తెలుగు న్యూస్  /  Entertainment  /  Godfather First Single Promo Out As Chiru And Salman Dance Together

Godfather First Single Promo: చిరు, సల్మాన్‌ కలిసి స్టెప్పేస్తే.. గాడ్‌ఫాదర్‌ ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో వచ్చేసింది

HT Telugu Desk HT Telugu

13 September 2022, 18:35 IST

    • Godfather First Single Promo: మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న గాడ్‌ఫాదర్‌ మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్ ప్రోమో మంగళవారం (సెప్టెంబర్‌ 13) సాయంత్రం 6.05 గంటలకు రిలీజైంది. ఈ ఫస్ట్‌ సింగిల్‌ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్, చిరంజీవి
గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్, చిరంజీవి (twitter)

గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్, చిరంజీవి

గాడ్‌ఫాదర్‌ అవతారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి. మలయాళ మూవీ లూసిఫర్‌ రీమేక్‌ అయిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇస్తున్నాడు. ఈ గాడ్‌ఫాదర్‌ మూవీ నుంచి మంగళవారం (సెప్టెంబర్‌ 13) ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో రిలీజైంది.

ట్రెండింగ్ వార్తలు

కార్తీకదీపం 2 సీరియల్.. పారిజాతం కన్నింగ్ ప్లాన్, ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. కోడలి గురించి బాధపడిన కాంచన

Faria Abdullah: పర్ఫెక్ట్ హస్బండ్-పర్ఫెక్ట్ వైఫ్ గురించి సినిమా.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుంది: ఫరియా అబ్దుల్లా

Priyadarshi: ఫుల్‍ జోష్‍లో ప్రియదర్శి.. లైన్‍లో హీరోగా మూడు సినిమాలు

Aamir Khan: ఆ సీన్‍ను పూర్తి నగ్నంగా చేశా: ఆమిర్ ఖాన్

తార్ మార్ తక్కర్ మార్ అంటూ సాగే ఈ పూర్తి పాట సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇండియాలోని ఇద్దరు అతిపెద్ద మెగాస్టార్లు వచ్చేశారు అంటూ ఈ ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు.

తొలిసారి సిల్వర్‌ స్క్రీన్‌పై చిరు, సల్మాన్‌ కలిసి కనిపించనున్నారు. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో సల్మాన్‌ స్పెషల్‌ అప్పియరెన్సే హైలైట్‌ కానుంది. పైగా ఈ ఇద్దరూ కలిసి స్టెప్పులేయడం అభిమానులను కచ్చితంగా అలరిస్తుంది. ఈ ఇద్దరు మెగాస్టార్ల కోసం తమన్‌ అదిరిపోయే డ్యాన్స్‌ నంబర్‌ ఇచ్చాడు. ఈ సాంగ్‌లో ఇద్దరూ ఒకేలాంటి డ్రెస్సులు వేసుకున్నారు. మోహన్‌ రాజా డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీలో టాలీవుడ్‌ యువ నటుడు సత్యదేవ్.. జైదేవ్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. ఇక సౌత్ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార సత్యప్రియగా కనిపిస్తోంది. ఈ ఇద్దరి ఫస్ట్‌ లుక్స్ కూడా ఈ మధ్యే రిలీజైన విషయం తెలిసిందే.

చిరంజీవి పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ఒక రోజు ముందుగానే అంటే ఆగస్ట్ 21నే సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇరవై ఏళ్లు ఎక్కడకు వెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. సడన్ గా తిరుగొచ్చిన ఆరేళ్లలో జనంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడంటూ మురళీ శర్మ డైలాగ్ తో టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. చిరంజీవిని ద్వేషిస్తూ కనిపించడం ఆకట్టుకుంటోంది. డు యూ నో హూ ఈజ్ హీ ఈజ్ ది బాస్ ఆప్ ది బాసెస్ అంటూ చిరంజీవి క్యారెక్టర్ స్టైలిష్ గా టీజర్ లో ఎంట్రీ ఇచ్చింది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తూ చిరు ఆకట్టుకుంటున్నారు.

సల్మాన్ ఎంట్రీ స్టైలిష్ గా ఉంది. టీజర్ చివరలో ఇద్దరు కలిసి కనిపించి అభిమానులను అలరించారు. ఈ టీజ‌ర్‌లో చిరంజీవి క్యారెక్ట‌రైజేష‌న్‌, డైలాగ్ డెలివ‌రీ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. చిరు నుంచి అభిమానులు ఆశించే హంగుల‌తో సినిమాను తీర్చిదిద్దుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

సినిమా రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు. దసరా కానుగా అక్టోబర్ 5న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో న‌య‌న‌తార, స‌త్య‌దేవ్ ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ముఖ్య‌మంత్రి కుటుంబానికి ఎదురైన ఆప‌ద‌ను ఓ గ్యాంగ్‌స్ట‌ర్ ఎలా ప‌రిష్కారించాడ‌నే పాయింట్‌తో గాడ్‌ఫాద‌ర్ రూపొందుతోంది.

మోహ‌న్‌లాల్ హీరోగా మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన లూసిఫ‌ర్ ఆధారంగా గాఢ్‌ఫాద‌ర్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.