తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu April 11th Episode: వ‌సుధార‌కు గిఫ్ట్ ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేసిన రిషి- శిష్యురాలిపై జ‌గ‌తి ప్ర‌శంస‌లు

Guppedantha Manasu April 11th Episode: వ‌సుధార‌కు గిఫ్ట్ ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేసిన రిషి- శిష్యురాలిపై జ‌గ‌తి ప్ర‌శంస‌లు

11 April 2023, 8:24 IST

google News
  • Guppedantha Manasu April 11th Episode: మీరే నా ప్రాణం అంటూ రిషిపై త‌న‌కున్న ప్రేమ‌ను వ్య‌క్త ప‌రుస్తుంది వ‌సుధార‌. ఆమె మాట‌ల‌కు ఇక‌పై మ‌న మ‌ధ్య ఎలాంటి పంతాల‌కు తావు ఉండ‌దు అంటూ రిషి మాటిస్తాడు. ఈ రోజు గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...

గుప్పెడంత మ‌న‌సు
గుప్పెడంత మ‌న‌సు

గుప్పెడంత మ‌న‌సు

Guppedantha Manasu April 11th Episode: వ‌సుధార త‌న ప్రేమ‌కు ఎదురైన‌ అన్ని స‌మ‌స్య‌ల‌ను త‌ట్టుకుంటూ ధైర్యంగా నిల‌బ‌డితే రిషి మాత్రం ఆ ప‌నిచేయ‌లేక‌పోయాడ‌ని త‌న శిష్యురాలిపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంది జ‌గ‌తి. తాను చేసే ప‌ని రైట్ అని న‌మ్మి ఎదురైన ప్ర‌తి స‌మ‌స్య‌తో పోరాటం చేసింద‌ని మెచ్చుకుంటుంది. అన్నింటిని దాటుకొని వ‌సు త‌న ప్రేమ‌ను ద‌క్కించుకుంద‌ని అంటుంది. రిషి, వ‌సు క‌లిసిపోవ‌డం ఆనందంగా ఉందంటూ మ‌హేంద్ర‌తో చెబుతుంది.

ఆమె మాట‌ల‌కు భూమి మీద ఉన్న స్త్రీ లోకానికి అంత‌టికి ఈ రోజు నేను త‌ల‌వంచి న‌మ‌స్కారం చేస్తున్నానంటూ జ‌గ‌తి రెండు చేతుల‌ను మొక్కుతాడు మ‌హేంద్ర‌. నువ్వు నా జీవితంలో నుంచి వెళ్లిపోయిన‌ప్పుడు మ‌న బంధం తెగిపోయింద‌ని తాను భ‌య‌ప‌డ‌లేద‌ని మ‌హేంద్ర ఆమెతో చెబుతాడు. ప్రేమకు బంధం వేయ‌డం త‌ప్ప తెంప‌డం తెలియ‌దు అంటూ ఎమోష‌న‌ల్ అవుతాడు. జ‌గ‌తి దూర‌మైన త‌ర్వాత తాను ఎదుర్కొన్న సంఘ‌ర్ష‌ణ‌ను త‌లుచుకుంటూ ఆవేద‌న‌కు లోన‌వుతాడు.

మా నుంచి ఒంట‌రిగా దూర‌మైన నువ్వు నీ కొడుకు కోసం ఓ బంధాన్ని తీసుకొచ్చావు. వ‌సుధారను జీవిత కాల‌పు తోడుగా రిషికి అందించిన గొప్ప త‌ల్లివి నువ్వు అంటూ జ‌గ‌తిపై ప్ర‌శంస‌లు కురిపిస్తాడు. రిషి నిన్ను అమ్మ అని పిల‌వాలి. అది నేను వినాలి అంటూ జ‌గ‌తితో చెబుతాడు. అత‌డి మాట‌ల‌కు రిషి త‌న‌ను అమ్మ అని పిల‌వ‌క‌పోయినా సంతోషంగా ఉంటే చాలాని జ‌గ‌తి చెబుతుంది.

వ‌సు ఒలింపిక్స్‌కు వెళితే...

మ‌రోవైపు పెళ్లి కుదిరిన ఆనందంలో వ‌సు మునిగిపోతుంది. పిల్ల‌ల‌తో క‌లిసి గోళీలు అడుతుంటుంది. ఇంత‌లోనే అక్క‌డ‌కు వ‌చ్చిన రిషి....గోళీలు ఆడుతోన్న వ‌సుపై సెటైర్స్ వేస్తాడు. ఒలింపిక్స్‌లో గోళీలు ఆట పెడితే గోల్డ్ మెడ‌ల్ నీకే వ‌స్తుంద‌ని అంటాడు. అత‌డి మాట‌తో రోషంగా గోళీలు ఆడ‌టం ఈజీ కాదు కావాలంటే మీరు ట్రై చేయండి అంటూ గేమ్ ఆడ‌టానికి రిషిని ఆహ్వానిస్తుంది వ‌సుధార‌.

ఫ‌స్ట్ అటెంప్ట్‌లోనే గేమ్‌లో రిషి విజ‌యం సాధిస్తాడు. అత‌డికి కంగ్రాట్స్ చెబుతుంది వ‌సు. ఆమె మాట‌ల‌కు నువ్వు నా ప‌క్క‌న ఉన్నావు. అందుకే టార్గెట్ మిస్ కాలేదంటూ రిషి చెబుతాడు. ఆ త‌ర్వాత నేను ఇక్క‌డ ఉన్నాన‌ని మీకు ఎలా తెలిసింది అని వ‌సు అడ‌గ్గా నువ్వు ఎక్క‌డ ఉన్నా నాకు తెలుస్తుంద‌ని రిషి బ‌దులిస్తాడు. నీ హార్ట్‌బీట్ ప్రీక్వెన్స్‌ను బ‌ట్టి నా హార్ట్ ఫాలో అవుతుంది అంటూ వ‌సుపై ప్రేమ‌ను కురిపిస్తాడు. .

దేవ‌యాని చిందులు...

మ‌రోవైపు రిషి, వ‌సుధార బ‌య‌ట‌కు వెళ్లి చాలా స‌మ‌యం గ‌డిచినా ఇంటికి రాక‌పోవ‌డంతో దేవ‌యాని చిరాకు ప‌డ‌తుంటుంది. జ‌గ‌తి, మ‌హేంద్ర‌ల‌ను చూసి రిషి పాడైపోతున్నాడంటూ ధ‌ర‌ణితో త‌న బాధ చెబుకుంటూ రుస‌రుస‌లాడుతుంది. పేరుకే త‌ల్లిదండ్రులు కానీ రిషి బాగోగుల్ని వారు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని సీరియ‌స్ అవుతుంటుంది.

వ‌సుధార వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి ఇళ్లు విచిత్రంగా మారిపోయింది. ప‌ద్ద‌తి పాడు లేకుండా పోయిందంటూ ఫైర్ అవుతుంది. రిషి ప‌క్క‌న వ‌సుధార ఉంటే అత‌డు ఆనందంగా ఉంటాడ‌ని భ్ర‌మ‌ప‌డుతున్నార‌ని, అంతేగానీ అత‌డి ఇష్టాల‌ను గ్ర‌హించ‌లేద‌ని వాపోతుంది. తాను త‌ప్ప రిషిని ఎవ‌రూ అర్థం చేసుకోవ‌డం లేద‌ని ధ‌ర‌ణితో చెబుతుంది.మీరు అనుకున్న‌ట్లుగా రిషి బాధ‌ప‌డ‌టం లేద‌ని చాలా సంతోషంగా క‌నిపిస్తోన్నాడ‌ని దేవ‌యానిపై ధ‌ర‌ణి సెటైర్ వేస్తుంది.

వ‌సుకు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రిషి...

వ‌సుకు శాలువాను బ‌హుమ‌తిగా ఇచ్చి ఆమెను స‌ర్‌ప్రైజ్ చేస్తాడు రిషి. ఆ శాలువాతో ముడిప‌డిన అంద‌మైన జ్ఞాప‌కాల్ని ఇద్దురు గుర్తుచేసుకుంటారు. ఆ శాలువాను జ‌గ‌తి ద‌గ్గ‌ర నుంచి తీసుకొచ్చాన‌ని రిషి అంటాడు. రిషి ఇచ్చిన గిఫ్ట్ చూసి వ‌సు మురిసిపోతుంది. మీరే నా ప్రాణం అంటుంది.

మ‌న ప్రేమ గెలుస్తుంద‌ని నాకు తెలుసు అంటూ రిషి భుజంపైవాలిపోతుంది. ఈ రోజు కోసం నాలో నేను న‌లిగిపోయాను. ప్ర‌తి క్ష‌ణం మీ కోసం ఎదురుచూశాను. ఇక‌పై అలాంటి ప‌రిస్థితి మ‌న మ‌ధ్య ఎప్పుడు రాకూడ‌దు. ఇలాగే క‌లిసి హ్యాపీగా ఉందాం అని రిషితో ప్రేమ‌గా అంటుంది. ఇక‌పై మ‌న మ‌ధ్య ఎలాంటి పంతాల‌కు తావు ఉండ‌దు అంటూ వ‌సుకు రిషి మాటిస్తాడు. అత‌డి మాట‌ల‌తో వ‌సు సంతోషంతో ఉప్పొంగిపోతుంది.

రిషి చెప్పిన ర‌హ‌స్యం...

ఇంటికి తిరిగి వెళ్లే స‌మ‌యంలో బాగా లేట్ అయ్యింద‌ని వ‌సుధార భ‌య‌ప‌డుతుంది. అయితే రిషి మాత్రం లేట్ అయినా ఏం కాదు అంటాడు. ఈ జ‌ర్నీని ఆపాల‌ని లేద‌ని, ఈ క్ష‌ణం ఇలాగే ఆగిపోతే బాగుండున‌ని, వ‌సుధార‌తో చెబుతుంటాడు. ఇంత‌లోనే పెళ్లి టాపిక్‌ను తెర‌పైకి తెస్తుంది వ‌సు.

ఆమె మాట‌ల‌కు నీకు ఒక ర‌హ‌స్యం చెబ‌తాను. కానీ ఎవ‌రికి చెప్ప‌న‌ని మాటివ్వు అంటూ వ‌సుధార‌ను కోరుతాడు రిషి. అదేమిట‌ని వ‌సు అడ‌గ్గా....పెళ్లి విష‌యంలో నీకంటే నాకే ఎక్కువ తోంద‌ర‌గా ఉంద‌ని అంటాడు. కొన్ని దాచుకోవ‌డం క‌ష్ట‌మ‌ని అందుకే నీకు చెప్పానంటూ రిషి అన‌డంతో ఈ రోజు గుప్పెడంత మ‌న‌సు ఎపిసోడ్ ముగిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం