీళ్లతో రక్తికట్టిస్తుంది. శైలేంద్ర చిన్న గాయమైన తట్టుకోలేడని, ఆ ఎటాక్ ఏదో నా మీద జరిగినా బాగుండేదని అంటుంది.
నా గుండె ఆగిపోయేలా ఉందని ఎమోషనల్ అవుతుంది. శైలేంద్ర మారిపోయిన సమయంలో ఇలా జరగడమేంటి అంటూ భర్త ఫణీంద్రతో చెబుతూ దేవయాని బాధపడుతుంది. హాస్పిటల్‌లో రిషి కనిపించడు. రిషి కోసం వసుధార వెతుకుంటుంది. అప్పుడే ఆమెకు రిషి మెసేజ్ పంపిస్తాడు. ఓ చిన్న పని ఉండి బయటకు వెళ్లానని అంటాడు.