తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Of Thrones Prequel: గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

Game of Thrones prequel: గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

Hari Prasad S HT Telugu

13 April 2023, 17:06 IST

google News
    • Game of Thrones prequel: గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ వచ్చేస్తోంది. ఈ విషయాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థ అధికారికంగా అనౌన్స్ చేసింది. దీంతో ఈ సిరీస్ అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
గేమ్ ఆఫ్ థ్రోన్స్
గేమ్ ఆఫ్ థ్రోన్స్

గేమ్ ఆఫ్ థ్రోన్స్

Game of Thrones prequel: గేమ్ ఆఫ్ థ్రోన్స్.. ఈ అమెరికన్ టీవీ సిరీస్ ఎంతలా అభిమానులను ఆకట్టుకుందో తెలుసు కదా. హెచ్‌బీవో కోసం డేవిడ్ బెనాఫ్, డీబీ వీస్ ఈ సిరీస్ క్రియేట్ చేశారు. 2011లో మొదలైన ఈ సిరీస్.. తర్వాత 8 సీజన్లు, 73 ఎపిసోడ్ల పాటు సాగి 2019లో ముగిసింది. ఇప్పుడీ హిట్ సిరీస్ ప్రీక్వెల్ రాబోతోంది.

నిజానికి రెండేళ్లుగా ఈ వార్తలు వస్తున్నా.. ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ప్రెజెంటేషన్ లో ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయడం విశేషం. ఈ సిరీస్ కు ప్రస్తుతం ఎ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్‌డమ్స్: ది హెడ్జ్ నైట్ (A Knight of the Seven Kingdoms: The Hedge Knight) అనే పేరు పెట్టారు. ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ ను జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాసిన డంక్ అండ్ ఎగ్ బుక్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టోరీ కంటే వందేళ్ల ముందు వెస్టెరోస్ కు చెందిన ఇద్దరు వీరుల కథే ఈ ది హెడ్జ్ నైట్. ఈ ప్రీక్వెల్ కు మార్టిన్ రైటర్ గా ఉండటంతోపాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గానూ ఉండనున్నాడు. మార్టిన్ ఇప్పటి వరకు మూడు నవలలు పబ్లిష్ చేశాడు. 1998లో ది హెడ్జ్ నైట్, 2003లో ది స్వోర్న్ స్వోర్డ్, 2010లో ది మిస్టరీ నైట్ అనే నవలలు రాశాడు.

ఆ మూడింటినీ కలిపి 2015లో ఎ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్‌డమ్స్ తీసుకొచ్చారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తర్వాత వెస్టెరోస్ ఆధారంగా హెచ్‌బీవో క్రియేట్ చేస్తున్న మరో సిరీస్ ఇది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ ను కూడా మార్టిన్ రాసిన ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. ఇదొక కల్పిత కథ. ఎసోస్ అనే ఖండంలోని వెస్టెరోస్ లోని ఏడు రాజ్యాల చుట్టూ తిరుగుతుంది. ఈ ఏడు రాజ్యాలకు చెందిన ఐరన్ థ్రోన్ కోసం ఎనిమిది కుటుంబాల మధ్య జరిగే యుద్ధాన్ని ఈ సిరీస్ లో చూపించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం