Game On Release Date: పూరి జగన్నాథ్ స్టైల్‌లో గేమ్ ఆన్ మూవీ - రిలీజ్ డేట్ ఫిక్స్
22 January 2024, 13:28 IST
Game On Release Date: గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన గేమ్ ఆన్ మూవీ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి దయానంద్ దర్శకత్వం వహించాడు.
గేమ్ ఆన్ మూవీ
Game On Release Date: గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ‘గేమ్ ఆన్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. గేమ్ ఆన్ సినిమాకు పూరి జగన్నాథ్ శిష్యుడు దయానంద్ దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. చనిపోవాలని అనుకున్న ఓ వ్యక్తి రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి? ఈ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ‘గేమ్ ఆన్’ సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు దయానంద్ తెలిపాడు.
రా అండ్ రస్టిక్...
కమర్షియల్ కోణంలో రా అండ్ రస్టిక్‌గా ఈ మూవీ సాగుతుందని తెలిపాడు. హీరోహీరోయన్లతో పాటు సినిమాలోని ప్రతి పాత్ర నెగెటివ్ షేడ్స్‌తోనే సాగుతుందని దర్శకుడు దయానంద్ అన్నాడు. యాక్షన్, ఎమోషన్స్‌తో పాటు రొమాన్స్ పాళ్లు ఎక్కువగానే ఉంటాయని చెప్పారు. మధుబాల రోల్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని చెప్పాడు. పూరి జగన్నాథ్ శిష్యుడిగా తాను తెరకెక్కించిన గేమ్ ఆన్ మూవీ ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను పంచుతుందని అన్నాడు. రెగ్యులర్ ఫ్యామిలీ కథలకు భిన్నంగా ఫ్యామిలీ డార్క్ ఎమోషన్స్ థ్రిల్లింగ్‌గా మూవీ ఉంటుందని డైరెక్టర్ పేర్కొన్నాడు.
తెలుగు తెరపై రాని కథ...
నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ..." ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. గీతానంద్ నా క్లాస్మేట్. అతడితో ఏదో ఒక రోజు సినిమా తీద్దామని అనుకున్నా. మంచి కథతో గేమ్ ఆన్ సినిమాను స్టార్ట్ చేసాం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీన్ని రూపొందించాం. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమా ఉంటుంది. నవాబ్ గ్యాంగ్స్ అద్భుతమైన పాటలు ఇచ్చారు ఇప్పటివరకు తెలుగు తెరపై రాని సరికొత్త కథతో ఈ మూవీ ఆడియెన్స్‌ను మెప్పిస్తుందని". అని చెప్పారు.
మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి
గీతానంద్ మాట్లాడుతూ “గేమ్ ఆన్ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం. గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసే ఒక ఉద్యోగి జీవితంపై విరక్తి చెంది ఒక గేమ్ లో పడితే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. గేమ్ స్టార్ట్ చేసాం . మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి. ఈ సినిమా డైరెక్టర్ దయానంద్ నాకు తమ్ముడు అవుతాడు. గేమ్ రిలీజ్ తర్వాత అతడికి యాక్షన్ డైరెక్టర్‌గా మంచి పేరు వస్తుంది” అని చెప్పాడు.
డిఫరెంట్ కాన్సెప్ట్....
రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ దయానంద్ గేమ్ ఆన్ కథను రాశారని సీనియర్ నటుడు ఆదిత్య మీనన్ చెప్పాడుకస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించాడు.
90 ఎంఎల్‌తో ఎంట్రీ...
హీరోగా గీతానంద్‌కు ఇదే మొదటి మూవీ కావడం గమనార్హం. మరోవైపు కార్తికేయ 90 ఎంఎల్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నేహా సోలంకి. ఆ తర్వాత ఛలో ప్రేమిద్దాం. గూడుపుఠాణి, భాగ్‌సాలే సినిమాలు చేసింది. కొన్ని సీరియల్స్‌లో నటించింది.
టాపిక్