తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guntur Kaaram Day 1 Expected Collections: గుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్స్ -స‌ర్కారు వారి పాట రికార్డ్ బ్రేక్ అవుతుందా?

Guntur Kaaram Day 1 Expected Collections: గుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్స్ -స‌ర్కారు వారి పాట రికార్డ్ బ్రేక్ అవుతుందా?

12 January 2024, 11:57 IST

google News
  • Guntur Kaaram Day 1 Expected Collections: మ‌హేష్ బాబు గుంటూరు కారం మూవీ ఫ‌స్ట్ డే 45 నుంచి 50 కోట్ల మ‌ధ్య క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.  స‌ర్కారు వారి పాట మూవీ క‌లెక్ష‌న్స్ రికార్డును గుంటూరు కారం దాటుతుందా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌హేష్ బాబు గుంటూరు కారం మూవీ
మ‌హేష్ బాబు గుంటూరు కారం మూవీ

మ‌హేష్ బాబు గుంటూరు కారం మూవీ

Guntur Kaaram Day 1 Expected Collections: గుంటూరు కారం మూవీ మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా ఫ‌స్ట్ డే రికార్డ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. మ‌హేష్, త్రివిక్ర‌మ్ మూవీ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా 45 కోట్ల నుంచి 50 కోట్ల మ‌ధ్య క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా దాదాపు 2000 స్క్రీన్స్‌లో గుంటూరు కారం రిలీజైంది. ఫ‌స్ట్ డే టాక్‌తో సంబంధం లేకుండా సినిమాపై ఉన్న బ‌జ్‌తో భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

21 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌...

ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 21 కోట్ల వ‌ర‌కు జ‌రిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 18 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు వ‌చ్చాయి. నైజాంలో 10 కోట్లు కాగా..ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో మ‌రో 18 వ‌ర‌కు అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగాయి. వాట‌న్నింటిని క‌లుపుకొని ఈ సినిమా తొలి రోజు యాభై కోట్ల మార్కును ఈజీగా ట‌చ్ చేసే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

హైద‌రాబాద్‌లో ఆరు షోల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డం, టికెట్ రేట్స్ వంద వ‌ర‌కు పెంచుకునే వెసులుబాటు క‌ల్పించ‌డంలో నైజాంలోనే గుంటూరు కారం మూవీ ఎక్కువ‌గా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకోవ‌చ్చున‌ని అంటున్నారు. ఏపీ, సీడెడ్‌లో టికెట్ రేట్స్ త‌క్కువ‌గా ఉండ‌టం, ఐదు షోల కార‌ణంగా ఆశించిన దానికంటే ఫ‌స్ట్ డే త‌క్కువే ఈ మూవీ క‌లెక్ట్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

స‌ర్కారు వారి పాట రికార్డ్ బ్రేక్ చేస్తుందా?

మ‌హేష్‌బాబు లాస్ట్ మూవీ స‌ర్కారువారి పాట తొలి రోజు న‌ల‌భై ఐదు కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఆ మూవీ రికార్డును గుంటూరు కారం బ్రేక్ చేస్తుందా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ప్రీమియ‌ర్స్ నుంచి నెగెటివ్ టాక్ బాగా రావ‌డంతో స‌ర్కారు వారి పాట రికార్డ్ బ్రేక్ కావ‌డం డౌట్ అని సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో స‌ర్కారువారి పాట మూవీ 230 కోట్ల వ‌ర‌కు గ్రాస్‌ను, 121 కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. సంక్రాంతికి పోటీగా హ‌నుమాన్‌తో పాటు నాగార్జున నా సామిరంగ‌, వెంక‌టేష్ సైంధ‌వ్ సినిమాలు రిలీజ్ అవుతోన్నాయి. ఈ పోటీ కార‌ణంగా స‌ర్కారు వారి పాట క‌లెక్ష‌న్స్‌ను గుంటూరు కారం దాట‌డం డౌట్ అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

జీరో ప్ర‌మోష‌న్స్‌...

గుంటూరు కారం సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ మిన‌హా ఎలాంటి ప్ర‌మోష‌న్స్ చేయ‌లేదు. మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ ప‌ర్స‌న‌ల్‌గా ప్రెస్‌మీట్‌ల‌కు హాజ‌రుకావ‌డం, ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం చేయ‌లేదు. రిజ‌ల్ట్‌ను ముందుగానే ఊహించి వారు ప్ర‌మోష‌న్స్‌ను దూరంగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

గుంటూరు కారం సినిమాను హారిక హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌, జ‌యరాం, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు. గుంటూరు కారం త‌ర్వాత రాజ‌మౌళితో మ‌హేష్ బాబు సినిమా చేయ‌బోతున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం