తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guntur Kaaram: గుంటూరు కారం థియేట‌ర్‌లో ప‌ది మందే ఉన్నారు - నెటిజ‌న్ ట్వీట్ వైర‌ల్‌

Guntur Kaaram: గుంటూరు కారం థియేట‌ర్‌లో ప‌ది మందే ఉన్నారు - నెటిజ‌న్ ట్వీట్ వైర‌ల్‌

18 January 2024, 11:13 IST

  • Guntur Kaaram: గుంటూరు కారం థియేట‌ర్లు చాలా వ‌ర‌కు ఖాళీగానే ఉన్నాయంటూ నెటిజ‌న్లు చేస్తోన్న ట్వీట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. థియేట‌ర్ మొత్తంలో ప‌ది మందే ఉన్నార‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు.

మ‌హేష్ బాబు గుంటూరు కారం మూవీ
మ‌హేష్ బాబు గుంటూరు కారం మూవీ

మ‌హేష్ బాబు గుంటూరు కారం మూవీ

Guntur Kaaram: మ‌హేష్ బాబు గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో రిలీజైంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ ఫ‌స్ట్ వీకెండ్‌లోనే వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఐదు రోజుల్లో 150 కోట్ల‌కుపైగా గ్రాస్‌, 90 కోట్ల‌కుపైగా షేర్ క‌లెక్ష‌న్స్‌ను ఈ మ‌హేష్ మూవీ రాబ‌ట్టింది. నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతూ బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. ఫ‌స్ట్ డేనే ఈ మూవీ 94 కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. బుధ‌వారం రోజు ఈ సినిమా 15 కోట్ల‌కుపైగా గ్రాస్‌, ఏడు కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. బుధ‌వారం నాటి క‌లెక్ష‌న్స్‌తో వంద కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టింది.

ట్రెండింగ్ వార్తలు

Prime Video OTT Top Movies: ప్రైమ్ వీడియోలో టాప్‍కు దూసుకొచ్చిన యాక్షన్ మూవీ.. టాప్-10లో ఉన్నవి ఇవే

Vidya Vasula Aham OTT: నేరుగా ఓటీటీలోకి విద్యా వాసుల అహం సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

The Goat Life OTT: పృథ్విరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. స్ట్రీమింగ్‍కు వచ్చేది అప్పుడేనా?

OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న జర హట్కే జర బచ్కే మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్.. తెలుగులో కూడా..

థియేట‌ర్స్ ఖాళీ...

కాగా గుంటూరు కారం థియేట‌ర్ల‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు చేస్తోన్న కొన్ని ట్వీట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. గుంటూరు కారం స్క్రీనింగ్ అవుతోన్న మ‌ల్టీఫ్లెక్స్ థియేట‌ర్లు చాలా వ‌ర‌కు ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తోన్న‌ట్లు నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తోన్నారు. హైద‌రాబాద్‌లోని పీవీఆర్ థియేట‌ర్‌లో గుంటూరు కారం సినిమాను ప‌దిమందితోనే స్క్రీనింగ్ చేశార‌ని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు.

థియేట‌ర్‌లో ఆడియెన్స్‌తో కాకుండా స్పెష‌ల్ స్క్రీనింగ్ చూసిన ఫీలింగ్ క‌లిగింద‌ని ట్వీట్‌లో పేర్కొన్నాడు. గుంటూరు కారం థియేట‌ర్స్ చాలా వ‌ర‌కు ఖాళీగానే ఉన్నా మిగిలిన సినిమాల‌కు వాటికి కేటాయించ‌డం లేద‌ని మ‌రో నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. వీరి ట్వీట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

త్రివిక్ర‌మ్ టేకింగ్‌పై విమ‌ర్శ‌లు...

గుంటూరు సినిమాకు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌హించాడు. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో దాదాపు ప‌ద‌మూడేళ్ల త‌ర్వాత ఈ మూవీ తెర‌కెక్కింది. ఫ‌స్ట్ డే నుంచే గుంటూరు కారం సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ ల‌భిస్తోంది. మ‌హేష్ యాక్టింగ్, ఎన‌ర్జీ, డ్యాన్సులు బాగున్నాయంటూ అభిమానులు చెబుతోన్నారు. కానీ త్రివిక్ర‌మ్ క‌థ‌, టేకింగ్‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. కానీ సంక్రాంతికి రిలీజైన సైంధ‌వ్ డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డం గుంటూరు కారం సినిమాకు ప్ల‌స్స‌యింది.

మ‌హేష్ ఇంట్లో స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌...

గుంటూరు కారం స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ ఇటీవ‌ల మ‌హేష్‌బాబు ఇంట్లో జ‌రిగాయి. సినిమా యూనిట్‌కు మ‌హేష్ స్పెష‌ల్ పార్టీ ఇచ్చాడు. గుంటూరు కారం సినిమాలో శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించారు. హారిక హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై రాధాకృష్ణ నిర్మించాడు. గుంటూరు కారం సినిమాకు త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు.

గుంటూరు కారం త‌ర్వాత డైరెక్ట‌ర్ రాజ‌మౌళితో మ‌హేష్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఈ ఏడాది సెట్స్‌పైకి రానుంది. మ‌హేష్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ మూవీగా రాజ‌మౌళి మూవీ తెర‌కెక్కుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం