Game On Movie: హ్యాపీడేస్, ఏ మాయ చేశావే స్ఫూర్తితో...గేమ్ ఆన్ యూత్‌ఫుల్ మూవీ - డైరెక్టర్ దయానంద్
27 January 2024, 16:50 IST
Game On Movie: డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన అభిమాన దర్శకుడని, ఆయన స్ఫూర్తితోనే డైరెక్టర్ అయ్యానని దయానంద్ అన్నాడు. గేమ్ ఆన్ మూవీతో డైరెక్టర్‌గా దయానంద్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
దయానంద్
Game On Movie: హ్యాపీడేస్, ఏ మాయ చేశావే సినిమాల స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు డైరెక్టర్ దయానంద్ తెలిపాడు. గేమ్ మూవీతో దయానంద్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఫిబ్రవరి 2న థియేటర్లలో గేమ్ ఆన్ రిలీజ్ కానుంది. గీతానంద్, నేహా సోలంకి ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
గేమ్ ఆన్ విశేషాలతో పాటు తన కెరీర్ గురించి దయానంద్ వెల్లడిస్తూ...చిన్నతనం నుంచే నాకు సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. హ్యాపీ డేస్, ఏ మాయ చేశావే సినిమాలు చూసిన తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని ఫిక్సయ్యాను. డైరెక్టర్ పూరి జగన్నాథ్ నా అభిమాన దర్శకుడు. ఆయన స్ఫూర్తితో డైరెక్టర్ కావాలనుకున్నా . గేమ్ ఆన్‌కు ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశా. అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో ఆరు నెలలు ఫిలిం మేకింగ్ కోర్స్ చేశాను. అక్కడే ప్రొడక్షన్, సౌండ్ డిజైనింగ్‌తో గురించి అవగాహన కలిగింది అని తెలిపాడు.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో...
రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనతో గేమ్ ఆన్ కథ రాసుకున్నానని దయానంద్ చెప్పాడు. చచ్చిపోదాం అనుకునే వ్యక్తి జీవితంలోకి ఒక గేమ్ ప్రవేశిస్తే అతని జీవితం ఎలా మారింది అన్నదే ఈ మూవీ కథ. సినిమాలో హీరో ఆడే గేమ్‌లో తొమ్మిది టాస్క్‌లు ఉంటాయి.
ఒక్కొక్క టాస్క్ దాటుకుంటూ అతడు ఎలా ముందుకు వెళ్తాడు అన్నది ఎంగేజింగ్‌గా ట్విస్ట్‌లు, టర్న్‌లతో సాగుతుంది. సెకండాఫ్ లో వచ్చే టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.చనిపోదామని అనుకున్న ఆ వ్యక్తికి జీవితంపై ఆ గేమ్ మళ్లీ ఎలా ఆశలను చిగురించిందన్నది ఈ సినిమాలో ఆకట్టుకుంటుందని దర్శకుడు దయానంద్ అన్నాడు.
రా అండ్ రస్టిక్
గేమ్ ఆన్ రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. యూత్‌ను మెప్పించే అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా ఉంటాయని డైరెక్టర్ దయానంద్ అన్నాడు. . మధుబాల క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఆదిత్యామీనన్ సైకలాజికల్ డాక్టర్ కనిపిస్తారు. వారి యాక్టింగ్ లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. .
శుభలేఖ సుధాకర్ పాత్ర చాలా ప్లస్ పాయింట్‌గా నిలుస్తుంది. నేహా సోలంకి మాస్ రోల్ చేసింది.చాలా సర్‌ప్రైజింగ్‌గా ఆమె పాత్ర సాగుతుంది. సెకండ్ హీరోలా ఆమె పాత్ర ఉంటుంది.
థియేటర్లు తక్కువే కానీ...
తక్కువ ధియేటర్లో విడుదలైనా నెమ్మదిగా థియేటర్లు పెరిగే అవకాశం ఉంటుందని నమ్మకం ఉంది. ఇప్పటికే వేసిన కొన్ని ప్రివ్యూ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా గేమ్ ఆన్ మూవీని చూడొచ్చు అని దయాన్ చెప్పాడు.
గేమ్ ఆన్ మూవీని కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించారు. గేమ్ ఆన్ సినిమాలకు అభిషేక్ ఏఆర్, నవాబ్ గ్యాంగ్ మ్యూజిక్ అందించారు.
టాపిక్