తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nagarjuna: హోస్ట్‌గా నాగార్జున ఫెయిల్.. అంతా చప్పగా ఉంటుంది, మాజీ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్

Nagarjuna: హోస్ట్‌గా నాగార్జున ఫెయిల్.. అంతా చప్పగా ఉంటుంది, మాజీ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

28 December 2023, 5:10 IST

  • Geetu Royal About Nagarjuna Hosting: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జున ఫెయిల్ అయ్యాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున హోస్టింగ్ చప్పగా ఉంటుందని బిగ్ బాస్ 6 తెలుగు కంటెస్టెంట్ గీతూ రాయల్ చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున ఫెయిల్.. ఆయనదేం ఉండదన్న మాజీ కంటెస్టెంట్ గీతూ
బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున ఫెయిల్.. ఆయనదేం ఉండదన్న మాజీ కంటెస్టెంట్ గీతూ

బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున ఫెయిల్.. ఆయనదేం ఉండదన్న మాజీ కంటెస్టెంట్ గీతూ

Bigg Boss Telugu Nagarjuna: 2017లో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు షోకి మొదటగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసి అదరగొట్టిన విషయం తెలిసిందే. అప్పుడే మొదటగా తెలుగులో బిగ్ బాస్ షో ప్రారంభించడంతో మంచి బజ్ క్రియేట్ చేసింది. అలాగే తారక్ హోస్టింగ్‌పై ప్రశంసలు కురిసాయి. తర్వాత రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్టుగా చేసి ఆకట్టుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Satya OTT: ఓటీటీలోకి నెలకాకముందే తమిళ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్.. అందులో ఆరోజు నుంచే స్ట్రీమింగ్!

Krishna mukunda murari serial today: కృష్ణకి షాకుల మీద షాకులు ఇస్తున్న మీరా.. ఆదర్శ్, ముకుంద పెళ్ళికి ముహూర్తం ఫిక్స్

Blink OTT: ద‌స‌రా హీరో దీక్షిత్ శెట్టి సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Brahmamudi May 15th Episode: బ్రహ్మముడి- బిడ్డ తల్లి కోసం వెళ్లిన కావ్య కిడ్నాప్- 5 లక్షలకు బేరం- భార్యపై రాజ్‌కు ఆ డౌట్

ఇబ్బందిపడిన గీతూ రాయల్

ఇక బిగ్ బాస్ తెలుగు 3 సీజన్ నుంచి ఇప్పటివరకు అంటే మొన్న పూర్తయిన బిగ్ బాస్ 7 తెలుగు వరకు కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ ఏడో సీజన్‌కు బిగ్ బాస్ బజ్ యాంకర్‌గా వ్యవహరించింది మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్. ఇటీవల ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చతో గీతూ రాయల్ కూడా ఇబ్బందిపడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

స్క్రూ టైట్ చేసే ప్రశ్నలు

"బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చే కంటెస్టెంట్లపై ప్రజలకు చాలా అనుమానాలు ఉంటాయి. వాళ్లను అడగాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. నాగార్జున అడుగుతారనుకుంటే ఇప్పటివరకు ఆయన చేసిన సీజన్స్ అన్నింటిలోనూ చప్పచప్పగానే ప్రశ్నలు అడిగేవారు. స్క్రూ టైట్ చేసే ప్రశ్నలు, బెండు తీసేలా ఎప్పుడూ మాట్లాడలేదు. కూల్‌గా వచ్చి కూల్‌గా మాట్లాడేసి వెళ్లిపోయేవారు" అని గీతూ రాయల్ చెప్పింది.

స్క్రిప్ట్ వస్తుందని

"ఈ ఒక్క సీజన్‌కు (బిగ్ బాస్ 7 తెలుగు) మాత్రమే నాగార్జున కఠినంగా ఉన్నారు. నాగార్జున హోస్ట్‌‌గా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఈ మాట ఎందుకు అన్నానంటే.. నాగార్జున గారు ఎపిసోడ్స్ చూసి మాట్లాడుతారనుకున్నాను. కానీ, ఆయనకు స్క్రిప్ట్ వస్తుందన్న విషయం నాకు తెలియదు" అని బిగ్ బాస్ 6 తెలుగు కంటెస్టెంట్ గీతూ రాయల్ తెలిపింది.

స్టాండ్ తీసుకుని

"ఆరో సీజన్‌లో చంటిగారు కీర్తిని వెటకారంగా మాట్లాడారు. అప్పుడు వీకెండ్‌లో రెండుసార్లు వీడియో తిప్పి తిప్పి చూపించి నాదే తప్పు అని ఒప్పించడానికి ప్రయత్నించారు. చంటి, కీర్తి విషయంలో నా తప్పే లేదు. ఇప్పటికీ అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. అలాంటివి జరిగినప్పుడు నాగార్జున స్టాండ్ తీసుకుని ఏది కరెక్ట్.. ఏది తప్ప అనేది గట్టిగా చెబితే బాగుండేది. సన్నీ, షణ్ముఖ్ విషయంలో కూడా సన్నీ తప్పు లేకపోయినా హౌజ్ అందరితో తనదే తప్పు అనిపించారు" అని గీతూ చెప్పుకొచ్చింది.

విసుగుతెప్పించి

"నాగార్జున అడగలేకపోయిన ప్రశ్నలను బిగ్ బాస్ బజ్‌లో నేను అడిగాను" అని గీతూ రాయల్ తెలిపింది. కాగా బిగ్ బాస్ రివ్యూవర్‌గా చాలా పాపులర్ అయిన గీతూ రాయల్ బిగ్ బాస్ 6 తెలుగు సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఆ సీజన్‌లో తన మాటలతో, చేతలతో మిగతా కంటెస్టెంట్లకే కాకుండా ప్రేక్షకులకు కూడా విసుగు తెప్పించింది. ఇక ఎలిమినేట్ అయిన రోజు మాత్రం గుండె పగిలినంతగా ఏడ్చేసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం